
‘గరుడవేగ’ వంటి హిట్ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా నటించనున్న చిత్రం ‘కల్కి’. ‘అ!’ సినిమా ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్‌కి జోడీగా అదా శర్మ నటించనున్నారు. 2016లో విడుదలైన ‘క్షణం’ సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు అదా. తాజాగా రాజశేఖర్‌తో నటించే చాన్స్ అందుకున్నారామె. నిజానికి హీరోయిన్ల లిస్టులో పలువురి పేర్లు వినిపించినా, ఫైనల్‌గా అదా శర్మను ఖరారు చేశారు.
ఈ పాత్రకు ఆమె అయితే కరెక్టుగా సరిపోతారని చిత్రవర్గాలు భావించి, అదాను సంప్రదించగా వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మించనున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో 1983 నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో నందితా శ్వేత ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా, బ్రిటిష్ మోడల్ స్కార్లెట్ విల్సన్ ప్రత్యేక పాటతో అలరించనున్నారు. నవంబర్ 9న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment