
అడివి శేష్ హీరోగా రూపొందుతోన్నపాన్ ఇండియన్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ‘డెకాయిట్’తో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్‌కి జోడీగా శ్రుతీహాసన్ నటిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు శ్రుతీహాసన్. ఈ విషయాన్ని తెలియజేస్తూ... శేష్, శ్రుతి సరదాగా దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘‘ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డెకాయిట్’. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు, ఓ యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్.
Comments
Please login to add a commentAdd a comment