lawn tennis
-
లాన్ టెన్నిస్‌లో జాఫ్రీన్ ప్రతిభ
కర్నూలు(టౌన్): నగరంలోని బి.క్యాంపునకు చెందిన బాలిక డెఫ్ జాతీయ స్థాయి లాన్ టెన్నిస్‌లో బంగారు పతకం సాధించింది. గత నెల 28 నుంచి 31వ తేదీ వరకు చెన్నైలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 21వ జాతీయ స్థాయి డెఫ్ లాన్ టెన్నిస్ పోటీలు నిర్వహించారు. ఈపోటీల్లో కర్నూలుకు మాజీ క్రికెటర్ జాకీర్ కూతురు జాఫ్రీన్ ఏపీకి ప్రాతినిధ్యం వహించింది. ఫైనల్లో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన విదిషా అనే క్రీడాకారిణిపై 6–4, 6–1 పాయింట్లతో గెలుపొంది బంగారు పతకం సాధించింది. జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందడంతో ఈ ఏడాది జులై నెలలో టర్కీలో జరుగుతున్న డెఫ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. జాఫ్రీన్ దేశంలోనే టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలవడమే కాకుండా, ప్రపంచ ర్యాకింగ్స్లో 24వ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవడంపై పలువురు క్రీడా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
సాత్విక గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఏఎస్‌ఐఎస్‌సీ జాతీయ లాన్‌టెన్నిస్ టోర్నమెంట్లో సామ సాత్విక విజయం సాధించింది. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన సీనియర్ బాలికల మ్యాచ్‌లో సామసాత్విక (ఏపీ- తెలంగాణ రీజియన్) 2-0తో పదమంజిరి (తమిళనాడు)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో మలైక (బిహార్-జార్ఖండ్ రీజియన్) 2-0తో ఆదా సింగ్ (యూపీ-యూకే రీజియన్)పై నెగ్గింది. సీనియర్ బాలుర విభాగంలో తమిళనాడు 2-1తో కర్నాటకపై గెలిచింది. జూనియర్ బాలుర విభాగంలో తొలి మ్యాచ్‌లో ఏపీ- తెలంగాణ రీజియన్ 2-0తో బిహార్‌పై గెలుపొంది... మరో మ్యాచ్‌లో 0-2తో మహారాష్ట్ర చేతిలో పరాజయం పాలైంది. బాలికల విభాగంలో ఏపీ-తెలంగాణ రీజియన్ 2-0తో మహారాష్ట్రపై గెలుపొందింది. ఫుట్‌బాల్‌లో ముందంజ ఏఎస్‌ఐఎస్‌సీ అథ్లెటిక్ మీట్లో భాగంగా గచ్చిబౌలిలోని ఎన్ఏఎస్ఆర్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన జూనియర్ బాలుర ఫుట్‌బాల్ పోటీల్లో తెలంగాణ-ఏపీ రీజియన్ జట్టు 4-0తో తమిళనాడు జట్టుపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో యూపీ-యూకే రీజియన్ 3-0తో మహారాష్ట్రపై, కర్నాటక 2-1తో నార్త్ వెస్ట్ గుజరాత్‌పై, కేరళ 2-0తో ఒడిశాపై, నార్త్ వెస్ట్ గుజరాత్ 1-0తో మహారాష్ట్రపై, తమిళనాడు 2-0తో నార్త్ పంజాబ్‌పై, కేరళ 2-0తో తెలంగాణ- ఏపీ రీజియన్‌పై, పంజాబ్ 1-0తో ఒడిశాపై గెలిచాయి. క్వార్టర్స్‌లో తెలంగాణ- ఏపీ రీజియన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో జూనియర్ బాలికలు, సీనియర్ బాలుర తెలంగాణ-ఏపీ రీజియన్ జట్లు క్వార్టర్స్ పోరుకు అర్హత సాధించారుు. గచ్చిబౌలి స్టేడియంలో జూనియర్ బాలికల కేటగిరీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ- ఏపీ జట్టు 23-22తో తమిళనాడుపై గెలుపొందింది. ఈ జట్టు క్వార్టర్స్‌లో కేరళతో తలపడుతుంది. సీనియర్ బాలుర విభాగంలో తెలంగాణ- ఏపీ జట్టు 41-35తో బిహార్‌పై విజయం సాధించి నాకౌట్ పోరుకు అర్హత సాధించింది. -
ముగిసిన లాన్ టెన్నిస్ పోటీలు
గుంటూరు రూరల్ : గుంటూరు కృష్ణా జిల్లాల పరిధిలో అండర్ 14 విభాగం లాన్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లయోలా పాఠశాల పూర్వ విద్యార్థి డాక్టర్ అన్వర్ పాల్గొని మాట్లాడారు. క్రీడలతో మానసిక పరిపక్వత సాధిస్తారని చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటలతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. పోటీల్లో బాలికల సింగిల్స్ విభాగంలో నల్లాపాడు కేంద్రియ విద్యాలయానికి చెందిన అశ్రిత ప్రథమ స్థానం సాధించింది. విజయవాడ చైతన్య పాఠశాలకు చెందిన సీహెచ్ ప్రవల్లిక ద్వితీయ స్థానం గెలుపొందింది. సింగిల్స్ బాలుర విభాగంలో విజయవాడకు చెందిన భాష్యం విద్యార్థి జయకృష్ణ వంశీ ప్రథమ స్థానం, నిర్మల హైస్కూల్ విద్యార్థి కె.గిరీష్ కైవశంచేసుకున్నారు. బాలికల డబుల్స్ విభాగంలో నల్లపాడు కేంద్రియ విద్యాలయానికి చెందిన అశ్రిత, విజయవాడ చైతన్య విద్యార్థి సీహెచ్ ప్రవల్లిక ప్రథమస్థానం, ఎన్ఎస్ఎమ్ స్కూల్ విజయవాడకు చెందిన విద్యార్థి ఎస్.యశస్వీ, కృష్ణవేణి పాఠశాల విద్యార్థిని లావణ్య ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలుర డబుల్స్ విభాగంలో గుంటూరు చైతన్య విద్యార్థి షేక్ ఫరాజ్, విజయవాడ భాష్యం విద్యార్థి జయకృష్ణవంశీ ప్రథమ స్థానం, విజయవాడ నిర్మల హైస్కూల్ విద్యార్థి గిరీష్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి మాధవ్‌లు ద్వితీయ స్థానంలో నిలిచారు. -
లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
గుంటూరు రూరల్: మండలంలోని నల్లపాడు గ్రామంలోని లయోలా పాఠశాలలో శుక్రవారం గుంటూరు, కృష్ణా జిల్లాల అండర్ 14 సింగిల్స్, డబుల్స్ లాన్ పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొన సాగనున్న పోటీలను ఎన్టీఆర్‌స్టేడియం సెక్రటరీ శ్రీనివాసరావు ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ ఆంథొని మాట్లాడుతూ లాన్ టెన్నిస్ క్రీడలు తమ పాఠశాలలో నిర్వహించటం ఆనందంగా ఉందని, జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడలు సైతం నిర్వహించేందుకు తాము సిద్ధమేనన్నారు. మొదటిరోజు బాలుర సింగిల్స్ విభాగంలో 64 మంది, బాలికల సింగిల్స్ విభాగంలో 16 మంది పోటీ పడుతున్నారన్నారు. -
విజేత ఎంవీఎస్ఆర్ కాలేజ్
అంతర్ కళాశాలల లాన్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా అంతర్ కళాశాలల లాన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎంవీఎస్ఆర్ కాలేజ్ సత్తా చాటింది. సైనిక్‌పురిలోని భవన్స వివేకానంద కాలేజ్‌లో జరిగిన ఈ టోర్నీలో ఎంవీఎస్ఆర్ విజేతగా నిలవగా... ఎంజే కాలేజ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సెయింట్ ఫ్రాన్సిస్, భవన్స వివేకానంద కాలేజ్‌లకు మూడు, నాలుగు స్థానాలు దక్కాయి. మొత్తం ఈ టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొన్నాయి. -
అభినవ్, సాత్వికలకు టైటిల్స్
హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా జరిగిన లాన్ టెన్నిస్ టోర్నమెంట్లో అభినవ్, సామ సాత్విక విజేతలుగా నిలిచారు. సికింద్రాబాద్‌లోని వశిష్ట టెన్నిస్ అకాడమీలో ఆదివారం జరిగిన సీనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో కె. అభినవ్ (శ్రీనిధి స్కూల్ ) 8-4తో సుశాల్ భండారి (జాన్సన్ గ్రామర్ స్కూల్) పై గెలుపొందగా... బాలికల సింగిల్స్ విభాగంలో సాత్విక (ఎన్ఏఎస్ఆర్) 8-0తో సాయి దుర్గ (షేర్వుడ్)ను చిత్తుగా ఓడించింది. అంతకు ముందు జరిగిన బాలుర సెమీస్ మ్యాచ్‌ల్లో అభినవ్ (శ్రీనిధి) 8-4తో ఆయుష్మాన్ (హెచ్‌పీఎస్)పై, సుశాల్ 7-1తో వల్లభ (షేర్వుడ్)పై గెలుపొందారు. బాలికల సెమీఫైనల్లో సాత్విక 8-0తో నక్షత్ర (జాన్సన్ గ్రామర్)పై, సాయి దుర్గ 8-0తో సరయు (ఎస్‌ఏఎస్‌ఆర్)పై విజయం సాధించారు. మరోవైపు జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో చరిత (గీతాంజలి) 8-6తో శ్రీజ (సెయింట్ జోసెఫ్)పై, బాలుర సింగిల్స్ విభాగంలో బృహత్ కాలేరు (కల్ప స్కూల్) 8-1తో రోహిత్ (హెచ్‌పీఎస్)పై గెలుపొంది విజేతలుగా నిలిచారు. జూనియర్ బాలుర డబుల్స్ విభాగంలో జోనాథన్-యువరాజ్ (జాన్సన్ గ్రామర్) జోడి 8-7తో కె. విశ్వానంద-లిఖిత్ రెడ్డి (జాన్సన్ గ్రామర్) జంటపై నెగ్గి డబుల్స్ టైటిల్‌ను కై వసం చేసుకున్నారు. -
ఏపీ టెన్నిస్ ‘పవర్’ నాగరాజు
సైనిక్‌పురి, న్యూస్‌లైన్: నాడు... ఆటంటే ఇష్టమైనా ఆర్థిక సమస్యలతో శిక్షణ తీసుకోలేకపోయారు. నేడు... అదే ఆటలో ప్రావీణ్యం సంపాదించి యువ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. వారి అంతర్జాతీయ కెరీర్‌కు చక్కని బాట వేస్తున్నారు. ఆయనే కంజివరం వెంకటరావు నాగరాజు. కోచ్ నాగరాజుగా టెన్నిస్ ఆటగాళ్లకు చిరపరిచితుడైన ఈయన శిష్యులే విష్ణు, సాకేత్, భువన తదితరులు. నాడు ఏడు వుంది విద్యార్థులతో ప్రారంభమైన ‘ది స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్’ నేడు వందలాది వుంది క్రీడాకారులతో కళకళలాడుతోంది. సైనిక్‌పురిలో ‘భవాన్స్ టెన్నిస్ అకాడమీ’ పేరుతో రెండో బ్రాంచీని నెలకొల్పారు. సత్తాగల ఆటగాళ్లు వెలుగులోకి రావాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమంటున్న ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. కష్టమైనా... నష్టమైనా... ‘టెన్నిస్ ఆటంటే ఎంతో ఇష్టం. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో శిక్షణకు నోచుకోలేకపోయాను. అరుునా స్వయుంకృషితో ఆడి జూనియుర్స్ విభాగంలో జాతీయస్థాయి ఫైనల్స్‌లో ఆడాను. ఆపై ముందుకెళ్లాలంటే ప్రొఫెషనల్ శిక్షణ తప్పనిసరి కానీ... నాకది అందనంత దూరంలో ఉండింది. దీంతో ఉద్యోగం చేస్తూ... అన్నావులై విశ్వవిద్యాలయం నుంచి ‘లాన్ టెన్నిస్’ స్పెషలైజేషన్‌గా తీసుకొని ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పీజీ పూర్తిచేశా. తర్వాత హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్‌గా పనిచేశాను. ఆర్థికంగా కాస్త మెరుగైన తర్వాత 1991, ఫిబ్రవరి 4న సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రియేషన్ క్లబ్లో పవర్ టెన్నిస్ అకాడమీని ప్రారంభించాను. అప్పట్లో పట్టుమని పది మంది లేకపోయినా ఏమాత్రం నిరాశచెందక శ్రమించేవాడిని. ఇప్పుడదే అకాడమీ వందలమందితో కళకళలాడుతుంటే ఆనందంగా ఉంది. శిక్షణ పొందిన క్రీడాకారుల్లో పలువురు జాతీయు, అంతర్జాతీయు స్థారుులో రాణించడమే ఆనందానికికారణం.’ విష్ణు ఓనవూలు నేర్చుకుందిక్కడే ‘టెన్నిస్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కొందరు ఆటగాళ్లు నా వద్దే శిక్షణ పొందారు. లండన్ ఈవెంట్‌తో ఒలింపియన్‌గా మారిన విష్ణు కూడా నా శిష్యుడే. ఇతనే కాదు ఐటీఎఫ్ టోర్నీలో రాణిస్తున్న సాకేత్ మైనేని, సుశీల్ నార్లా, విశాల్‌లు కూడా నా అకాడమీలోనే రాటుదేలారు. వీరితో పాటు జూనియుర్ డేవిస్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏఆర్ ఆనంద్, అనంత్ శ్రీరాం, విఘ్నేశ్, సందీప్‌లు నా శిక్షణ తీసుకున్నవారే. జాతీయ స్థాయిలో అండర్-12, 14, 16 స్థారుుల్లో చెప్పుకోదగ్గ ప్రతిభ కనబరిచిన రిత్విక్ చౌదరి, దార్ల వుుదలియూర్, శివానీ జా, రిత్విక్ బజార్, పి.సి. అనిరుధ్, పి. సిద్ధార్థ్, శశిధర్, హివుకేష్, కృష్ణతేజలు నా వద్దే ఓనమాలు నేర్చారు. భువన కాల్వ, సౌజన్య, పార్థసారథి తదితరుల గురించి చెప్పుకుంటూపోతే నా శిష్యుల జాబితా చాంతాడంత ఉంది.’ ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి ‘ఔత్సాహిక క్రీడాకారుల సంఖ్య పెరగడంతో మరో అకాడమీని నెలకొల్పాను. 2011 ఏడాది డిసెంబర్లో సైనిక్‌పురిలో భవాన్స్ టెన్నిస్ అకాడమీ పేరిట మరో శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చాను. ప్రస్తుతం రైల్వే రిక్రియేషన్ క్లబ్లో 4, భవాన్స్ టెన్నిస్ అకాడమీలో 3 టెన్నిస్ కోర్టులున్నారుు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయూ కోర్టుల్లో ఉదయుం నుంచి సాయుంత్రం వరకు వందలాది వుంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. వీళ్లందరికి అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇవ్వాలంటే ప్రభుత్వ, ప్రైవేటు ప్రోత్సాహం అవసరం. ముఖ్యంగా ప్రభుత్వం టెన్నిస్ క్రీడపై చిన్నచూపు చూస్తోంది. ఇతర ఆటల్లాగే టెన్నిస్‌ను ప్రోత్సహించినపుడే రాష్ట్రం నుంచి మరింత మంది సత్తాగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు.’