యు ముంబా జోరు | U mumbai in race | Sakshi
Sakshi News home page

యు ముంబా జోరు

Published Mon, Aug 10 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

U mumbai in race

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్‌లో యు ముంబా జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఆదివారం బెంగాల్ వారియర్స్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో 31-17 తేడాతో నెగ్గింది. దీంతో 45 పాయింట్లతో తిరిగి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని నాలుగు సార్లు ఆలౌట్ చేసి 16 రైడ్ పాయింట్లు అందుకుంది. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడిన ముంబా జట్టు ఒక్క మ్యాచ్‌లోనే ఓడింది. మరో మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ జట్టు 45-26తో పట్నా పైరేట్స్‌పై నెగ్గింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో జైపూర్‌తో ఢిల్లీ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement