
Director Shankar Son Arjith To Debut As Hero: ప్రముఖ డైరెక్టర్ శంకర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో తీర్చిదిద్ది విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తారు. ఇక కమల్, రజనీ, విక్రమ్ సహా ఎంతోమందికి తమ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చిన డైరెక్టర్ ఆయన. ఇప్పుడు శంకర్ తన కొడుకు తనయుడు అర్జిత్‌ను హీరోగా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే అర్జిత్ యాక్టింగ్, డైరెక్షన్‌లో శిక్షణ ఇప్పించినట్లు తెలుస్తుంది.
2004లో శంకర్ నిర్మించిన కాదల్ చిత్రం సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ప్రేమిస్తే పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి ఇక్కడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆ చిత్రం సీక్వెల్‌తో అర్జిత్ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నారు. ఈ సినిమాను సైతం శంకర్ స్వయంగా నిర్మించనున్నారు. ఇక ఇప్పటికే శంకర్ చిన్న కూతురు అదితి కార్తీ సరసన ఓ చిత్రంలో నటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment