ఐఎస్‌ఎల్ ఫైనల్లో గోవా | Indian Super League Semis FC Goa vs Delhi Dynamos FC, 2nd Leg Highlights: Goa Storm Into The Final | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్ ఫైనల్లో గోవా

Published Wed, Dec 16 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM

ఐఎస్‌ఎల్ ఫైనల్లో గోవా

ఐఎస్‌ఎల్ ఫైనల్లో గోవా

రెండో అంచె సెమీస్‌లో ఢిల్లీపై 3-0తో విజయం
ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో ఎఫ్‌సీ గోవా జట్టు ఫైనల్‌కు చేరింది. మంగళవారం ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీతో జరిగిన రెండో అంచె తొలి సెమీస్‌లో ఈ జట్టు 3-0తో ఘనవిజయం సాధించింది. తొలి అంచె సెమీస్‌లో 0-1తో ఓడిన గోవా... ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో కనీసం రెండు గోల్స్ తేడాతో గెలవాల్సి ఉంది. సొంత మైదానంలో గోవా ఏమాత్రం అలక్ష్యం చూపకుండా ఆరంభం నుంచే తమ ఉద్దేశాన్ని చాటింది.

ఫలితంగా ప్రథమార్ధం 11వ నిమిషంలోనే జోఫ్రే గోల్‌తో బోణీ చేసింది. ఆ తర్వాత 27వ నిమిషంలో రాఫెల్ కోల్హో తమ జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. అయితే ఒత్తిడిలో పడిన ఢిల్లీ ఆట గతి తప్పడంతో 84వ నిమిషంలో గోవాకు డూడూ మూడో గోల్ అందించి విజయాన్ని ఖాయం చేశాడు. నేడు (బుధవారం) జరిగే రెండో అంచె మరో సెమీస్‌లో కోల్‌కతా, చెన్నైయిన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి అంచెలో చెన్నైయిన్ 3-0తో కోల్‌కతాతో గెలిచి ఆధిక్యంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement