‘గరుడవేగ’ హిట్‌తో మళ్లీ సక్సెస్‌ను అందుకున్న యాంగ్రీమెన్ రాజశేఖర్.. తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో జాగ్రత్త వహించారు. అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్‌డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీకి సంబంధించి ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
మోషన్ పోస్టర్స్‌తోనే సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్‌ను ప్రకటించింది చిత్రయూనిట్. రేపు (ఏప్రిల్ 10) ఉదయం 10:10:10 (పది గంటల పది నిమిషాల పది సెకన్ల)కు మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
Now amidst all the chaos.. Kalki teaser will be out tomorrow. Hope you guys will love it.
— Dr.Rajasekhar (@ActorRajasekhar) April 9, 2019
April 10th at 10hr 10min 10sec. #KalkiTeaser @PrasanthVarma @eyrahul @adah_sharma @Nanditasweta @ProducerCKalyan pic.twitter.com/FXhqrcRObk
Comments
Please login to add a commentAdd a comment