Raj Tharun Aha Naa Pellanta Achieves 50 Million Viewing Minutes - Sakshi
Sakshi News home page

 ‘అహ నా పెళ్లంట’ అదుర్స్ .. టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్న సిరీస్

Published Fri, Nov 25 2022 4:58 PM | Last Updated on Fri, Nov 25 2022 6:13 PM

Raj Tharun Aha Naa Pelanta' Achieves 50 Million Viewing Minutes - Sakshi

రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ వెబ్‌ సిరీస్ 'అహ నా పెళ్లంట'. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా అదరగొడుతోంది. న‌వంబ‌ర్ 17న జీ5లో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. అతి తక్కువ సమయంలో 50 మిలియ‌న్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్‌ను చేరుకుంది.

అంతే కాకుండా ఐఎండీబీ ప్ర‌క‌టించిన టాప్ టెన్ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన వెబ్ సిరీస్‌ల లిస్టులోనూ చోటు ద‌క్కించుకుంది. తెలుగులో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైనర్‌ సిరీస్‌ను అన్నీ భాష‌ల్లో ప్ర‌మోట్ చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌కు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. 
 

అసలు కథేంటంటే..: ఓ పాతికేళ్ల యువ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. అయితే ఆక్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న స‌మ‌స్యలేంట‌నేదే అస‌లు క‌థ‌. మ‌న క‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ పెళ్లి కూతురు  త‌న ప్రేమికుడితో వెళ్లిపోతుంది. అప్పుడు మ‌న హీరో ఆమెపై ప్ర‌తీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తీరా ఆ క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే సినిమా. హీరో రాజ్ త‌రుణ్‌, హీరోయిన్ శివానీ రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య  కెమిస్ట్రీ మెయిన్ హైలైట్ అని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్ కుటుంబం అంతా క‌లిసి చూసేలా ఉంద‌ని అంద‌రూ అంటున్నారు. ఈ వారాంతాన్ని మీ ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా గ‌డ‌పాలకుంటే వెంట‌నే అహ నా పెళ్లంట చూసేయండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement