చున్నీయే ఉరితాడైంది | died for baby cloth | Sakshi
Sakshi News home page

చున్నీయే ఉరితాడైంది

Published Thu, Mar 27 2014 1:28 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

చున్నీయే ఉరితాడైంది - Sakshi

చున్నీయే ఉరితాడైంది

మెడకు బిగుసుకోవడంతో బాలిక మృతి
 
 చున్నీ ఆ బాలిక పాలిట ఉరి తాడైంది. మెడకు బిగుసుకుపోవడంతో తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సంపల్లిలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.  పిల్లి అంజిలయ్య, శాంతమ్మ దంపతుల పిల్లల్లో శివాని(8) స్థానికంగా ఉన్న చైతన్య మోడల్ స్కూల్‌లో రెండో తరగతి, సతీష్(6) ఎల్‌కేజీ చదువుతున్నారు. ఒంటిపూట బడులవడంతో మధ్యాహ్నం అక్కాతమ్ముడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు.

తల్లిదండ్రులు పొలానికి వెళ్లడంతో పిల్లలు ఇంటి వద్దే ఆడుకుంటున్నారు. ఈక్రమంలో శివాని చున్నీని తన మెడకు చుట్టుకోగా.. ఏమైందో ఏమోగానీ.. ఒక్కసారిగా అది బిగుసుకుపోయింది. దీంతో శివాని ఊపిరాడక కిందపడిపోయింది. అక్కను గమనించిన సతీష్ పరుగెత్తుకు వెళ్లి పక్కింట్లో ఉండే పెద్దమ్మ విజయలక్ష్మిని తీసుకొచ్చాడు. ఆమె చున్నీని విప్పగా అప్పటికే శివాని అపస్మారక స్థితికి చేరుకుంది. హుటాహుటిన ఆటోలో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆ బాలిక మృతి చెందిందని వైద్యులునిర్ధారించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement