యస్... హల్‌చల్ చేసిన వార్తలు నిజమయ్యాయి. జీవితారాజశేఖర్ దంపతుల ముద్దుల తనయ శివానీ తొలి సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. హిందీలో ఘనవిజయం సాధించిన ‘2 స్టేట్స్’ రీమేక్ ద్వారా శివానీ కథానాయికగా పరిచయం కానుంది. అడవి శేష్, శివానీ జంటగా నటించనున్నారు. వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.‘‘శివానీ తొలి చిత్రం కోసం ఎన్నో కథలు విన్నప్పటికీ నటనకు మంచి ఆస్కారం ఉండటంతో ‘2 స్టేట్స్’ని సెలెక్ట్ చేసుకున్నారు.
బ్యూటిఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు వినాయక్ దగ్గర వెంకట్ రెడ్డి అసోసియేట్‌గా చాలా చిత్రాలకు పనిచేశారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్.
ప్రేమకథ షురూ
Published Wed, Jan 24 2018 12:29 AM | Last Updated on Sun, Jul 14 2019 4:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment