ఒకే సినిమాతో స్టార్ వారసుల ఎంట్రీ..? | Rajasekhar Daughter Shivani Debut Movie with Shiva Kandukuri | Sakshi
Sakshi News home page

ఒకే సినిమాతో స్టార్ వారసుల ఎంట్రీ..?

Published Thu, Jul 27 2017 12:01 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 PM

ఒకే సినిమాతో స్టార్ వారసుల ఎంట్రీ..?

ఒకే సినిమాతో స్టార్ వారసుల ఎంట్రీ..?

ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటుడు రాజశేఖర్. ఇటీవల సక్సెస్ లేక కష్టాల్లో పడ్డ ఈ యాంగ్రీ హీరో తన వారసురాలిగా కూతురు శివానీని ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఫోటో షూట్ లతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివాని, సరైన లాంచింగ్ కోసం ఎదురుచూస్తుంది. తెలుగు, తమిళ భాషల దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతోంది.

తాజాగా శివాని తొలి చిత్ర హీరోకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. పెళ్లి చూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించటంతో పాటు జాతీయ అవార్డును సైతం అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి తన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement