romance Vikram
-
అదా సంగతి
‘గరుడవేగ’ వంటి హిట్ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా నటించనున్న చిత్రం ‘కల్కి’. ‘అ!’ సినిమా ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్‌కి జోడీగా అదా శర్మ నటించనున్నారు. 2016లో విడుదలైన ‘క్షణం’ సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు అదా. తాజాగా రాజశేఖర్‌తో నటించే చాన్స్ అందుకున్నారామె. నిజానికి హీరోయిన్ల లిస్టులో పలువురి పేర్లు వినిపించినా, ఫైనల్‌గా అదా శర్మను ఖరారు చేశారు. ఈ పాత్రకు ఆమె అయితే కరెక్టుగా సరిపోతారని చిత్రవర్గాలు భావించి, అదాను సంప్రదించగా వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మించనున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో 1983 నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో నందితా శ్వేత ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా, బ్రిటిష్ మోడల్ స్కార్లెట్ విల్సన్ ప్రత్యేక పాటతో అలరించనున్నారు. నవంబర్ 9న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
ఇద్దరు భామలతో విక్రమ్ రొమాన్స్
నటుడు విక్రమ్ ఇద్దరు హీరోయిన్లతో నటించి చాలా కాలమైంది. ఆ మద్య ధూళ్ చిత్రంతో జ్యోతిక, రిమాసేన్‌లతో రొమాన్స్ చేశారు. తాజాగా మరోసారి ఇద్దరు భామలతో యువళ గీతాలు పాడడానికి సిద్ధం అవుతున్నారు. విక్రమ్ ఐ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత విజయ్‌మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎండ్రదుక్కుల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. తదుపరి విక్రమ్, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. తాజాగా విక్రమ్ యువ దర్శకులపై దృష్టి సారించారు. ఇద్దరు యువ దర్శకులకు పచ్చ జెండా ఊపారు. అందులో ఒకరు ఆనంద్‌శంకర్. ఈయన ఇంతకు ముందు విక్రమ్‌ప్రభు హీరోగా అరిమానంబి చిత్రన్ని తెరకెక్కించారన్నది గమనార్హ్హం. ఈయన ఇప్పుడు విక్రమ్‌ను డెరైక్ట్ చేయనున్నారు. ఇందులో ఇద్దరు బ్యూటీస్‌తో రొమాన్స్ చేయనున్నారు. అందులో ఒకరు కాజల్‌అగర్వాల్ కాగా మరొకరు ప్రియాఆనంద్. కాగా విక్రమ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మరో యువ దర్శకుడి పేరు అమిద్. ఈయన తొలి చిత్రం రాజతందిరం. ఎలాంటి అంచనాలు లేకుండా తెరపైకొచ్చిన ఈచిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో అమిద్ కిప్పుడు విక్రమ్‌తో పని చేసే అవకాశం వచ్చిందని సమాచారం. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత బాణీలు కట్టనున్నట్టు తెలిసింది. అయితే విక్రమ్ ముందు ఆనంద్ శంకర్ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తరువాత అమిద్ చిత్రం చేస్తారని తెలిసింది.