బుల్లితెరపై జీవితం | Zee Telugu talk show Batuku Jatka Bandi second season | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై జీవితం

Jul 9 2015 11:40 PM | Updated on Sep 3 2017 5:11 AM

బుల్లితెరపై జీవితం

బుల్లితెరపై జీవితం

‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అన్నారు పెద్దలు. ఎన్ని కలతలొచ్చినా, ఆలుమగలు అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ

 ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అన్నారు పెద్దలు. ఎన్ని కలతలొచ్చినా, ఆలుమగలు అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలంటారు. కానీ, అనుమానాలు, అపార్థాలతో కొంతమంది విడిపోతుంటారు. అలా విడిపోయే భార్యాభర్తలను కలపడానికి ‘జీ తెలుగు’ ‘బతుకు జట్కాబండి’ ద్వారా ప్రయత్నం చేస్తోంది. ఈ కార్యక్రమం జూలై 6న పునః ప్రారంభమైంది. ‘‘నటి, దర్శకురాలు జీవిత ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. లాయర్, సైకాలజిస్ట్‌ల సమక్షంలో ఈ వేదికపై సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం. సమస్యలున్న దంపతులు మమ్మల్ని సంప్రదించమని కోరుతున్నాం. జీ తెలుగులో  సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది’’ అని జీ తెలుగు  చానల్ ప్రతినిధులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement