Sivani
-
ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలి
-
'అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది'.. శివాని క్రేజీ కామెంట్స్!
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కోటబొమ్మాళి పీఎస్'. ఈ చిత్రంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. అర్జున ఫల్గుణ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్- 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివాని రాజశేఖర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయిగా నటించా. ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం.. నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. గ్లామరస్ పాత్రల గురించి మాట్లాడుతూ.. 'ప్రస్తుతానికైతే వాటి గురించి ఆలోచించడం లేదు. మన చేతిలో ఉన్నది హార్డ్ వర్క్ చేయడమే అని నమ్ముతా. నచ్చింది చేసుకుంటూ పోవడమే నా పని. రిజల్ట్, సక్సెస్ వాటంతట అవే వస్తాయి. గ్లామర్ రోల్స్ కూడా చేయాలని ఉంది. వాటి కోసం వెయిట్ చేస్తున్నా. మా కథల విషయంలో అమ్మా, నాన్న జోక్యం చేసుకోరు. మా పై వారికి నమ్మకం ఉంది.' అని అన్నారు. శ్రీకాంత్ సార్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని.. ఆయన సెట్లో చాలా సరదాగా ఉంటారని తెలిపింది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర హైలెట్‌గా ఉంటుందని తెలిపింది. -
Hyderabad : ‘టీచ్ ఫర్ చేంజ్’ ఈవెంట్లో సెలబ్రిటీల తళుకులు (ఫొటోలు)
-
మండపంలో పెళ్లికూతురు మిస్సింగ్.. ఊహించని రెస్పాన్స్
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 'అహ నా పెళ్లంట'. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా అదరగొడుతోంది. నవంబర్ 17న జీ5లో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్గా విడుదలైన ఈ వెబ్ సిరీస్ అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. అతి తక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్‌ను చేరుకుంది. అంతే కాకుండా ఐఎండీబీ ప్రకటించిన టాప్ టెన్ ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల లిస్టులోనూ చోటు దక్కించుకుంది. తెలుగులో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సిరీస్‌ను అన్నీ భాషల్లో ప్రమోట్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అసలు కథేంటంటే..: ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆక్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటనేదే అసలు కథ. మన కథానాయకుడు పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కూతురు తన ప్రేమికుడితో వెళ్లిపోతుంది. అప్పుడు మన హీరో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తీరా ఆ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ శివానీ రాజశేఖర్ మధ్య కెమిస్ట్రీ మెయిన్ హైలైట్ అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్ కుటుంబం అంతా కలిసి చూసేలా ఉందని అందరూ అంటున్నారు. ఈ వారాంతాన్ని మీ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపాలకుంటే వెంటనే అహ నా పెళ్లంట చూసేయండి. -
మొక్కలు నాటిన జీవితా-రాజశేఖర్
సాక్షి, మేడ్చల్ : జీవితా-రాజేశేఖర్ కుటుంబం హరితహారంలో భాగమైంది. ఆదివారం కూతురు శివాని జన్మదినం సందర్భంగా కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద జీవిత, రాజశేఖర్, కూతుళ్లు శివాని, శివాత్మికలు మొక్కలు నాటారు. కాగా, గత మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఓఎస్టీ ప్రియాంక వర్గీస్‌తో జీవితా రాజశేఖర్ భేటీ అయిన విషయం తెలిసిందే. హరితహారంలో భాగస్వామ్యం విషయమై చర్చించారు. తమ ట్రస్ట్ ద్వారా హరితహారంలో పాల్గొనే విషయంపై ప్రియాంక చర్చించినట్లు జీవిత వెల్లడించారు. హరితహారం కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని జీవిత పేర్కొన్నారు. -
ప్రేమకథ షురూ
యస్... హల్చల్ చేసిన వార్తలు నిజమయ్యాయి. జీవితారాజశేఖర్ దంపతుల ముద్దుల తనయ శివానీ తొలి సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. హిందీలో ఘనవిజయం సాధించిన ‘2 స్టేట్స్’ రీమేక్ ద్వారా శివానీ కథానాయికగా పరిచయం కానుంది. అడవి శేష్, శివానీ జంటగా నటించనున్నారు. వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.‘‘శివానీ తొలి చిత్రం కోసం ఎన్నో కథలు విన్నప్పటికీ నటనకు మంచి ఆస్కారం ఉండటంతో ‘2 స్టేట్స్’ని సెలెక్ట్ చేసుకున్నారు. బ్యూటిఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు వినాయక్ దగ్గర వెంకట్ రెడ్డి అసోసియేట్‌గా చాలా చిత్రాలకు పనిచేశారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్. -
ముందు కోలీవుడ్‌కే వస్తా!
ముందుగా కోలీవుడ్‌కే వస్తానంటోంది రాజశేఖర్- జీవితల వారసురాలు శివానీ. ఈ అమ్మడు తల్లిదండ్రుల బాటలోనే నడవడానికి సిద్ధం అయ్యిందట. రాజశేఖర్, జీవిత తమ సినీ జీవితాన్ని కోలీవుడ్‌లో ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్లో రాణించారన్నది తెలిసిందే. వారి వారసురాలు శివానీ కూడా తన సినీ జీవితాన్ని కోలీవుడ్ నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించింది. రాజశేఖర్, జీవితలకు శివాని, శివాద్మి కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు శివాని. తల్లి జీవిత పలుకులను పుణికిపుచ్చుకున్న ఈ బ్యూటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘అమ్మ, నాన్న సినిమాకు చెందిన వారు కావడంతో నాకూ సినిమా, నటన చిన్నతనం నుంచి పరిచయమే. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ పొందాను. సంగీతం అంటే చాలా ఆసక్తి. కీబోర్డ్, గిటార్, వీణ వాయిద్యాల్లో పరిచయం ఉంది. చెల్లెలు శివాద్మితో కలిసి యూట్యూబ్‌లో పాటలు పాడటం మాకు కాలక్షేపం. కిక్‌బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. ఇక ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. దానికి నేను అడిక్షన్ అనే చెప్పాలి. పుట్టింది తమిళనాడులో, పెరిగింది హైదరాబాద్‌లో బంధువులందరూ చెన్నైలోనే ఉన్నారు. వారితో తమిళంలోనే మాట్లాడతాను. ఎక్కువగా తమిళ చిత్రాలు చూస్తుంటాను. నటుడు ధనుష్ అంటే ఎంతిష్టమో. ఆయన నటించిన 3 చిత్రం చూసి ఎమోషన్‌తో ఏడ్చేశాను. నటుడు విశాల్ అంటే చాలా ఇష్టం.ఆయన చాలా మ్యాన్లీమెన్. ఇక విజయ్ సేతుపతి భలే యాక్టర్. అయినా నాకెప్పటికీ నాన్నే హీరో. ఎంబీబీఎస్ మూడో సంవత్సం చదువుతున్నాను. డాక్టర్ అయిన తరువాతే యాక్టర్ అవ్వమని అమ్మ, నాన్న అన్నారు.’ అంటూ శివాని చెప్పిన సంగతులు ఇవీ. -
తేజ దర్శకత్వంలో స్టార్ వారసురాలు
చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ఇండస్ట్రీని మలుపు తిప్పిన దర్శకుడు తేజ. అంత కొత్త వారితో తిరుగులేని విజయాలు సాధించిన ఈ గ్రేట్ డైరెక్టర్, కొంత కాలంగా సక్సెస్ కు దూరమయ్యాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్ అవ్వటంతో ఆయన కెరీర్ కష్టాల్లో పడింది. లాంగ్ గ్యాప్ తరువాత ప్రస్తుతం రానా హీరోగా ఓ పొలిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు తేజ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. నేనే రాజు నేనే మంత్రి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మరోసారి తన మార్క్ లవ్ స్టోరిని చేసే ఆలోచనలో ఉన్నాడు తేజ. అంతా కొత్త వారితో ఓ క్యూట్ లవ్ స్టోరిని ప్రీపేర్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ హీరో రాజశేఖర్ కూతురు శివానిని హీరోయిన్గా పరిచయం చేయబోతున్నాడట. గతంలో రాజశేఖర్ హీరోగా తేజ అహం అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా చర్చల దశలోనే ఆగిపోయింది. గతంలో తేజ పరిచయం చేసిన నటీనటులు ఇప్పుడు స్టార్ గా వెలుగొందుతున్నారు. అదే బాటలో రాజశేఖర్ కూతురికి కూడా తేజ బ్రేక్ ఇస్తాడేమో చూడాలి. -
మూడో రౌండ్లో శివాని, సాత్విక
టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-4 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మారుులు అమినేని శివాని, సామ సాత్విక మూడోరౌండ్లోకి ప్రవేశించారు. ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ బాలికల రెండో రౌండ్లో శివాని అమినేని (తెలంగాణ) 6-1, 6-0తో భక్తి పర్వాని (గుజరాత్)పై గెలుపొందగా... సామ సాత్విక (తెలంగాణ) 6-3, 6-2తో జితాషా శాస్తి్ర (మహారాష్ట్ర)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రత్యూష (తెలంగాణ) 6-3, 6-1తో శివాని మంజన (కర్నాటక)పై, శ్రీవల్లి రష్మిక (తెలంగాణ) 7-6 (3), 6-2తో దివ్యవాణి (తమిళనాడు)పై, సహజ (తెలంగాణ) 6-4, 6-0తో లాస్య పట్నాయక్ (తెలంగాణ)పై, సారుు దేదీప్య (తెలంగాణ) 6-1, 7-5తో గౌరి (మహారాష్ట్ర)పై, హర్ష సారుు (తెలంగాణ) 6-2, 6-1తో శ్రీజ రెడ్డిపై, శ్రావ్య శివాని (తెలంగాణ) 6-3, 6-3తో ఎం. షేక్ (ఏపీ)పై విజయం సాధించారు. బాలుర విభాగంలో శశాంక్ తీర్థ (తెలంగాణ) 7-5, 6-2తో సత్య (తమిళనాడు)పై, శ్రీవత్స రాచకొండ (తెలంగాణ) 6-3, 6-1, 6-1తో మిశ్రాపై నెగ్గారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు బాలికలు: అకాంక్ష భాను (గుజరాత్) 6-2, 6-4తో ముస్కాన్ గుప్తా (ఢిల్లీ)పై, సల్సా అహెర్ (మహారాష్ట్ర) 6-4, 6-3తో రిషిక రవి (తమిళనాడు)పై, ఎ. చక్రవర్తి (ఢిల్లీ) 6-4, 6-1తో వినీత (తెలంగాణ)పై, శివాని స్వరూప్ (మహారాష్ట్ర) 6-3, 6-2తో ఉర్మి పాండ్యాపై, తనీషా కశ్యప్ (అస్సాం) 6-1, 6-4తో డర్నా మదళియార్పై, వైదేహి చౌదరీ (గుజరాత్) 6-1, 6-2తో షాజియా బేగంపై గెలుపొందారు. బాలురు: అలెక్స్ సోలంకి 6-2, 6-4తో కెవిన్ పటేల్ (గుజరాత్)పై, రిషబ్ (ఛత్తీస్గడ్) 6-2, 6-0తో రోహిత్‌పై, నితిన్ 6-2, 6-0తో అర్జున్ (కర్నాటక)పై, ధ్రువ్ 6-1, 6-4తో జాదవ్‌పై, సురేశ్ (తమిళనాడు) 6-2, 6-3తో మహదేవన్‌పై, కబీర్ 6-4, 6-4తో మకేర్పై, సచిత్ (ఢిల్లీ) 6-3, 6-3తో సెంథిల్ కుమార్‌పై నెగ్గారు. -
ప్రేమ కోసమై...వేషం మార్చెను!
గాంధీలో హల్చల్ చేసిన మహిళ అరెస్ట్ హైదరాబాద్ : ప్రేమ... ఎంత పనైనా... ఎలాంటి సాహసమైనా చేయిస్తుందనడానికి... ఏ వేషమైనా వేయిస్తుందనడానికి ఉదాహరణ ఆ మహిళ ఉదంతం. ప్రియుడితో చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి ఆడిన నాటకం... ఆమెను చిక్కుల్లో పడేసింది. ఏకంగా జైలు పాలు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి చిలకలగూడ డీఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివీ...సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సోమవారం డాక్టర్ వేషంలో హడావుడి చేసిన మహిళ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఆమె ఆ అవతారం ఎత్తడానికి కారణం ‘ప్రేమ’ని పోలీసుల వద్ద వెల్లడించింది. ఆమె పేరు కె.శివాని(33). మహబూబ్‌నగర్‌లోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన ఆమె స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆయాగా పని చేసేది. స్థానికుడైన బాలయ్యతో 2002లో శివానికి వివాహమైంది. ఆరేళ్ల వయసు గల కుమారుడు ఉన్నాడు. రెండేళ్ల క్రితం భర్త బాలయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుని బంధువుల వద్ద ఉంచి... కొద్ది నెలల క్రితం నగరానికి వలస వచ్చిన ఆమె కర్మాన్‌ఘాట్‌లో గది అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. తాను గాంధీ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నట్టు అందరికీ చెబుతుండేది. ఈ క్రమంలో బేగంపేటకు చెందిన ఓ యువకునితో (20) పరిచయం ఏర్పడి... ప్రేమగా మారింది. ప్రియునితో కూడా గాంధీ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తానని చెప్పింది. ఆస్పత్రికి వస్తానని ప్రియుడు అడుగుతుండగా... కొద్ది రోజులుగా దాట వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వైద్యులు వేసుకునే ఏప్రాన్, స్టెత్‌స్కోప్ కొనుగోలు చేసింది. సోమవారం ఉదయం ఓపీ విభాగంలో విధులు నిర్వహిస్తుంటానని... అక్కడికి రమ్మని ప్రియునికి ఫోన్ చేసింది. అతనితో చెప్పినట్టే అక్కడ వైద్యురాలి వేషంలో హల్చల్ చేస్తుండగా... సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు ఆప్పగించారు. ప్రియుణ్ణి కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... అసలు సంగతి బయటపడింది. గాంధీ ఆస్పత్రి అధికారుల ఫిర్యాదు మేరకు శివానీని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని... ఈ ఘటనలో ప్రియుడి ప్రమేయం లేనట్టు తేలిందని డీఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. -
చున్నీయే ఉరితాడైంది
మెడకు బిగుసుకోవడంతో బాలిక మృతి చున్నీ ఆ బాలిక పాలిట ఉరి తాడైంది. మెడకు బిగుసుకుపోవడంతో తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సంపల్లిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు. పిల్లి అంజిలయ్య, శాంతమ్మ దంపతుల పిల్లల్లో శివాని(8) స్థానికంగా ఉన్న చైతన్య మోడల్ స్కూల్లో రెండో తరగతి, సతీష్(6) ఎల్కేజీ చదువుతున్నారు. ఒంటిపూట బడులవడంతో మధ్యాహ్నం అక్కాతమ్ముడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు పొలానికి వెళ్లడంతో పిల్లలు ఇంటి వద్దే ఆడుకుంటున్నారు. ఈక్రమంలో శివాని చున్నీని తన మెడకు చుట్టుకోగా.. ఏమైందో ఏమోగానీ.. ఒక్కసారిగా అది బిగుసుకుపోయింది. దీంతో శివాని ఊపిరాడక కిందపడిపోయింది. అక్కను గమనించిన సతీష్ పరుగెత్తుకు వెళ్లి పక్కింట్లో ఉండే పెద్దమ్మ విజయలక్ష్మిని తీసుకొచ్చాడు. ఆమె చున్నీని విప్పగా అప్పటికే శివాని అపస్మారక స్థితికి చేరుకుంది. హుటాహుటిన ఆటోలో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆ బాలిక మృతి చెందిందని వైద్యులునిర్ధారించారు.