
మొక్క నాటుతున్న జీవితా, రాజశేఖర్
సాక్షి, మేడ్చల్ : జీవితా-రాజేశేఖర్ కుటుంబం హరితహారంలో భాగమైంది. ఆదివారం కూతురు శివాని జన్మదినం సందర్భంగా కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద జీవిత, రాజశేఖర్, కూతుళ్లు శివాని, శివాత్మికలు మొక్కలు నాటారు. కాగా, గత మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఓఎస్టీ ప్రియాంక వర్గీస్‌తో జీవితా రాజశేఖర్ భేటీ అయిన విషయం తెలిసిందే.
హరితహారంలో భాగస్వామ్యం విషయమై చర్చించారు. తమ ట్రస్ట్ ద్వారా హరితహారంలో పాల్గొనే విషయంపై ప్రియాంక చర్చించినట్లు జీవిత వెల్లడించారు. హరితహారం కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని జీవిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment