అడివి శేష్ స్పై మిషన్‌లో చేరారు వామికా గబ్బి. అడివి శేష్ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘జీ2’. అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా, ‘జీ2’ రూపొందుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా వామికా గబ్బి నటిస్తున్నట్లు వెల్లడించారు. ‘వెల్‌కమ్ టు ది మిషన్. మైపార్ట్‌నర్ ఇన్ అడ్వెంచర్ (మిషన్‌కి స్వాగతం... సాహసంలో నా భాగస్వామి)’’ అని వామికా గబ్బిని ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు అడివి శేష్. ‘‘జీ2’ ప్రయాణంలో భాగం కావడం హ్యాపీగా ఉంది’’ అని వామికా పేర్కొన్నారు. ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు షాలిని తదితరులు నటిస్తున్న ‘జీ2’ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ ఏడాది విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment