Suriya And Jyotika Produced Arun Vijay's Son Debut Oh My Dog Trailer And Release Date Revealed - Sakshi
Sakshi News home page

Oh My God OTT Release Date: అమెజాన్‌ ప్రైమ్‌లో 'ఓ మై డాగ్‌' సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Published Sat, Apr 16 2022 1:53 PM | Last Updated on Sat, Apr 16 2022 3:01 PM

Oh My Dog Trailer: Arun Vijay Son Arnav Debut In Suriyas Production - Sakshi

మాస్టర్‌ ఆర్ణవ్‌కు అవార్డు రావడం ఖాయమని దర్శకుడు సరోవ్‌ షణ్ముగం అన్నారు. ఈయన దర్శకత్వం వహించిన 'ఓ మై డాగ్‌' చిత్రాన్ని నటి జ్యోతిక, సూర్య తమ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా ద్వారా నటుడు అరుణ్‌విజయ్‌ కొడుకు ఆర్ణవ్‌ బాలనటుడిగా ప్రధాన పాత్రలో పరిచయం అయ్యాడు. ఇందులో అరుణ్‌విజయ్, ఆయన తండ్రి సీనియర్‌ నటుడు విజయ్‌కుమార్‌ ముఖ్యపాత్రలు పోషించగా, మహిమ నంబియార్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కుక్కపిల్ల కీలకపాత్రలో నటించడం మరో విశేషం.

నివాస్‌ కే.ప్రసన్న సంగీతం, గోపీనాథ్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఈ నెల 21వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ టైంలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివకుమార్‌ మాట్లాడుతూ చదువులో బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ అయిన తన కొడుకు సూర్య నటుడిగా, నిర్మాతగా ఈస్థాయికి ఎదగడం గర్వంగా ఉందన్నారు. తన కొడుకు, మనవడితో కలిసి ఈ చిత్రంలో నటించడం మధురమైన అనుభవం అని నటుడు విజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ చిత్రంలో నటనకు మాస్టర్‌ ఆర్ణవ్‌కు అవార్డు రావడం ఖాయమని దర్శకుడు సరోవ్‌ షణ్ముగం తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement