ముందు కోలీవుడ్‌కే వస్తా! | shivani daughter of rajasekhar & Jeevitha, to make tamil cinema debut | Sakshi
Sakshi News home page

ముందు అక్కడే అంటున్న శివానీ!

Jun 14 2017 7:50 PM | Updated on Sep 5 2017 1:37 PM

ముందు కోలీవుడ్‌కే వస్తా!

ముందు కోలీవుడ్‌కే వస్తా!

ముందుగా కోలీవుడ్‌కే వస్తానంటోంది రాజశేఖర్‌- జీవితల వారసురాలు శివానీ. ఈ అమ్మడు తల్లిదండ్రుల బాటలోనే నడవడానికి సిద్ధం అయ్యిందట.

ముందుగా కోలీవుడ్‌కే వస్తానంటోంది రాజశేఖర్‌- జీవితల వారసురాలు శివానీ. ఈ అమ్మడు తల్లిదండ్రుల బాటలోనే నడవడానికి సిద్ధం అయ్యిందట. రాజశేఖర్, జీవిత తమ సినీ జీవితాన్ని కోలీవుడ్‌లో ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్‌లో రాణించారన్నది తెలిసిందే. వారి వారసురాలు శివానీ కూడా తన సినీ జీవితాన్ని కోలీవుడ్‌ నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించింది. రాజశేఖర్, జీవితలకు శివాని, శివాద్మి కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు శివాని. తల్లి జీవిత పలుకులను పుణికిపుచ్చుకున్న ఈ బ్యూటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

‘అమ్మ, నాన్న సినిమాకు చెందిన వారు కావడంతో నాకూ సినిమా, నటన చిన్నతనం నుంచి పరిచయమే. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ పొందాను. సంగీతం అంటే చాలా ఆసక్తి. కీబోర్డ్, గిటార్, వీణ వాయిద్యాల్లో పరిచయం ఉంది. చెల్లెలు శివాద్మితో కలిసి యూట్యూబ్‌లో పాటలు పాడటం మాకు కాలక్షేపం. కిక్‌బాక్సింగ్‌ నేర్చుకుంటున్నాను. ఇక ఫిట్‌నెస్‌ అంటే చాలా ఇష్టం. దానికి నేను అడిక్షన్‌ అనే చెప్పాలి. పుట్టింది తమిళనాడులో, పెరిగింది హైదరాబాద్‌లో బంధువులందరూ చెన్నైలోనే ఉన్నారు. వారితో తమిళంలోనే మాట్లాడతాను.

ఎక్కువగా తమిళ చిత్రాలు చూస్తుంటాను. నటుడు ధనుష్‌ అంటే ఎంతిష్టమో. ఆయన నటించిన 3 చిత్రం చూసి ఎమోషన్‌తో ఏడ్చేశాను. నటుడు విశాల్‌ అంటే చాలా ఇష్టం.ఆయన చాలా మ్యాన్లీమెన్‌. ఇక విజయ్‌ సేతుపతి భలే యాక్టర్‌. అయినా నాకెప్పటికీ నాన్నే హీరో. ఎంబీబీఎస్‌ మూడో సంవత్సం చదువుతున్నాను. డాక్టర్‌ అయిన తరువాతే యాక్టర్‌ అవ్వమని అమ్మ, నాన్న అన్నారు.’  అంటూ శివాని చెప్పిన సంగతులు ఇవీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement