'హనుమాన్' సినిమాతో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లాంటి వాళ్లకు బాగానే పేరొచ్చింది గానీ హీరోయిన్ అమృత అయ్యర్‌కి అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈమెకు ఎందుకో సరైన బ్రేక్ దొరకట్లేదు. ఇప్పుడు 'బచ్చలమల్లి' మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఈ సినిమా.. ఈ శుక్రవారం (డిసెంబర్ 20)న థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)
'బచ్చలమల్లి' ప్రమోషన్స్‌లో భాగంగా అమృత అయ్యర్‌కి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఎందుకంటే ఈ ఏడాది తక్కువలో తక్కువ 40 మందికి పైగా సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. రకుల్, నాగచైతన్య, కీర్తి సురేశ్.. ఇలా టాప్ హీరోహీరోయిన్లు చాలామంది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. ఇప్పుడు అమృత కూడా వివాహ చేసుకునేందుకు సిద్ధమే. ఆ విషయాన్నే ఇప్పుడు చెప్పింది.
'2025లో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోను. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తినే చేసుకుంటా. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అయితే పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉంటాయి' అని అమృత అయ్యర్ చెప్పింది.
(ఇదీ చదవండి: మళ్లీ గాయపడిన స్టార్ హీరో ప్రభాస్)
Comments
Please login to add a commentAdd a comment