అంతా ఫిక్స్ అయిన తర్వాత సినిమాల విషయంలో కొన్నిసార్లు చేర్పులు మార్పులు జరుగుతుంటాయి. అయితే హీరో లేదా హీరోయిన్‌ని మాత్రం ఎప్పడో ఓసారి జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ తెలుగు సినిమా నుంచి హీరోయిన్‌గా శృతి హాసన్‌ని తీసేసి మృణాల్ ఠాకుర్‌ని ఫిక్స్ చేశారు.
(ఇదీ చదవండి: పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్)
2022లో 'మేజర్' సినిమా వచ్చింది. దీని తర్వాత అడివి శేష్ ఏ సినిమాలు చేస్తున్నాడో కనీసం చిన్న అప్‌డేట్స్ కూడా ఇవ్వడం లేదు. మధ్యలో 'గూఢచారి 2' గురించి చెప్పారు గానీ. అది ఏ స్టేజీలో ఉందనేది క్లారిటీ లేదు. మరోవైపు కొన్నాళ్ల క్రితం 'డెకాయిట్' అనే సినిమాను ప్రకటించిన శేష్.. శృతి హాసన్‌తో కనిపించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు.
కట్ చేస్తే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ మారిపోయింది. శృతి ప్లేసులోకి మృణాల్ వచ్చి చేరింది. మరి కావాలనే తప్పించారా? లేదా శృతి హాసన్ తప్పుకొందా అనేది తెలియాల్సి ఉంది. మూవీ పోస్టర్‌తో పాటు 'అవును వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అని మృణాల్ క్యాప్షన్ పెట్టింది. మరోవైపు శేష్ కూడా ఈ పోస్టర్స్ షేర్ చేస్తూ.. 'అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు..! ఇడిచిపెట్టను...తేల్చాల్సిందే' అని క్యాప్షన్ పెట్టాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)
అవును వదిలేసాను..
కానీ మనస్పూర్తిగా ప్రేమించాను
Happy Birthday, @AdiviSesh ✨
Let's kill it - #DACOIT pic.twitter.com/tH4trCr0Fe— Mrunal Thakur (@mrunal0801) December 17, 2024
Comments
Please login to add a commentAdd a comment