ఆ హీరోయిన్‌కు యాక్టింగ్‌ రాదు, తీసుకోవద్దన్నారు: డైరెక్టర్‌ | Guddu Dhanoa: Somebody Told Priyanka Chopra Was Bad Actor | Sakshi
Sakshi News home page

'అందం లేదు, యాక్టింగ్‌ రాదు'.. కట్‌ చేస్తే.. గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన బ్యూటీ

Published Sat, Jul 20 2024 12:40 PM | Last Updated on Sat, Jul 20 2024 1:04 PM

Guddu Dhanoa: Somebody Told Priyanka Chopra Was Bad Actor

స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్‌ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. కానీ అందరిలాగే కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడింది. కొన్ని సినిమాలు చేతిదాకా వచ్చి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కష్టపడి ఎదుగుతుంటే చూసి ఓర్వలేనివారు ఆమెకు యాక్టింగ్‌ రాదని, లుక్స్‌ బాగోవని విషప్రచారం చేసేవారు.

అడిగి మరీ..
ఈ విషయాన్ని దర్శకుడు గుడ్డు ధనోవా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'సన్నీ డియోల్‌ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా 2002-2003 మధ్యలో ఓ సినిమా తీశాను. అప్పుడు హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిపాం. ప్రియాంకకు యాక్టింగ్‌ అంతగా రాకపోయేది. ఇప్పుడీ సీన్‌ ఎలా చేయాలి? ఈ సన్నివేశం గురించి కాస్త వివరించరా? అని అడిగి మరీ తెలుసుకుని నటించేది. 

యాక్టింగ్‌ రాదన్నారు
నేర్చుకోవాలన్న తపన తనలో కనిపించేది. తన పాత్రను పర్ఫెక్ట్‌గా చేయాలని భావించేది. అలాగే అందంగా కూడా ఉండేది. ఓ షెడ్యూల్‌ పూర్తయ్యాక ప్రియాంక గురించి ముంబైలోని కొందరు నెగెటివ్‌గా చెప్పడం మొదలుపెట్టారు. స్క్రీన్‌పై తను అంత అందంగా కనిపించదని, యాక్టింగే రాదని, టైం వేస్ట్‌ చేసుకోవద్దని, కావాలంటే ఇప్పటివరకు షూట్‌ చేసిన భాగాన్ని ఓసారి చూసుకోమని సలహాలు ఇచ్చారు. 

ఆమెకు ఫిదా అయ్యాం
సరేనని చెప్పి సన్నీ డియోల్‌, నేను రషెస్‌ చూశాం. వాళ్లు చెప్పినట్లుగా ఏమీ అనిపించలేదు. దీంతో ఈ సినిమా తనతోనే పూర్తి చేయాలని డిసైడ్‌ అయ్యాం. తన అంకితభావానికి, నటనకు మేము ఫిదా అయ్యాం. తప్పకుండా తను ఏదో ఒకరోజు గొప్ప స్థానానికి వెళ్తుందని భావించాం. చాలా త్వరగానే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. తన వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు సైతం నన్ను ఆహ్వానించింది' అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. కాగా గుడ్డు ధనోవా డైరెక్షన్‌లో ప్రియాంక చోప్రా.. బిగ్‌ బ్రదర్‌, కిస్మత్‌ అనే సినిమాలు చేసింది.

చదవండి: ‘గురువాయూర్ అంబలనడియాల్’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement