సైనిక్‌పురి, న్యూస్‌లైన్: నాడు... ఆటంటే ఇష్టమైనా ఆర్థిక సమస్యలతో శిక్షణ తీసుకోలేకపోయారు. నేడు... అదే ఆటలో ప్రావీణ్యం సంపాదించి యువ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. వారి అంతర్జాతీయ కెరీర్‌కు చక్కని బాట వేస్తున్నారు. ఆయనే కంజివరం వెంకటరావు నాగరాజు. కోచ్ నాగరాజుగా టెన్నిస్ ఆటగాళ్లకు చిరపరిచితుడైన ఈయన శిష్యులే విష్ణు, సాకేత్, భువన తదితరులు.
నాడు ఏడు వుంది విద్యార్థులతో ప్రారంభమైన ‘ది స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్’ నేడు వందలాది వుంది క్రీడాకారులతో కళకళలాడుతోంది. సైనిక్‌పురిలో ‘భవాన్స్ టెన్నిస్ అకాడమీ’ పేరుతో రెండో బ్రాంచీని నెలకొల్పారు. సత్తాగల ఆటగాళ్లు వెలుగులోకి రావాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమంటున్న ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు.
కష్టమైనా... నష్టమైనా...
‘టెన్నిస్ ఆటంటే ఎంతో ఇష్టం. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో శిక్షణకు నోచుకోలేకపోయాను. అరుునా స్వయుంకృషితో ఆడి జూనియుర్స్ విభాగంలో జాతీయస్థాయి ఫైనల్స్‌లో ఆడాను. ఆపై ముందుకెళ్లాలంటే ప్రొఫెషనల్ శిక్షణ తప్పనిసరి కానీ... నాకది అందనంత దూరంలో ఉండింది. దీంతో ఉద్యోగం చేస్తూ... అన్నావులై విశ్వవిద్యాలయం నుంచి ‘లాన్ టెన్నిస్’ స్పెషలైజేషన్‌గా తీసుకొని ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పీజీ పూర్తిచేశా.
తర్వాత హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్‌గా పనిచేశాను. ఆర్థికంగా కాస్త మెరుగైన తర్వాత 1991, ఫిబ్రవరి 4న సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రియేషన్ క్లబ్‌లో పవర్ టెన్నిస్ అకాడమీని ప్రారంభించాను. అప్పట్లో పట్టుమని పది మంది లేకపోయినా ఏమాత్రం నిరాశచెందక శ్రమించేవాడిని. ఇప్పుడదే అకాడమీ వందలమందితో కళకళలాడుతుంటే ఆనందంగా ఉంది. శిక్షణ పొందిన క్రీడాకారుల్లో పలువురు జాతీయు, అంతర్జాతీయు స్థారుులో రాణించడమే ఆనందానికికారణం.’
విష్ణు ఓనవూలు నేర్చుకుందిక్కడే
‘టెన్నిస్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కొందరు ఆటగాళ్లు నా వద్దే శిక్షణ పొందారు. లండన్ ఈవెంట్‌తో ఒలింపియన్‌గా మారిన విష్ణు కూడా నా శిష్యుడే. ఇతనే కాదు ఐటీఎఫ్ టోర్నీలో రాణిస్తున్న సాకేత్ మైనేని, సుశీల్ నార్లా, విశాల్‌లు కూడా నా అకాడమీలోనే రాటుదేలారు. వీరితో పాటు జూనియుర్ డేవిస్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏఆర్ ఆనంద్, అనంత్ శ్రీరాం, విఘ్నేశ్, సందీప్‌లు నా శిక్షణ తీసుకున్నవారే. జాతీయ స్థాయిలో అండర్-12, 14, 16 స్థారుుల్లో చెప్పుకోదగ్గ ప్రతిభ కనబరిచిన రిత్విక్ చౌదరి, దార్ల వుుదలియూర్, శివానీ జా, రిత్విక్ బజార్, పి.సి. అనిరుధ్, పి. సిద్ధార్థ్, శశిధర్, హివుకేష్, కృష్ణతేజలు నా వద్దే ఓనమాలు నేర్చారు. భువన కాల్వ, సౌజన్య, పార్థసారథి తదితరుల గురించి చెప్పుకుంటూపోతే నా శిష్యుల జాబితా చాంతాడంత ఉంది.’
ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి
‘ఔత్సాహిక క్రీడాకారుల సంఖ్య పెరగడంతో మరో అకాడమీని నెలకొల్పాను. 2011 ఏడాది డిసెంబర్‌లో సైనిక్‌పురిలో భవాన్స్ టెన్నిస్ అకాడమీ పేరిట మరో శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చాను. ప్రస్తుతం రైల్వే రిక్రియేషన్ క్లబ్‌లో 4, భవాన్స్ టెన్నిస్ అకాడమీలో 3 టెన్నిస్ కోర్టులున్నారుు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయూ కోర్టుల్లో ఉదయుం నుంచి సాయుంత్రం వరకు వందలాది వుంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. వీళ్లందరికి అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇవ్వాలంటే ప్రభుత్వ, ప్రైవేటు ప్రోత్సాహం అవసరం. ముఖ్యంగా ప్రభుత్వం టెన్నిస్ క్రీడపై చిన్నచూపు చూస్తోంది. ఇతర ఆటల్లాగే టెన్నిస్‌ను ప్రోత్సహించినపుడే రాష్ట్రం నుంచి మరింత మంది సత్తాగల క్రీడాకారులు వెలుగులోకి వస్తారు.’
ఏపీ టెన్నిస్ ‘పవర్’ నాగరాజు
Published Sat, Jan 4 2014 12:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement