మరో సినీ వారసురాలు రెడీ! | Rajasekhar and Jeevitha elder daughter may ready to film industry | Sakshi
Sakshi News home page

మరో సినీ వారసురాలు రెడీ!

Published Fri, Jun 2 2017 6:45 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM

మరో సినీ వారసురాలు రెడీ!

మరో సినీ వారసురాలు రెడీ!

చెన్నై: సినీ రంగానికి మరో నట వారసురాలు పరిచయం కానుంది. కోలీవుడ్‌లో నటుడిగా పరిచయం అయినా టాలీవుడ్‌లో రాణిస్తున్నారు సీనియర్ నటుడు రాజశేఖర్‌. నటి జీవిత, రాజశేఖర్ దంపతుల వారసురాలిగా శివానిని తెరంగేట్రం చేయించడానికి రంగం సిద్ధమైందన్నది తాజా సమాచారం. రాజశేఖర్, జీవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా శివాని పెద్దమ్మాయి. ఈమె చదువుకుంటున్న సమయంలోనే సినీ కార్యక్రమాల్లో చూసిన దర్శక నిర్మాతలు చాలామంది హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చినా 'ఇప్పడే కాదు.. అమ్మాయి చదువు పూర్తి కానీయండి' అంటూ బదులిచ్చేవారు ఈ దంపతులు.

అయితే తాజాగా రాజశేఖర్, జీవితలు తమ వారసురాలిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల శివానితో ఫొటో సెషన్‌ చేపించారని.. అంతేకాదు ఆమె తండ్రి, సీనియర్ హీరో రాజశేఖర్ స్వయంగా కథలు వింటున్నారట. అంతా కుదిరితే త్వరలోనే మరో సినీ వారసురాలిని తెరపై చూడవచ్చనని అభిమానులు ఉత్సహంగా ఉన్నారు. కాగా, శివాని ఫస్ట్ మూవీ తెలుగులోనా? లేక తమిళంలోనా? అన్న దానిపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది. తల్లిదండ్రుల నట వారసత్వాన్ని శివాని మరో మెట్టు ఎక్కిస్తుందా.. లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement