లాన్ టెన్నిస్‌లో జాఫ్రీన్ ప్రతిభ
లాన్ టెన్నిస్‌లో జాఫ్రీన్ ప్రతిభ
Published Wed, Apr 5 2017 10:15 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
కర్నూలు(టౌన్): నగరంలోని బి.క్యాంపునకు చెందిన బాలిక డెఫ్ జాతీయ స్థాయి లాన్ టెన్నిస్‌లో బంగారు పతకం సాధించింది. గత నెల 28 నుంచి 31వ తేదీ వరకు చెన్నైలో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 21వ జాతీయ స్థాయి డెఫ్ లాన్ టెన్నిస్ పోటీలు నిర్వహించారు. ఈపోటీల్లో కర్నూలుకు మాజీ క్రికెటర్ జాకీర్ కూతురు జాఫ్రీన్ ఏపీకి ప్రాతినిధ్యం వహించింది. ఫైనల్‌లో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన విదిషా అనే క్రీడాకారిణిపై 6–4, 6–1 పాయింట్లతో గెలుపొంది బంగారు పతకం సాధించింది. జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందడంతో ఈ ఏడాది జులై నెలలో టర్కీలో జరుగుతున్న డెఫ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. జాఫ్రీన్ దేశంలోనే టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలవడమే కాకుండా, ప్రపంచ ర్యాకింగ్స్‌లో 24వ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవడంపై పలువురు క్రీడా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement