శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ.. ఆ స్టార్‌ హీరోతోనే! | Sreeleela Kollywood Debut With Star Hero Goes Viral, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Sreeleela Kollywood Debut: శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ.. ఆ స్టార్‌ హీరోతోనే!

Published Fri, May 17 2024 4:36 PM | Last Updated on Fri, May 17 2024 5:08 PM

Sreeleela Debut With kollywood Star Hero Geos Viral

తమిళ నటుడు అజిత్‌ ఇప్పుడు ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందు విడాముయర్చి. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. మగిళ్‌ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ. మార్క్‌ ఆంటోని చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు జంటగా నటి శ్రీలీల, సిమ్రాన్‌, మీనా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే నటి శ్రీలీల కోలీవుడ్‌ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.

కాగా.. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల సైలెంట్‌గా ఎలాంటి హంగామా లేకుండా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అంతేకాదు శుక్రవారంతో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంటుందని అజిత్‌ సన్నిహితుడు తెలిపారు. హైదరాబాద్‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు, అజిత్‌ పాల్గొనే ఇంట్రో పాటను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.

కాగా అజిత్‌ తదపరి విడాముయర్చి చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నారని.. జూన్‌ రెండు లేదా మూడో వారంలో ఈ చిత్రం షూటింగ్‌ ఉంటుందని చెప్పారు. ఇదే ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారని తెలిపారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నట్లు తాజా సమాచారం. దీనికి ముందు విడాముయర్చి చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement