హీరోయిన్‌గా మరో వారసురాలు.. | ​hero rajasekhar daughter shivani as heroine | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌గా మరో వారసురాలు..

Published Sat, Jun 3 2017 9:59 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

హీరోయిన్‌గా మరో వారసురాలు..

హీరోయిన్‌గా మరో వారసురాలు..

సినీరంగానికి మరో నట వారసురాలు సిద్ధం అవుతోంది. హీరో రాజశేఖర్‌, జీవిత దంపతుల వారసురాలు శివానిని నాయకిగా తెరంగేట్రం చేయించడానికి రంగం సిద్ధం అయ్యిందన్నది తాజా సమాచారం. రాజశేఖర్, జీవిత ఇద్దరు కూతుళ్లలో శివాని పెద్దది. ఈమె చదువుకుంటున్న సమయంలోనే సినీ కార్యక్రమాల్లో చూసిన దర్శక నిర్మాతలు చాలామంది హీరోయిన్‌గా చేయమని అడిగినా ఇప్పడే కాదు చదువు పూర్తి చేయాలంటూ వాయిదా వేస్తూ వచ్చారు ఆమె తల్లిదండ్రులు. 

తాజాగా రాజశేఖర్, జీవిత తమ వారసురాలిని రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఇటీవల శివానిని వివిధ గెటప్‌లలో ఫొటో సెషన్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రాజశేఖరే స్వయంగా ఆమె కోసం కథలు వింటున్నారట. మొత్తం మీద శివాని సినీ తెరంగేట్రానికి రంగం సిద్ధం అవుతోందన్నమాట. అయితే ఈ అమ్మడు తొలి చిత్రం తెలుగు అవుతుందా? తమిళం అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. అదే విధంగా నట వారసురాళ్లు తెరంగేట్రం సులభమే. ఆ తరువాత నిలదొక్కుకోవడం అన్నది వారి ప్రతిభ, అదృష్టం పైనే ఆధారపడి ఉంటుంది. మరి శివాని అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement