క్యాన్సర్‌తో పోరాటం.. చిన్నారిని ఆడించిన అడివి శేష్‌ | Adivi Sesh Reached Out To Surprise A Little Girl Battling Cancer, Video Viral | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారిని కలిసిన అడివి శేష్‌.. వీడియో వైరల్‌

Published Sat, Jul 20 2024 7:14 PM | Last Updated on Sat, Jul 20 2024 7:25 PM

Adivi Sesh Reached Out To Surprise A Little Girl Battling Cancer, Video Viral

టాలీవుడ్‌ హీరో అడివి శేష్‌ మంచి మనసు చాటుకున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారి కీర్తిని కలిసి తనతో సరదాగా కాలక్షేపం చేశాడు. ఆ చిన్నారిని ఎత్తుకుని ఆటలాడాడు. ఈ సందర్భంగా తనకు బొమ్మలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. క్యాన్సర్‌ చికిత్సలో భాగం కీమోథెరపీ చేసినప్పుడు తలపై వెంట్రుకలు తీసేస్తారు. అలా వెంట్రుకలు పోగొట్టుకున్న కీర్తి.. తను వేసిన డ్రాయింగ్‌లోనూ పాపకు జుట్టు తీసేసింది.

వీడియో వైరల్‌
అడివి శేష్‌.. ఆ చిన్నారిని ఆడిస్తూ, నవ్విస్తూ చాలాసేపు కబుర్లు చెప్పాడు. కాసేపు తన బాధనంతా మర్చిపోయి సంతోషంగా నవ్వేలా చేశాడు. పాపకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు మిగిల్చి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శేష్‌ మంచితనానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. బిజీ టైంలోనూ పాప కోసం సమయం కేటాయించడాన్ని కొనియాడుతున్నారు.

డెకాయిట్‌
ఇక సినిమాల విషయానికి వస్తే అడివి శేష్‌ ప్రస్తుతం డెకాయిట్‌ సినిమా చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. క్షణం, గూఢచారి వంటి పలు చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన షానీల్‌ డియో ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, హిందీలో ఈ మూవీ చిత్రీకరిస్తున్నారు.

 

చదవండి: ఆ హీరోయిన్‌కు యాక్టింగ్‌ రాదు, తీసుకోవద్దన్నారు: డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement