Jeevitha, Prakash Raju And Manchu Vishnu To Contest In MAA Association Elections - Sakshi
Sakshi News home page

MAA Elections 2021: చిరంజీవి మద్దతు ఆయనకేనా?

Published Wed, Jun 23 2021 2:09 PM | Last Updated on Thu, Jun 24 2021 11:53 AM

Jeevitha, Prakash Raj, Manchu Vishnu To Contest MAA Elections - Sakshi

తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఎన్నికలు రంజుగా సాగనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే టాలీవుడ్‌ మూడు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. మా అధ్యక్షుడి స్థానం కోసం ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవిత బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బడా హీరోలు చిరంజీవి, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎవరికి మద్దతు తెలుపుతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే చిరంజీవి మద్దతుతో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తుండగా తండ్రి మోహన్ బాబు ఆశీస్సులతో మంచు విష్ణు అధికారికంగానే పోటీలోకి దిగాడు. అంతేగాక అతడు సూపర్‌ స్టార్‌ కృష్ణ, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను కూడా స్వయంగా కలుస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ మద్దతుతో జీవిత అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ కీలకంగా మారబోతున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మా ఎలక్షన్స్‌లో ఓట్లు వేయడానికి ప్రభాస్, మహేశ్‌బాబు లాంటి స్టార్స్ వస్తారా? లేదా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. 

చదవండి: ‘మా’ అధ్యక్ష బరిలో జీవిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement