సింగిల్స్‌ ఫైనల్లో ప్రాంజల | Pranjala in ITF Singles Final | Sakshi
Sakshi News home page

సింగిల్స్‌ ఫైనల్లో ప్రాంజల

Published Sat, Oct 6 2018 10:28 AM | Last Updated on Sat, Oct 6 2018 10:28 AM

Pranjala in ITF Singles Final - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. నైజీరియాలోని లాగోస్‌ లాన్‌టెన్నిస్‌ క్లబ్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ లో ప్రాంజల ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఆరోసీడ్‌ ప్రాంజల(భారత్‌) 6–2, 5–0తో నాలుగోసీడ్‌ విక్టోరియా (అర్జెంటీనా)పై గెలుపొందింది. తొలి సెట్‌ను గెలిచిన ప్రాంజల రెండో సెట్‌లోనూ 5–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె ప్రత్యర్థి విక్టోరియా రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement