మూడో రౌండ్‌లో శివాని, సాత్విక | sivani, satwik enter third round | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌లో శివాని, సాత్విక

Published Thu, Sep 1 2016 10:43 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

sivani, satwik enter third round

టెన్నిస్ టోర్నమెంట్   


 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-4 టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మారుులు అమినేని శివాని, సామ సాత్విక మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు. ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ బాలికల రెండో రౌండ్‌లో శివాని అమినేని (తెలంగాణ) 6-1, 6-0తో భక్తి పర్వాని (గుజరాత్)పై గెలుపొందగా... సామ సాత్విక (తెలంగాణ) 6-3, 6-2తో జితాషా శాస్తి్ర (మహారాష్ట్ర)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రత్యూష (తెలంగాణ) 6-3, 6-1తో శివాని మంజన (కర్నాటక)పై, శ్రీవల్లి రష్మిక (తెలంగాణ) 7-6 (3), 6-2తో దివ్యవాణి (తమిళనాడు)పై, సహజ (తెలంగాణ) 6-4, 6-0తో లాస్య పట్నాయక్ (తెలంగాణ)పై, సారుు దేదీప్య (తెలంగాణ) 6-1, 7-5తో గౌరి (మహారాష్ట్ర)పై, హర్ష సారుు (తెలంగాణ) 6-2, 6-1తో శ్రీజ రెడ్డిపై, శ్రావ్య శివాని (తెలంగాణ) 6-3, 6-3తో ఎం. షేక్ (ఏపీ)పై విజయం సాధించారు. బాలుర విభాగంలో శశాంక్ తీర్థ (తెలంగాణ) 7-5, 6-2తో సత్య (తమిళనాడు)పై, శ్రీవత్స రాచకొండ (తెలంగాణ) 6-3, 6-1, 6-1తో మిశ్రాపై నెగ్గారు.
 
 ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు
 బాలికలు: అకాంక్ష భాను (గుజరాత్) 6-2, 6-4తో ముస్కాన్ గుప్తా (ఢిల్లీ)పై, సల్సా అహెర్ (మహారాష్ట్ర) 6-4, 6-3తో రిషిక రవి (తమిళనాడు)పై, ఎ. చక్రవర్తి (ఢిల్లీ) 6-4, 6-1తో వినీత (తెలంగాణ)పై, శివాని స్వరూప్ (మహారాష్ట్ర) 6-3, 6-2తో ఉర్మి పాండ్యాపై, తనీషా కశ్యప్ (అస్సాం) 6-1, 6-4తో డర్నా మదళియార్‌పై, వైదేహి చౌదరీ (గుజరాత్) 6-1, 6-2తో షాజియా బేగంపై గెలుపొందారు.
 బాలురు: అలెక్స్ సోలంకి 6-2, 6-4తో కెవిన్ పటేల్ (గుజరాత్)పై, రిషబ్ (ఛత్తీస్‌గడ్) 6-2, 6-0తో రోహిత్‌పై, నితిన్ 6-2, 6-0తో అర్జున్ (కర్నాటక)పై, ధ్రువ్ 6-1, 6-4తో జాదవ్‌పై, సురేశ్ (తమిళనాడు) 6-2, 6-3తో మహదేవన్‌పై, కబీర్ 6-4, 6-4తో మకేర్‌పై, సచిత్ (ఢిల్లీ) 6-3, 6-3తో సెంథిల్ కుమార్‌పై నెగ్గారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement