‘‘గరుడవేగ’ సినిమా కథని ప్రవీణ్‌గారు ఏ ముహూర్తంలో రాశారో కానీ, నా కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ‘అంకుశం’ కంటే ఈ చిత్రం పెద్ద సక్సెస్. అందుకు ప్రవీణ్‌గారికి కృతజ్ఞతలు’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్, పూజా కుమార్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ ఇటీవల విడుదలై హిట్ అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘జీవిత వల్లనే ‘గరుడవేగ’ పూర్తయింది. తను ఈ సినిమాను నాకు గిఫ్ట్‌లా ఇచ్చారని చెప్పొచ్చు. మా సినిమాను చూసి అభినందించిన చిరంజీవిగారికి థ్యాంక్స్’’ అన్నారు. ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ– ‘‘గరుడవేగ’ విడుదలైన తొలి ఆట నుంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది.
అదే రోజు సాయంత్రానికి సక్సెస్ రేంజ్ మాకు అర్థమైపోయింది. హాలీవుడ్ సినిమాలా ఉందని కొందరు, సరికొత్త రాజశేఖర్‌ని చూశామని మరికొందరు అంటున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు తమదిగా భావించారు. కంటెంట్ ఉంటే ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. అమెరికాలోనూ వసూళ్లు ఇక్కడిలాగా బాగున్నాయి’’ అన్నారు. ‘‘మానవత్వం చాలా తక్కువమందిలో ఉంటుంది. అటువంటి వారిలో ప్రవీణ్ ఒక్కరు. తనకు థ్యాంక్స్ చెప్పడం కూడా తక్కువే. బాలకృష్ణగారు, రానా, తాప్సీ, కాజల్, మంచు లక్ష్మి ప్రమోషన్‌కి సహకరించారు. చిరంజీవిగారు, మహేశ్‌గారు, రాజమౌళిగారితో పాటు ఇండస్ట్రీ అంతా సినిమా హిట్ అయినందుకు అభినందించారు. వారందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు జీవిత.
జీవిత ఇచ్చిన గిఫ్ట్ గరుడవేగ – రాజశేఖర్
Published Wed, Nov 8 2017 12:25 AM | Last Updated on Wed, Nov 8 2017 12:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment