ప్రాంజల జోడీకి టైటిల్‌ | Pranjala Pait got Doubles Title | Sakshi
Sakshi News home page

ప్రాంజల జోడీకి టైటిల్‌

Published Sat, Jul 21 2018 10:09 AM | Last Updated on Sat, Jul 21 2018 10:09 AM

Pranjala Pait got Doubles Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత్‌కే చెందిన రుతుజా భోసాలేతో జతకట్టిన ప్రాంజల డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

తుదిపోరులో ప్రాంజల–రుతుజ (భారత్‌) ద్వయం 7–5, 6–2తో రెండోసీడ్‌ పెయ్‌ సున్‌ చెన్‌–ఫాంగ్‌ సిన్‌ వు (చైనీస్‌ తైపీ) జోడీపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఈ భారత జోడీ 6–2, 6–3తో టాప్‌సీడ్‌ జియా–కి కంగ్‌ (చైనా)–పీంగ్‌టర్న్‌ లిపెచ్‌ (థాయ్‌లాండ్‌) జంటకు షాకిచ్చింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement