second season
-
నేటినుంచి ‘అల్టిమేట్ ఖోఖో’ లీగ్
రెండో సీజన్ ‘అల్టిమేట్ ఖోఖో’ లీగ్‌కు రంగం సిద్ధమైంది. కటక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నేడు ప్రారంభమయ్యే ఈ టోర్నీ జనవరి 13 వరకు సాగుతుంది. మొత్తం ఆరు జట్లు ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ఒడిషా జాగర్‌నట్స్, రాజస్తాన్ వారియర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ మొదలవుతుంది. నేడు జరిగే తర్వాతి మ్యాచ్‌లో ముంబై ఖిలాడీస్‌తో తెలుగు యోధాస్ టీమ్ తలపడుతుంది. గుజరాత్ జెయింట్స్, చెన్నై క్విక్ గన్స్ టోర్నమెంట్ బరిలో ఉన్న మరో రెండు జట్లు. 21 రోజుల వ్యవధిలో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. జీఎంఆర్ గ్రూప్ యాజమాన్యానికి చెందిన తెలుగు యోధాస్ టీమ్ గత ఏడాది రన్నరప్‌గా నిలవగా...ఈ సారి టైటిల్ సాధిస్తామని యోధాస్ కెప్టెన్ ప్రతీక్ వైకర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. భారత ఖోఖో సమాఖ్య గత ఏడాది ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ఈ సీజన్ కోసం అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. గత ఏడాది టీవీ, ఓటీటీలో కలిపి 164 మిలియన్ల మంది ప్రేక్షకులు టోర్నీని తిలకించారు. ‘సోనీ నెట్వర్క్’లో మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి. -
కాశ్వీ బన్గయీ కరోడ్‌పతి
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో ఇద్దరు భారత యువ క్రీడాకారిణుల పంట పండింది. చండీగఢ్‌కు చెందిన పేస్ బౌలర్ కాశ్వీ గౌతమ్, కర్నాటక బ్యాటర్ వృందా దినేశ్‌ల పంట పండింది. కాశ్వీని గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు ఎంచుకోగా...వృందాను రూ.1 కోటి 30 లక్షలకు యూపీ వారియర్స్ తీసుకుంది. ఆస్ట్రేలియా యువ క్రీడాకారిణి అనాబెల్ సదర్లాండ్‌ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకే తమ జట్టులోకి చేర్చుకుంది. గత ఏడాదిలాగే ఈ సారి కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నా... శ్రీలంక కెపె్టన్ చమరి అటపట్టును వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు. మొత్తం 165 మంది ప్లేయర్లు మహిళల లీగ్‌లో వేలం కోసం అందుబాటులోకి రాగా ఐదు జట్లూ కలిపి 30 మందిని ఎంచుకున్నాయి. వీరిలో 9 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. 2024 ఫిబ్రవరిలో డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ మ్యాచ్‌లు జరుగుతాయి. వారిద్దరికి ఎందుకంటే... గత సీజన్ వేలంలో భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు వేలంలో రూ.1.80 కోట్లు పలకగా, ఇప్పటి వరకు భారత్‌కు ఆడని (అన్క్యాప్డ్) కాశ్వీకి అంతకంటే ఎక్కువ మొత్తం లభించడం విశేషం. సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కాశ్వీ కోసం అన్ని జట్లూ పోటీ పడ్డాయి. గత నెలలో జాతీయ టి20 టోర్నీ లో 12 వికెట్లు తీసిన కాశ్వీ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ‘ఎ’ సిరీస్‌లో ఆడింది. అంతకు ముందు ఆసియా కప్ అండర్–23లో విజేతగా నిలిచిన జట్టులోనూ సభ్యురాలు. కాశ్వీ కనీస ధర రూ. 10 లక్షలతో వేలం మొదలు కాగా, ప్రధానంగా పోటీ యూపీ, గుజరాత్ మధ్యే నడిచింది. చివరకు గుజరాత్ ఆమెను సొంతం చేసుకుంది. మూడేళ్ల క్రితం అండర్–19 వన్డేలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన రికార్డు కాశ్వీకి ఉంది. 22 ఏళ్ల వృంద దూకుడైన బ్యాటింగ్‌కు మారపేరు. గత రెండు సీజన్లుగా నిలకడగా ఆడిన వృంద ఈ ఏడాది సీనియర్ వన్డే టోర్నీ లో 477 పరుగులతో కర్నాటక ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. అనాబెల్ ఆసీస్ తరఫున 23 వన్డేలు, 22 టి20లు ఆడింది. మన ప్లేయర్లు ముగ్గురు... భారత్ తరఫున 17 టి20లు ఆడిన ఆంధ్ర ఓపెనర్ సబ్బినేని మేఘనను బెంగళూరు రూ. 30 లక్షలకు, ఇంకా సీనియర్ స్థాయిలో ఆడని హైదరాబాద్ బ్యాటర్ ఏడుకొండల త్రిష పూజితను గుజరాత్ జెయింట్స్ రూ. 10 లక్షలకు తీసుకున్నాయి. 2008నుంచి 2014 మధ్య భారత్ తరఫున 50 వన్డేలు, 37 టి20లు ఆడి ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన 35 ఏళ్ల హైదరాబాద్ లెఫ్టార్మ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానాను రూ. 30 లక్షలకు యూపీ వారియర్స్ ఎంచుకోవడం విశేషం. మరో హైదరాబాద్ అమ్మాయి గొంగిడి త్రిష మాత్రం వేలంలో ఎంపిక కాలేదు. వేలంలో టాప్ అనాబెల్ (ఆ్రస్టేలియా) – రూ. 2 కోట్లు కాశ్వీ గౌతమ్ (భారత్) – రూ. 2 కోట్లు వృంద దినేశ్ (భారత్) – రూ.1.30 కోట్లు షబ్నమ్ (దక్షిణాఫ్రికా) – రూ. 1.20 కోట్లు ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా) – రూ. 1 కోటి ఏక్తా బిస్త్ (భారత్) – రూ. 60 లక్షలు వేర్హమ్ (ఆ్రస్టేలియా) – రూ. 40 లక్షలు -
165 మంది ప్లేయర్లు... 30 స్థానాలు!
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్ (2024) కోసం మినీ వేలానికి రంగం సిద్ధమైంది. వేర్వేరు దేశాలకు చెందిన 165 మంది మహిళా క్రికెటర్లు ఈ లీగ్ వేలంలో పాల్గొంటున్నారు. అయితే డబ్ల్యూపీఎల్‌లో ఉన్న ఐదు జట్ల కోసం కేవలం 30 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వీటిలో గరిష్టంగా 9 మంది విదేశీ క్రీడాకారిణులను ఎంచుకునే అవకాశం ఉంది. గత సీజన్లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌తో పాటు రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్, మూడో స్థానంతో ముగించిన యూపీ వారియర్స్ దాదాపు అదే జట్టును అట్టి పెట్టుకొని తక్కువ మందిని మాత్రమే విడుదల చేశాయి. దాంతో ఆర్సీబీ, గుజరాత్ టీమ్లలోనే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఒక్కో జట్టులో గరిష్టంగా 18 మంది ప్లేయర్లు ఉండాలి. ఐదు జట్లకు కలిపి 90 మంది కాగా అన్ని టీమ్‌లలోనూ కలిపి ప్రస్తుతం 60 మంది ప్లేయర్లు ఇప్పటికే ఉన్నారు. ఒక్కో జట్టు ప్లేయర్ల కోసం గరిష్టంగా రూ. 13.35 కోట్లు కేటాయించాల్సి ఉండగా మినీ వేలం కోసం ప్రస్తుతం అత్యధికంగా గుజరాత్ వద్ద రూ. 5.95 కోట్లు ఉన్నాయి. వేలంలో అందుబాటులో ఉన్న అగ్రశ్రేణి ప్లేయర్లలో ప్రధానంగా ఇద్దరిపై అందరి దృష్టీ నిలిచింది. శ్రీలంకకు చెందిన చమరి అటపట్టు, ఇంగ్లండ్ స్టార్ డాని వైట్ వేలంలో ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో పాటు వీరి అంతర్జాతీయ అనుభవం డబ్ల్యూపీఎల్‌లో కీలకం కానుంది. వీరిద్దరు రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలో నిలిచారు. వీరితో పాటు గత సీజన్ ఆడి జట్లు వదిలేసుకున్న తర్వాత మళ్లీ వేలంలో నిలిచిన ప్లేయర్లలో అనాబెల్ (ఆస్ట్రేలియా), షబ్నమ్ (దక్షిణాఫ్రికా), దేవిక వైద్య (భారత్), తారా నోరిస్ (అమెరికా), సారా బ్రైస్ (స్కాట్లాండ్) చెప్పుకోదగ్గవారు. ఇంకా భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించని యువ క్రీడాకారిణుల్లో ఉమా, మన్నత్ లాంటివారిపై వేలంలో జట్లు ఆసక్తి చూపించవచ్చు. -
Prime Volleyball League 2023: వాలీబాల్ లీగ్‌కు వేళాయె...
బెంగళూరు: గత ఏడాది వాలీబాల్ ప్రియుల్ని అలరించిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఇప్పుడు రెండో సీజన్‌తో మరింత ప్రేక్షకాదరణ పొందాలని ఆశిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే సీజన్–2 పోటీల్లో ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు కోల్‌కతా థండర్‌బోల్ట్స్, హైదరాబాద్ బ్లాక్‌హాక్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్, కాలికట్ హీరోస్, అహ్మదాబాద్ డిఫెండర్స్, బెంగళూరు టొర్పెడోస్, చెన్నై బ్లిట్జ్, ముంబై మిటియోర్స్ ‘ఢీ’కి రెడీ అయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్స్ కోల్‌కతా థండర్‌బోల్ట్స్ తమ జోరు ఈ సీజన్లోనూ కొనసాగించేందుకు ఉత్సాహంగా ఉంది. ముందుగా శనివారం నుంచి లీగ్ దశలో 28 మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మార్చి 3, 4 తేదీల్లో సెమీఫైనల్స్ పోటీలు నిర్వహిస్తారు. 5న విజేతను తేల్చే ఫైనల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. బెంగళూరులో నేడు కోల్‌కతా థండర్‌బోల్ట్స్, బెంగళూరు టొర్పెడోస్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతుంది. ఈ నెల 12 నుంచి 21 వరకు హైదరాబాద్ వేదికగా 11 మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మిగిలిన లీగ్ దశ సహా సెమీస్, ఫైనల్ దాకా కొచ్చిలోనే మ్యాచ్‌ల్ని నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు క్లబ్ వాలీబాల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈసారి, వచ్చే ఏడాది క్లబ్ వాలీబాల్ ప్రపంచ చాంపియన్‌షిప్ భారత్‌లోనే జరుగనుండటంతో మరో విశేషం. -
'స్క్విడ్ గేమ్' మళ్లీ రానుంది.. ఈసారి ఎలాంటి గేమ్ ?
Squid Game Second Season Confirmed By Netflix: ప్రముఖ కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 17, 2021న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. నెంబర్ వన్ సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే రికార్డు సాధించింది. రిలీజైన 28 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. కొరియన్ భాషలో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు 900 మిలియన్ డాలర్లు లాభం వచ్చినట్లు సమాచారం. మొత్తం 8 గంటల 12 నిమిషాలు ఉండే ఈ సిరీస్‌లో 9 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ కోసమే నెట్‌ఫ్లిక్స్‌కు సబ్‌స్క్రైబ్ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే తాజాగా స్క్విడ్ గేమ్ సిరీస్‌కు రెండో సీజన్ రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ కో సీఈవో, చీఫ్ కంటెంట్ ఆఫీసర్ టెడ్ సారండోస్ తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ 2021 నాల్గో త్రైమాసిక ఆదాయం గురించి సారండోస్తో ఓ ఇంటర్వ్యూ చేశారు. అందులో సౌత్ కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్‌కు రెండో సీజన్ రానుందా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు సారండోస్ ఇలా జవాబిచ్చాడు. 'కచ్చితంగా. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించిన నెంబర్ 1 సిరీస్. స్క్విడ్ గేమ్ ప్రపంచం ఇప్పుడే ప్రారంభమైంది. నెట్‌ఫ్లిక్స్ అభివృద్ధికి దోహదపడే ఫ్రాంచైజీలో మొదటి స్థానంలో ఉంది. అలాగే రెండో స్థానంలో బ్రిడ్జర్టన్ కాగా తర్వాతి స్థానాల్లో స్ట్రేంజర్ థింగ్స్ ఉన్నాయి.' అని చెప్పుకొచ్చాడు. అయితే గతంలో కూడా స్క్విడ్ గేమ్ డైరెక్టర్ హ్వాంగ్ డాంగ్ హ్యూక్ ఈ సిరీస్‌కు సెకండ్ సీజన్ వస్తుందని పేర్కొన్నాడు. ఈ సిరీస్ మొదటి సీజన్లో 456 మంది పోటీదారులు డబ్బు కోసం పిల్లలకు సంబంధించిన గేమ్ ఆడతారు. కానీ అందులో ఓడిపోయిన వారిని చంపడం వంటి ఘోరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈసారి సెకండ్ సీజన్ ఎలాంటి గేమ్‌తో రానుందో వేచి చూడాలి. -
'లూజర్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Zee5 Original Loser Season 2 Pre Release Event In Hyderabad: కరోనా, లాక్డౌన్ కారణంగా థియేటర్లన్ని మూత పడ్డాయి. దీంతో సినీ ప్రేక్షకులంతా ఓటీటీ బాట పట్టారు. అలాంటి ఓటీటీలో 'జీ5' ఒకటి. జీ5 ఓటీటీ అంటే వినోదం మాత్రమే కాదు, అంతకుమించి అన్నట్లుగా దూసుకుపోతోంది. అనేక జోనర్లలో సినిమాలు అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా తెరకెక్కిన జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ 'లూజర్'. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఆ హిట్ సిరీస్‌కు సీక్వెల్‌గా లూజర్ 2ను రూపొందించారు మేకర్స్. అయితే ఈ రెండో సీజన్‌కు అభిలాష్ రెడ్డితోపాటు శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా 'లూజర్ 2' ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్, జీ5 హెడ్‌తోపాటు మార్కెటింగ్ డైరెక్టర్ లాయిడ్ జేవియర్ తదితరులు హాజరయ్యారు. ఈ 'లూజర్ 2' సిరీస్ జనవరి 21 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. ఓటీటీ అనేది న్యూ రెవల్యూషన్ అని నాగార్జున పేర్కొన్నారు. 'ఓటీటీలో సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. సినిమా లాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలగాలి. అలాంటిది లూజర్ వెబ్ సిరీస్‌ను ఆడియన్స్‌కు థ్రిల్ కలిగించేలా అద్భుతంగా తీశారు. 'లూజర్ 2' ట్రైలర్ చూశాను. ఇందులో ఉన్న కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అక్కడే మీరు సక్సెస్ అయినట్టు. అలాగే చేతన్ ఆనంద్ గొప్ప ప్లేయర్. తనను చూసి భారతదేశం గర్వపడుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో మంచి టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాం. అలాగే జీ 5 స్టూడియోతో మా ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుంది.' అని నాగార్జున తెలిపారు. ఈ కథకు భరత్, శ్రవణ్ లిద్దరూ రైటింగ్‌లో చాలా సపోర్ట్ చేశారు. నాతోపాటు కొన్ని ఎపిసోడ్స్ శ్రవణ్ డైరెక్ట్ చేశాడు. అలాగే మాకు సపోర్ట్‌గా నిలుస్తూ 90% ఇన్పుట్స్ ఇచ్చిన సుప్రియ గారికి, మాకు ఏం కావాలన్నా సహాయ సహకారాలు అందించిన స్పెక్ట్రా మీడియా నెట్వర్క్ వారికి మా ధన్యవాదాలు. అని డైరెక్టర్ అభిలాష్ పేర్కొన్నారు. 'అన్నపూర్ణ బ్యానర్లో ఎంతో మందికి అవకాశం ఇచ్చినా కూడా వారు గొప్పలు చెప్పుకోరు. మేము 'లూజర్' కోసం చాలా టెక్నిషీయన్స్ అందరూ చాలా సపోర్ట్ చేయడంతోనే ఈ సీరీస్ ఇంతపెద్ద హిట్ అయ్యింది. మాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సిరీస్‌లో నటించే అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోకు, నిర్మాత సుప్రియ గారిగి జీ 5 వారికి మా ధన్యవాదాలు' అని నటుడు ప్రియదర్శి చెప్పాడు. ఈ వెబ్ సిరీస్‌లో ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, షాయాజీ షిండే, శశాంక్, హర్షిత్ రెడ్డి తదితరులు నటించి మెప్పించారు. ఇదీ చదవండి: ముంబైలో 'పుష్ప' ఫీవర్.. లోకల్ ట్రైన్లో శ్రీవల్లి హుక్ స్టెప్పు -
ప్రతిభ మీది... వేదిక మాది...
మీలో ప్రతిభ ఉందా...? మేము వెలుగులోకి తెస్తాం... మీలో ఉత్సాహం ఉందా? మేము అవకాశాలు కల్పిస్తాం... తెలుగు రాష్ట్రాల్లో ఔత్సాహిక క్రికెటర్లు సత్తా చాటుకోవడానికి సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) రెండో సీజన్‌కు రంగం సిద్ధమైంది. 2021 జనవరి మూడో వారంలో సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) క్రికెట్ టోర్నమెంట్ రెండో సీజన్ మొదలుకానుంది. గత ఏడాది రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 891 జట్లు బరిలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ విభాగంలో ఎమరాల్డ్ డిగ్రీ కాలేజీ (తిరుపతి) విజేతగా... డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజీ (విశాఖపట్నం) రన్నరప్‌గా నిలిచాయి. జూనియర్ విభాగంలో శివారెడ్డి ఐటీసీ (కడప) చాంపియన్‌గా... శాతవాహన జూనియర్ కాలేజీ (హరిపురం, శ్రీకాకుళం) రన్నరప్‌గా నిలిచాయి. తెలంగాణ నుంచి సీనియర్ విభాగంలో సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజీ (సికింద్రాబాద్) విజేతగా... ఆదర్శ డిగ్రీ కాలేజీ (మహబూబ్‌నగర్) రన్నరప్‌గా నిలిచాయి. జూనియర్ విభాగంలో భవాన్స్ శ్రీ అరబిందో కాలేజీ చాంపియన్‌గా... ఎస్ఆర్ఆర్ కాలేజీ (మంచిర్యాల) రన్నరప్‌గా నిలిచాయి. టోర్నీ ఫార్మాట్... ► ముందుగా జిల్లా స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను 10 ఓవర్లచొప్పున నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేత జట్లు ప్రాంతీయస్థాయి టోర్నీకి, ప్రాంతీయ స్థాయి టోర్నీ విజేత జట్లు రాష్ట్ర స్థాయి టోర్నీకి అర్హత సాధిస్తాయి. రాష్ట్రస్థాయి మ్యాచ్‌లను 20 ఓవర్ల చొప్పున నిర్వహిస్తారు. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలే ప్రాతిపాదికగా ఎంట్రీలు స్వీకరిస్తారు. ఎంట్రీ ఫీజు... ► ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే జట్లు రూ. 1,500 ఎంట్రీ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫీజును ఆన్లైన్లోనే చెల్లించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం.... www.arenaone.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. ఎంట్రీలను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీలోగా పంపించాలి. ఏ ఏ విభాగాల్లో... ► సాక్షి ప్రీమియర్ లీగ్‌ను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అండర్–18 జూనియర్ స్థాయిలో (1–12–2002 తర్వాత జన్మించి ఉండాలి) ... అండర్–24 సీనియర్ స్థాయిలో (1–12–1996 తర్వాత జన్మించి ఉండాలి) వేర్వేరుగా నిర్వహిస్తారు. ఒక్కో కాలేజీ నుంచి గరిష్టంగా మూడు జట్లను పంపించే వెసులుబాటు ఉంది. మూడు జట్లు కూడా వేర్వేరుగా ఎంట్రీ ఫీజు చెల్లించాలి. అమ్మాయిల కోసం కూడా... ఈసారి సాక్షి ప్రీమియర్ లీగ్ టోర్నీలో మహిళా విభాగం మ్యాచ్‌లను కూడా నిర్వహించనున్నారు. మహిళా టోర్నీలో పాల్గొనేందుకు కనీస వయస్సు 12 ఏళ్లు. 1–12–2008 తర్వాత జన్మించిన అమ్మాయిలే అర్హులు. ఈ టోర్నీలో స్కూల్, కాలేజీ జట్లు పాల్గొనవచ్చు. మ్యాచ్‌లు రీజినల్ స్థాయిలో ప్రారంభమవుతాయి. రీజినల్ స్థాయి విజేత జట్లు రాష్ట్ర స్థాయి ఫైనల్స్ టోర్నీలో పాల్గొంటాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న జట్లు ఆన్లైన్లో ఉచితంగా ఎంట్రీలు పంపించవచ్చు. ఇతర వివరాలకు 99120 35299, 95055 14424, 96660 13544 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలను మూడు జోన్లుగా విభజించారు జోన్–1లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి. జోన్–2లో వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలు ఉన్నాయి. జోన్–3లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయం.. మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు తమ కళాశాల గుర్తింపు కార్డు (ఒరిజినల్), వయసు ధ్రువీకరణకు సంబంధించి పదో తరగతి మార్కుల మెమో (ఒరిజినల్)ను నిర్వాహకులకు తప్పనిసరిగా చూపించాలి. మ్యాచ్ జరిగే సమయంలో బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ తప్పనిసరిగా హెల్మెట్లు, లెగ్ ప్యాడ్లు, అండర్ గార్డ్స్, హ్యాండ్‌గ్లౌవ్స్, వైట్ డ్రెస్, వైట్ షూస్ ధరించాలి. గమనిక: అన్ని విషయాల్లో నిర్వాహకులదే తుది నిర్ణయం. -
తను నీడలో ఉంది
‘అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నిత్యా మీనన్. అంతేకాదు.. తన నటనతో మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ ప్రేక్షకుల హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్న ఈ మలయాళ బ్యూటీ తొలిసారి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. మాధవన్, అమిత్ సాధ్ నటించిన సూపర్ హిట్ ‘బ్రీత్’ వెబ్ సిరీస్‌కి ఇది రెండవ సీజన్. రెండో సీజన్లో అమిత్ సాధ్ కూడా కీలక పాత్రలో నటించారు. జూలై 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ ప్రసారం కానుంది. కాగా అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్‌లకు ఇది తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం. ‘తను నీడలో ఉంది... కనుగొనబడటానికి వేచి చూస్తోంది’ అంటూ ఈ సిరీస్ తొలి పోస్టర్ని విడుదల చేశారు. -
భారత్‌కు వరుసగా రెండో ఓటమి
భువనేశ్వర్: ప్రొ హాకీ లీగ్ రెండో సీజన్లో భారత పురుషుల జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గత మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ బెల్జియం చేతిలో భంగపడ్డ భారత్... శుక్రవారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 3–4 గోల్స్ తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడింది. భారత్ తరఫున రాజ్ కుమార్ (36వ, 47వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... రూపిందర్ సింగ్ (52వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. ఆసీస్ తరఫున డైలాన్ (6వ నిమిషంలో), టామ్ (18వ నిమిషంలో), లెచ్లాన్ (41వ నిమిషంలో), జాకబ్ (42వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. మ్యాచ్ మొదటి మూడు క్వార్టర్స్‌లో పెద్దగా ప్రభావం చూపని భారత ఆటగాళ్లు చివరి క్వార్టర్లో పుంజుకున్నారు. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి ఆసీస్ ఆధిక్యాన్ని 3–4కు తగ్గించారు. ఆట మరో 35 సెకన్లలో ముగుస్తుందనగా లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్ గా మలచడంలో భారత ప్లేయర్లు విఫలమవ్వడం తో కంగారూల గెలుపు ఖాయమైంది. నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండో లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. -
వెబ్‌లోకి తొలి అడుగు
నటిగా వెండితెరపై సమంత సూపర్ సక్సెస్. ఇదే మ్యాజిక్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ రిపీట్ చేయాలనుకుంటున్నారు. వెబ్ ఎంటర్టైన్మెంట్లోకి సమంత అడుగుపెట్టారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్లో çసమంత నటించనున్నారు. ఫస్ట్ సీజన్ విజయవంతం కావడంతో రెండో సీజన్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లారు మేకర్స్. ‘‘డిజిటల్ ఎంటర్టైన్మెంట్ బాగా దూసుకెళ్తోంది. ఇందులో నా భాగస్వామ్యం కూడా ఉండాలనుకుంటున్నాను. రాజ్ అండ్ డీకే రాసిన స్క్రిప్ట్ బాగుంది. డిజిటల్ మీడియంలోకి నా ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇంత కన్నా బెటర్ పార్ట్నర్స్ ఎవరు ఉంటారు? సినిమాల్లో ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు ఇది భిన్నమైనదని చెప్పగలను. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు’’ అన్నారు సమంత. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ఫ్యామిలీమ్యాన్’ తొలిసీజన్తో నటి ప్రియమణి, హీరో సందీప్‌కిషన్ వెబ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
సెప్టెంబర్ 15న ఫూట్సాల్ సీజన్ 2
-
ఐఎస్ఎల్ ఫైనల్లో గోవా
రెండో అంచె సెమీస్‌లో ఢిల్లీపై 3-0తో విజయం ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో ఎఫ్‌సీ గోవా జట్టు ఫైనల్‌కు చేరింది. మంగళవారం ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీతో జరిగిన రెండో అంచె తొలి సెమీస్‌లో ఈ జట్టు 3-0తో ఘనవిజయం సాధించింది. తొలి అంచె సెమీస్‌లో 0-1తో ఓడిన గోవా... ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో కనీసం రెండు గోల్స్ తేడాతో గెలవాల్సి ఉంది. సొంత మైదానంలో గోవా ఏమాత్రం అలక్ష్యం చూపకుండా ఆరంభం నుంచే తమ ఉద్దేశాన్ని చాటింది. ఫలితంగా ప్రథమార్ధం 11వ నిమిషంలోనే జోఫ్రే గోల్‌తో బోణీ చేసింది. ఆ తర్వాత 27వ నిమిషంలో రాఫెల్ కోల్హో తమ జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. అయితే ఒత్తిడిలో పడిన ఢిల్లీ ఆట గతి తప్పడంతో 84వ నిమిషంలో గోవాకు డూడూ మూడో గోల్ అందించి విజయాన్ని ఖాయం చేశాడు. నేడు (బుధవారం) జరిగే రెండో అంచె మరో సెమీస్‌లో కోల్‌కతా, చెన్నైయిన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి అంచెలో చెన్నైయిన్ 3-0తో కోల్‌కతాతో గెలిచి ఆధిక్యంలో ఉంది. -
‘మై హోం’కు హైదరాబాద్ ఫ్రాంచైజీ!
ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ బ్యాడ్మిం టన్ లీగ్ (ఐబీఎల్) రెండో సీజన్ కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 2013లో తొలి సీజన్ జరిగిన అనంతరం వివిధ కారణాలతో ఐబీఎల్‌ను నిర్వహించలేదు. దీంతో 2016 జనవరిలో రెండో సీజన్‌ను జరిపేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్ణయించింది. ఆరింట్లో ఐదు ఫ్రాంచైజీలు రంగంలోకి దిగేందుకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి. తొలి సీజన్ విజేత హైదరాబాద్ హాట్‌షాట్స్‌ను రియల్టీ సంస్థ మై హోమ్ గ్రూప్ దక్కించుకున్నట్టు సమాచారం. గతంలో ఈ జట్టు పీవీపీ యాజమాన్యంలో ఉండేది. లక్నో (అవధే వారియర్స్) జట్టును సహారా ఇండియా పరివార్ నిలబెట్టుకోగా ఢిల్లీ స్మాషర్స్‌ను ఇన్ఫినిటీ కంప్యూటర్ సొల్యూషన్స్ (ఐసీఎస్) జట్టు దక్కించుకుంది. అలాగే బెంగళూరును జిందాల్ గ్రూప్, చెన్నైని సైకిల్ అగర్బత్తి, ముంబైని ఓ రియాల్టీ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. -
రెండో సీజన్‌కు రంగం సిద్ధం
రేపటి నుంచి ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ ఈ ఏడాది రూ.100 కోట్లకు చేరిన స్పాన్సర్షిప్ ఆదాయం న్యూఢిల్లీ: భారత్‌లో ఆటంటే క్రికెటే అన్న అభిప్రాయాన్ని ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ తిరగరాసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. తొలి ఏడాది ఈ టోర్నీకి విశేష ఆదరణ లభించింది. ఎనిమిది నగరాల్లో జరిగిన మ్యాచ్‌లకు ఫుట్‌బాల్ ప్రేమికులు పోటెత్తారు. ఈనేపథ్యంలో శనివారం నుంచి జరిగే రెండో సీజన్‌పై అంచనాలు పెరిగాయి. టోర్నీ తొలి మ్యాచ్ అట్లెటికో డి కోల్‌కతా, చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్ల మధ్య జరుగుతుంది. ఇక ఐఎస్ఎల్-1 సూపర్ సక్సెస్‌తో ఫ్రాంచైజీలన్నీ సంతోషంగా ఉన్నాయి. ఇదే జోరు కొనసాగితే నాలుగో సీజన్ ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పడతామని గట్టిగా నమ్ముతున్నాయి. ఐఎస్ఎల్-2పై కార్పొరేట్ కంపెనీలు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. అందుకే స్పాన్సర్షిప్ ఆదాయం కింద నిర్వాహకులకు ఈసారి రూ.100 కోట్ల ఆదాయం లభించింది. ఇది గతేడాది రూ.55 కోట్లుగా ఉంది. ఆయా జట్లు కూడా తమ స్పాన్సర్షిప్ ఆదాయాన్ని దాదాపు రెండింతలుగా ఆర్జించాయి. 2014లో జెర్సీ ముందు లోగోకు రూ.5-6 కోట్ల మధ్య తీసుకుంటే ఈసారి అది రూ.8-10 కోట్లకు చేరింది. కోల్‌కతా గతేడాది ఐదు ముఖ్య స్పాన్సర్లతో రంగంలోకి దిగగా ఈసారి ఆరింటితో బరిలోకి దిగుతోంది. ప్రారంభ వేడుకల్లో ఐశ్వర్య, రెహమాన్ ‘షో’ ఐఎస్ఎల్ రెండో సీజన్‌కు అదిరిపోయే ఆరంభం లభించనుంది. శనివారం సాయంత్రం జరిగే ప్రారంభ వేడుకల్లో మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఐదేళ్ల విరామం అనంతరం ఆమె తన డ్యాన్స్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేయనుంది. అంతేకాకుండా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కూడా తన సంగీతంతో ఉర్రూతలూగించనున్నాడు. ఇంకా ఇతర ప్రముఖులు కూడా తమ షోతో ఆకట్టుకోనున్నారు. ఇప్పటికే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. -
యు ముంబా జోరు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్లో యు ముంబా జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఆదివారం బెంగాల్ వారియర్స్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో 31-17 తేడాతో నెగ్గింది. దీంతో 45 పాయింట్లతో తిరిగి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని నాలుగు సార్లు ఆలౌట్ చేసి 16 రైడ్ పాయింట్లు అందుకుంది. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడిన ముంబా జట్టు ఒక్క మ్యాచ్‌లోనే ఓడింది. మరో మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ జట్టు 45-26తో పట్నా పైరేట్స్‌పై నెగ్గింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో జైపూర్‌తో ఢిల్లీ తలపడుతుంది. -
ఆఫ్ ద ఫీల్డ్
సచిన్ x గవాస్కర్ ఏదో ఎగ్జిబిషన్ క్రికెట్ మ్యాచ్ కోసం కాదు... ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)ను నిర్వహించేందుకు ఈ క్రికె ట్ దిగ్గజాలు పోటీ పడుతున్నారు. వివరాల్లోకి వెళితే ఐబీఎల్ తొలి సీజన్ విజయవంతమైనా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్), నిర్వాహకుల మధ్య విభేదాల కారణంగా ఆగిపోయింది. దీంతో రెండో సీజన్ జరగలేదు. మళ్లీ ఈ లీగ్‌ను పునఃప్రారంభించేందుకు ‘బాయ్’ ప్రణాళికలు సిద్ధం చేసింది. జనవరి 1 నుంచి 18 వరకు టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. దీంతో లీగ్ నిర్వహణ కోసం బిడ్లను ఆహ్వానించింది. మొత్తం 15 బిడ్లు వచ్చాయి. ఇందులో గవాస్కర్, సచిన్‌లకు చెందిన స్పోర్టింగ్ కంపెనీలు కూడా ఉన్నాయి. గతంలో ఉన్న జట్లను, ఫార్మాట్‌ను పూర్తిగా మార్చేసి కొత్త జట్లతో ఐపీఎల్ పునఃప్రారంభమవుతుంది. మరి దీని హక్కులు ఎవరు గెలుచుకుంటారనేది మూడు, నాలుగు రోజుల్లో తేలనుంది. -
బుల్లితెరపై జీవితం
‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అన్నారు పెద్దలు. ఎన్ని కలతలొచ్చినా, ఆలుమగలు అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలంటారు. కానీ, అనుమానాలు, అపార్థాలతో కొంతమంది విడిపోతుంటారు. అలా విడిపోయే భార్యాభర్తలను కలపడానికి ‘జీ తెలుగు’ ‘బతుకు జట్కాబండి’ ద్వారా ప్రయత్నం చేస్తోంది. ఈ కార్యక్రమం జూలై 6న పునః ప్రారంభమైంది. ‘‘నటి, దర్శకురాలు జీవిత ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. లాయర్, సైకాలజిస్ట్‌ల సమక్షంలో ఈ వేదికపై సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం. సమస్యలున్న దంపతులు మమ్మల్ని సంప్రదించమని కోరుతున్నాం. జీ తెలుగులో సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది’’ అని జీ తెలుగు చానల్ ప్రతినిధులు తెలిపారు.