నాన్నే నిజమైన హీరో ! | Rajasekhar Daughter Shivani To Debut In Tamil | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 9 2018 6:43 AM | Last Updated on Mon, Apr 9 2018 6:44 AM

Rajasekhar Daughter Shivani To Debut In Tamil - Sakshi

కూతురు శివానితో హీరో రాజశేఖర్‌

సినీరంగంలో మా నాన్నే నా హీరో అని అంటోంది రాజశేఖర్, జీవితల పెద్ద కూతురు శివాని. వైద్యవిద్య చదువుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఇప్పటికే 2స్టేట్స్‌ హిందీ చిత్ర తెలుగు రీమేక్‌లో నటించడానికి ఎంపికైన శివాని త్వరలో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా శివాని ఏమంటుందో చూద్దాం. 

‘నా తండ్రి రాజశేఖరే నాకు నటనలో స్ఫూర్తి. ఆయన డాక్టరు వృత్తిని వదిలి పెట్టకుండానే నటనను కొనసాగిస్తున్నారు. నాన్న వద్ద వైద్యం చేయించుకునేవారు ఆయన్ని మ్యాజిక్‌మ్యాన్‌ అంటుంటారు. నాకు నచ్చిన రంగాలు రెండు. ఒకటి వైద్యం, రెండు నటన. నేను మంచి డాక్టరుగా, నటిగా అవుతాననే నమ్మకం ఉంది. కుటుంబం, స్నేహితుల ముందు నటిస్తున్నానని భావించు. అప్పుడే కెమెరా ముందు ఎలాంటి భయం లేకుండా నటించగలవు అని నాన్న చెప్పారు. ఆయన మాటల్ని పాఠిస్తున్నాను. 

నేను కూచిపూడి, కథకళి డాన్స్‌ నేర్చుకుంటున్నాను. కిక్‌బాక్సింగ్‌ విద్యలోనూ శిక్షణ పొందుతున్నాను. చిత్రాల్లో గాయనిగానూ పేరు తెచ్చువాలన్న ఆశ ఉంది. అందుకే కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంటున్నాను. నాన్నే నా సినీ ప్రపంచ హీరో. నేను మా అమ్మలా ఉన్నానంటే సంతోషమే. ఈ తరం హీరోయిన్లలో నటి సమంత నచ్చిన నాయకి’.  అని తన అభిరుచులు, అభిప్రాయాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement