టాలీవుడ్ మూవీ నుంచి తప్పుకున్న శృతి హాసన్‌! | Shruti Haasan Exit From Tollywood Hero Adivi Sesh's Dacoit Movie | Sakshi
Sakshi News home page

Shruti Haasan: టాలీవుడ్ హీరోతో మూవీ.. శృతి హాసన్‌ గుడ్ బై!

Published Thu, Oct 24 2024 3:43 PM | Last Updated on Thu, Oct 24 2024 3:48 PM

Shruti Haasan Exit From Tollywood Hero Adivi Sesh's Dacoit Movie

కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. గతేడాది సలార్‌ మూవీ అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం రజినీకాంత్‌ చిత్రం కూలీలో నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

అయితే శృతిహాసన్‌ ఇప్పటికే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. అందులో టాలీవుడ్‌ హీరో అడివి శేష్ నటిస్తోన్న డెకాయిట్‌:ఎ లవ్ స్టోరీ  ఒకటి. అంతే కాకుండా చెన్నై స్టోరీ అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ రెండు సినిమాల నుంచి శృతిహాసన్‌ తప్పుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే కొన్ని విభేదాల కారణంగానే ఆమె గుడ్‌ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితుల్లో ఒకరు మీడియాకు వెల్లడించారు. డెకాయిట్‌తో పాటు చెన్నై స్టోరీ కూడా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.

(ఇది చదవండి: కర్రసాము నేర్చుకుంటున్న శృతిహాసన్‌ .. వీడియో వైరల్‌)

కాగా.. గతేడాది డిసెంబర్‌లో అడివి శేష్, శృతి హాసన్‌ జంటగా డెకాయిట్‌ మూవీని ప్రకటించారు. అదే రోజున అనౌన్స్‌మెంట్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. మరోవైపు చెన్నై స్టోరీలో శ్రుతి హాసన్ డిటెక్టివ్ పాత్రను పోషించాల్సి ఉంది. అంతకు ముందు సమంత రూత్ ప్రభుని ఈ సినిమాలో కథానాయికగా తీసుకున్నారు. ఆ తర్వాత శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. తాజాగా శృతి కూడా సినిమా నుంచి తప్పుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement