satwika
-
సాత్విక–శ్రావ్య జంటకు రజతం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో చివరి రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఒక్కో రజత పతకం లభించింది. టెన్నిస్ అండర్–21 బాలికల డబుల్స్ విభాగంలో సామ సాత్విక–శ్రావ్య శివాని జంట రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో సాత్విక–శ్రావ్య శివాని ద్వయం 6–3, 3–6, 7–10తో మిహికా యాదవ్–స్నేహల్ మానె (మహారాష్ట్ర) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. స్విమ్మింగ్‌లో అండర్–21 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ ఎం.లోహిత్ రజతం సాధించాడు. లోహిత్ 2ని:21.32 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. బుధవారంతో ముగిసిన ఈ క్రీడల్లో ఓవరాల్‌గా తెలంగాణ 7 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 21 పతకాలు సాధించి 15వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో 22వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 78 స్వర్ణాలు, 77 రజతాలు, 101 కాంస్యాలతో కలిపి మొత్తం 256 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. హరియాణా (68+60+72) మొత్తం 200 పతకాలు నెగ్గి రెండో స్థానంలో... ఢిల్లీ (39+36+47) మొత్తం 122 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచాయి. -
‘స్వర్ణ’ సాత్విక
కఠ్మాండు (నేపాల్): తమ పతకాల వేటను కొనసాగిస్తూ దక్షిణాసియా క్రీడల్లో భారత్ ‘ట్రిపుల్ సెంచరీ’కి చేరువైంది. పోటీల తొమ్మిదో రోజు సోమవారం భారత్ ఏకంగా 42 పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో 27 స్వర్ణాలు, 12 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 159 స్వర్ణాలు, 91 రజతాలు, 44 కాంస్యాలతో కలిపి మొత్తం 294 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. 195 పతకాలతో (49 స్వర్ణాలు+54 రజతాలు+92 కాంస్యాలు) నేపాల్ రెండో స్థానంలో ఉంది. నేడు క్రీడలకు చివరి రోజు కావడం... ఇంకొన్ని ఈవెంట్స్‌లో భారత్ బరిలో ఉండటంతో మన పతకాల సంఖ్య 300 దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2016లో స్వదేశంలో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 309 పతకాలు సాధించింది. సోమవారం టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్స్‌లో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మహిళల సింగిల్స్‌లో ఇద్దరు తెలుగమ్మాయిలు సామ సాత్విక, బవిశెట్టి సౌజన్య మధ్య ఫైనల్ జరిగింది. సాత్విక 4–6, 6–2, 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో మోచేతి గాయం కారణంగా సౌజన్య వైదొలిగింది. దాంతో సాత్వికకు స్వర్ణం ఖాయమైంది. మిక్స్డ్ డబుల్స్‌లో పసిడి నెగ్గిన సౌజన్య రజతంతో సంతృప్తి పడింది. పురుషుల సింగిల్స్‌లో మనీష్ సురేశ్ కుమార్ (భారత్) 6–4, 7–6 (8/6)తో భారత్‌కే చెందిన డేవిస్ కప్ జట్టు సభ్యుడు, విశాఖపట్నం ప్లేయర్ సాకేత్ మైనేనిపై గెలిచి బంగారు పతకం దక్కించుకున్నాడు. బాక్సింగ్‌లో భారత్‌కు ఆరు స్వర్ణాలు, ఒక రజతం లభించింది. అంకిత్ ఖటానా (75 కేజీలు), వినోద్ తన్వర్ (49 కేజీలు), సచిన్ సివాచ్ (56 కేజీలు), గౌరవ్ చౌహాన్ (91 కేజీలు), కలైవాని శ్రీనివాసన్ (మహిళల 48 కేజీలు), పర్వీన్ (మహిళల 60 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. మనీశ్ కౌశిక్ (పురుషుల 64 కేజీలు) రజతం గెలిచాడు. మంగళవారం రెజ్లింగ్‌లో గౌరవ్ బలియాన్ (పురుషుల 74 కేజీలు), అనితా షెరోన్ (మహిళల 68 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లకే స్వర్ణాలు లభించాయి. పురుషుల ఫైనల్లో భారత్ 51–18తో శ్రీలంకపై, మహిళల జట్టు 50–13తో నేపాల్‌పై గెలిచాయి. భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు ఫైనల్లో 2–0తో నేపాల్‌పై నెగ్గి వరుసగా మూడోసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. -
సాయి దేదీప్య-సాత్విక జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు సామ సాత్విక, యెద్దుల సారుు దేదీప్య సత్తా చాటారు. భీమవరంలో జరిగిన ఈ టోర్నీలో బాలికల డబుల్స్ టైటిల్‌ను కై వసం చేసుకున్నారు. ఫైనల్లో సామ సాత్విక-సాయి దేదీప్య (తెలంగాణ) జోడీ 6-4, 6-3తో కాల్వ భువన (ఆంధ్రప్రదేశ్)-నిత్యరాజ్ (తమిళనాడు) జంటపై గెలుపొంది విజేతగా నిలిచింది. -
సాత్విక గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఏఎస్‌ఐఎస్‌సీ జాతీయ లాన్‌టెన్నిస్ టోర్నమెంట్లో సామ సాత్విక విజయం సాధించింది. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన సీనియర్ బాలికల మ్యాచ్‌లో సామసాత్విక (ఏపీ- తెలంగాణ రీజియన్) 2-0తో పదమంజిరి (తమిళనాడు)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో మలైక (బిహార్-జార్ఖండ్ రీజియన్) 2-0తో ఆదా సింగ్ (యూపీ-యూకే రీజియన్)పై నెగ్గింది. సీనియర్ బాలుర విభాగంలో తమిళనాడు 2-1తో కర్నాటకపై గెలిచింది. జూనియర్ బాలుర విభాగంలో తొలి మ్యాచ్‌లో ఏపీ- తెలంగాణ రీజియన్ 2-0తో బిహార్‌పై గెలుపొంది... మరో మ్యాచ్‌లో 0-2తో మహారాష్ట్ర చేతిలో పరాజయం పాలైంది. బాలికల విభాగంలో ఏపీ-తెలంగాణ రీజియన్ 2-0తో మహారాష్ట్రపై గెలుపొందింది. ఫుట్‌బాల్‌లో ముందంజ ఏఎస్‌ఐఎస్‌సీ అథ్లెటిక్ మీట్లో భాగంగా గచ్చిబౌలిలోని ఎన్ఏఎస్ఆర్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన జూనియర్ బాలుర ఫుట్‌బాల్ పోటీల్లో తెలంగాణ-ఏపీ రీజియన్ జట్టు 4-0తో తమిళనాడు జట్టుపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో యూపీ-యూకే రీజియన్ 3-0తో మహారాష్ట్రపై, కర్నాటక 2-1తో నార్త్ వెస్ట్ గుజరాత్‌పై, కేరళ 2-0తో ఒడిశాపై, నార్త్ వెస్ట్ గుజరాత్ 1-0తో మహారాష్ట్రపై, తమిళనాడు 2-0తో నార్త్ పంజాబ్‌పై, కేరళ 2-0తో తెలంగాణ- ఏపీ రీజియన్‌పై, పంజాబ్ 1-0తో ఒడిశాపై గెలిచాయి. క్వార్టర్స్‌లో తెలంగాణ- ఏపీ రీజియన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో జూనియర్ బాలికలు, సీనియర్ బాలుర తెలంగాణ-ఏపీ రీజియన్ జట్లు క్వార్టర్స్ పోరుకు అర్హత సాధించారుు. గచ్చిబౌలి స్టేడియంలో జూనియర్ బాలికల కేటగిరీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ- ఏపీ జట్టు 23-22తో తమిళనాడుపై గెలుపొందింది. ఈ జట్టు క్వార్టర్స్‌లో కేరళతో తలపడుతుంది. సీనియర్ బాలుర విభాగంలో తెలంగాణ- ఏపీ జట్టు 41-35తో బిహార్‌పై విజయం సాధించి నాకౌట్ పోరుకు అర్హత సాధించింది. -
మూడో రౌండ్లో శివాని, సాత్విక
టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-4 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మారుులు అమినేని శివాని, సామ సాత్విక మూడోరౌండ్లోకి ప్రవేశించారు. ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ బాలికల రెండో రౌండ్లో శివాని అమినేని (తెలంగాణ) 6-1, 6-0తో భక్తి పర్వాని (గుజరాత్)పై గెలుపొందగా... సామ సాత్విక (తెలంగాణ) 6-3, 6-2తో జితాషా శాస్తి్ర (మహారాష్ట్ర)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రత్యూష (తెలంగాణ) 6-3, 6-1తో శివాని మంజన (కర్నాటక)పై, శ్రీవల్లి రష్మిక (తెలంగాణ) 7-6 (3), 6-2తో దివ్యవాణి (తమిళనాడు)పై, సహజ (తెలంగాణ) 6-4, 6-0తో లాస్య పట్నాయక్ (తెలంగాణ)పై, సారుు దేదీప్య (తెలంగాణ) 6-1, 7-5తో గౌరి (మహారాష్ట్ర)పై, హర్ష సారుు (తెలంగాణ) 6-2, 6-1తో శ్రీజ రెడ్డిపై, శ్రావ్య శివాని (తెలంగాణ) 6-3, 6-3తో ఎం. షేక్ (ఏపీ)పై విజయం సాధించారు. బాలుర విభాగంలో శశాంక్ తీర్థ (తెలంగాణ) 7-5, 6-2తో సత్య (తమిళనాడు)పై, శ్రీవత్స రాచకొండ (తెలంగాణ) 6-3, 6-1, 6-1తో మిశ్రాపై నెగ్గారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు బాలికలు: అకాంక్ష భాను (గుజరాత్) 6-2, 6-4తో ముస్కాన్ గుప్తా (ఢిల్లీ)పై, సల్సా అహెర్ (మహారాష్ట్ర) 6-4, 6-3తో రిషిక రవి (తమిళనాడు)పై, ఎ. చక్రవర్తి (ఢిల్లీ) 6-4, 6-1తో వినీత (తెలంగాణ)పై, శివాని స్వరూప్ (మహారాష్ట్ర) 6-3, 6-2తో ఉర్మి పాండ్యాపై, తనీషా కశ్యప్ (అస్సాం) 6-1, 6-4తో డర్నా మదళియార్పై, వైదేహి చౌదరీ (గుజరాత్) 6-1, 6-2తో షాజియా బేగంపై గెలుపొందారు. బాలురు: అలెక్స్ సోలంకి 6-2, 6-4తో కెవిన్ పటేల్ (గుజరాత్)పై, రిషబ్ (ఛత్తీస్గడ్) 6-2, 6-0తో రోహిత్‌పై, నితిన్ 6-2, 6-0తో అర్జున్ (కర్నాటక)పై, ధ్రువ్ 6-1, 6-4తో జాదవ్‌పై, సురేశ్ (తమిళనాడు) 6-2, 6-3తో మహదేవన్‌పై, కబీర్ 6-4, 6-4తో మకేర్పై, సచిత్ (ఢిల్లీ) 6-3, 6-3తో సెంథిల్ కుమార్‌పై నెగ్గారు. -
అభినవ్, సాత్వికలకు టైటిల్స్
హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా జరిగిన లాన్ టెన్నిస్ టోర్నమెంట్లో అభినవ్, సామ సాత్విక విజేతలుగా నిలిచారు. సికింద్రాబాద్‌లోని వశిష్ట టెన్నిస్ అకాడమీలో ఆదివారం జరిగిన సీనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో కె. అభినవ్ (శ్రీనిధి స్కూల్ ) 8-4తో సుశాల్ భండారి (జాన్సన్ గ్రామర్ స్కూల్) పై గెలుపొందగా... బాలికల సింగిల్స్ విభాగంలో సాత్విక (ఎన్ఏఎస్ఆర్) 8-0తో సాయి దుర్గ (షేర్వుడ్)ను చిత్తుగా ఓడించింది. అంతకు ముందు జరిగిన బాలుర సెమీస్ మ్యాచ్‌ల్లో అభినవ్ (శ్రీనిధి) 8-4తో ఆయుష్మాన్ (హెచ్‌పీఎస్)పై, సుశాల్ 7-1తో వల్లభ (షేర్వుడ్)పై గెలుపొందారు. బాలికల సెమీఫైనల్లో సాత్విక 8-0తో నక్షత్ర (జాన్సన్ గ్రామర్)పై, సాయి దుర్గ 8-0తో సరయు (ఎస్‌ఏఎస్‌ఆర్)పై విజయం సాధించారు. మరోవైపు జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో చరిత (గీతాంజలి) 8-6తో శ్రీజ (సెయింట్ జోసెఫ్)పై, బాలుర సింగిల్స్ విభాగంలో బృహత్ కాలేరు (కల్ప స్కూల్) 8-1తో రోహిత్ (హెచ్‌పీఎస్)పై గెలుపొంది విజేతలుగా నిలిచారు. జూనియర్ బాలుర డబుల్స్ విభాగంలో జోనాథన్-యువరాజ్ (జాన్సన్ గ్రామర్) జోడి 8-7తో కె. విశ్వానంద-లిఖిత్ రెడ్డి (జాన్సన్ గ్రామర్) జంటపై నెగ్గి డబుల్స్ టైటిల్‌ను కై వసం చేసుకున్నారు.