
బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా పేరు గడించిన ఇమ్రాన్ హష్మి 'గూఢచారి 2' షూటింగ్‌లో గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని సెట్‌లో ఒక చోటు నుంచి మరో చోటుకు దూకుతుండగా మెడకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో మెడ స్వల్పంగా కట్ అయ్యి రక్తం కారింది.
ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గూఢచారి 2 సినిమా విషయానికి వస్తే ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా ఇమ్రాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతడు తెలుగులో పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీలోనూ విలన్‌గా నటిస్తున్నాడు.
చదవండి: Shree Gopika: జూన్‌లో ఎంగేజ్‌మెంట్.. కట్ చేస్తే మరొకరితో నటి పెళ్లి