అభినవ్, సాత్వికలకు టైటిల్స్ | abhinav, satwika got titles | Sakshi
Sakshi News home page

అభినవ్, సాత్వికలకు టైటిల్స్

Published Mon, Aug 22 2016 10:27 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

abhinav, satwika got titles

హైదరాబాద్: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా జరిగిన లాన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అభినవ్, సామ సాత్విక విజేతలుగా నిలిచారు. సికింద్రాబాద్‌లోని వశిష్ట టెన్నిస్ అకాడమీలో ఆదివారం జరిగిన సీనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో కె. అభినవ్ (శ్రీనిధి స్కూల్ ) 8-4తో సుశాల్ భండారి (జాన్సన్ గ్రామర్ స్కూల్) పై గెలుపొందగా... బాలికల సింగిల్స్ విభాగంలో సాత్విక (ఎన్‌ఏఎస్‌ఆర్) 8-0తో సాయి దుర్గ (షేర్‌వుడ్)ను చిత్తుగా ఓడించింది.

 

అంతకు ముందు జరిగిన బాలుర సెమీస్ మ్యాచ్‌ల్లో అభినవ్ (శ్రీనిధి) 8-4తో ఆయుష్మాన్ (హెచ్‌పీఎస్)పై, సుశాల్ 7-1తో వల్లభ (షేర్‌వుడ్)పై గెలుపొందారు. బాలికల సెమీఫైనల్లో సాత్విక 8-0తో నక్షత్ర (జాన్సన్ గ్రామర్)పై, సాయి దుర్గ 8-0తో సరయు (ఎస్‌ఏఎస్‌ఆర్)పై విజయం సాధించారు. మరోవైపు జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో చరిత (గీతాంజలి) 8-6తో శ్రీజ (సెయింట్ జోసెఫ్)పై, బాలుర సింగిల్స్ విభాగంలో బృహత్ కాలేరు (కల్ప స్కూల్) 8-1తో రోహిత్ (హెచ్‌పీఎస్)పై గెలుపొంది విజేతలుగా నిలిచారు. జూనియర్ బాలుర డబుల్స్ విభాగంలో జోనాథన్-యువరాజ్ (జాన్సన్ గ్రామర్) జోడి 8-7తో కె. విశ్వానంద-లిఖిత్ రెడ్డి (జాన్సన్ గ్రామర్) జంటపై నెగ్గి డబుల్స్ టైటిల్‌ను కై వసం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement