సాక్షి, హైదరాబాద్: ఏఎస్‌ఐఎస్‌సీ జాతీయ లాన్‌టెన్నిస్ టోర్నమెంట్‌లో సామ సాత్విక విజయం సాధించింది. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన సీనియర్ బాలికల మ్యాచ్‌లో సామసాత్విక (ఏపీ- తెలంగాణ రీజియన్) 2-0తో పదమంజిరి (తమిళనాడు)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో మలైక (బిహార్-జార్ఖండ్ రీజియన్) 2-0తో ఆదా సింగ్ (యూపీ-యూకే రీజియన్)పై నెగ్గింది. సీనియర్ బాలుర విభాగంలో తమిళనాడు 2-1తో కర్నాటకపై గెలిచింది. జూనియర్ బాలుర విభాగంలో తొలి మ్యాచ్‌లో ఏపీ- తెలంగాణ రీజియన్ 2-0తో బిహార్‌పై గెలుపొంది... మరో మ్యాచ్‌లో 0-2తో మహారాష్ట్ర చేతిలో పరాజయం పాలైంది. బాలికల విభాగంలో ఏపీ-తెలంగాణ రీజియన్ 2-0తో మహారాష్ట్రపై గెలుపొందింది.
ఫుట్‌బాల్‌లో ముందంజ
ఏఎస్‌ఐఎస్‌సీ అథ్లెటిక్ మీట్‌లో భాగంగా గచ్చిబౌలిలోని ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన జూనియర్ బాలుర ఫుట్‌బాల్ పోటీల్లో తెలంగాణ-ఏపీ రీజియన్ జట్టు 4-0తో తమిళనాడు జట్టుపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో యూపీ-యూకే రీజియన్ 3-0తో మహారాష్ట్రపై, కర్నాటక 2-1తో నార్త్ వెస్ట్ గుజరాత్‌పై, కేరళ 2-0తో ఒడిశాపై, నార్త్ వెస్ట్ గుజరాత్ 1-0తో మహారాష్ట్రపై, తమిళనాడు 2-0తో నార్త్ పంజాబ్‌పై, కేరళ 2-0తో తెలంగాణ- ఏపీ రీజియన్‌పై, పంజాబ్ 1-0తో ఒడిశాపై గెలిచాయి.
క్వార్టర్స్‌లో తెలంగాణ- ఏపీ రీజియన్
బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో జూనియర్ బాలికలు, సీనియర్ బాలుర తెలంగాణ-ఏపీ రీజియన్ జట్లు క్వార్టర్స్ పోరుకు అర్హత సాధించారుు. గచ్చిబౌలి స్టేడియంలో జూనియర్ బాలికల కేటగిరీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ- ఏపీ జట్టు 23-22తో తమిళనాడుపై గెలుపొందింది. ఈ జట్టు క్వార్టర్స్‌లో కేరళతో తలపడుతుంది. సీనియర్ బాలుర విభాగంలో తెలంగాణ- ఏపీ జట్టు 41-35తో బిహార్‌పై విజయం సాధించి నాకౌట్ పోరుకు అర్హత సాధించింది.
సాత్విక గెలుపు
Published Fri, Nov 11 2016 10:44 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
Advertisement
Advertisement