FC Goa team
-
నార్త్ఈస్ట్పై గోవా గెలుపు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ సీజన్–6లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ గోవా 2–0తో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీపై గెలుపొందింది. ఫలితంగా సీజన్లో ఏడో గెలుపును నమోదు చేసిన గోవా 24 పాయింట్లతో ‘టాప్’ స్థానంలోకి దూసుకెళ్లింది. 67వ నిమిషంలో జాకీ చంద్ సింగ్ కొట్టిన పాస్‌ను అడ్డుకోబోయిన నార్త్ఈస్ట్ ప్లేయర్ కొమోస్కీ నేరుగా తమ గోల్‌పోస్టులోకే బంతిని పంపి సెల్ఫ్ గోల్‌తో ప్రత్యర్థి ఖాతాను తెరిచాడు. 82వ నిమిషంలో పెనాలీ్టని గోల్‌గా మలిచిన ఫెరాన్ కొరొమినాస్ గోవాకు 2–0తో విజయాన్ని ఖాయం చేశాడు. 80వ నిమిషంలో ప్రత్యరి్థని దురుసుగా అడ్డుకున్న నార్త్ఈస్ట్ ప్లేయర్ డేవిడ్ రెడ్ కార్డ్ పొంది మైదానాన్ని వీడాడు. నేటి మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీతో జంషెడ్పూర్ ఎఫ్‌సీ తలపడుతుంది. -
ఐఎస్ఎల్ ఫైనల్లో గోవా
రెండో అంచె సెమీస్‌లో ఢిల్లీపై 3-0తో విజయం ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో ఎఫ్‌సీ గోవా జట్టు ఫైనల్‌కు చేరింది. మంగళవారం ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీతో జరిగిన రెండో అంచె తొలి సెమీస్‌లో ఈ జట్టు 3-0తో ఘనవిజయం సాధించింది. తొలి అంచె సెమీస్‌లో 0-1తో ఓడిన గోవా... ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో కనీసం రెండు గోల్స్ తేడాతో గెలవాల్సి ఉంది. సొంత మైదానంలో గోవా ఏమాత్రం అలక్ష్యం చూపకుండా ఆరంభం నుంచే తమ ఉద్దేశాన్ని చాటింది. ఫలితంగా ప్రథమార్ధం 11వ నిమిషంలోనే జోఫ్రే గోల్‌తో బోణీ చేసింది. ఆ తర్వాత 27వ నిమిషంలో రాఫెల్ కోల్హో తమ జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. అయితే ఒత్తిడిలో పడిన ఢిల్లీ ఆట గతి తప్పడంతో 84వ నిమిషంలో గోవాకు డూడూ మూడో గోల్ అందించి విజయాన్ని ఖాయం చేశాడు. నేడు (బుధవారం) జరిగే రెండో అంచె మరో సెమీస్‌లో కోల్‌కతా, చెన్నైయిన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి అంచెలో చెన్నైయిన్ 3-0తో కోల్‌కతాతో గెలిచి ఆధిక్యంలో ఉంది. -
దుమ్ము రేపిన గోవా
నార్త్ఈస్ట్ యునెటైడ్పై 3-0తో గెలుపు ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టు అద్భుత రీతిలో చెలరేగుతోంది. సొంత మైదానంలో వరుసగా మూడో విజయాన్ని సాధించి తమ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. సోమవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 3-0తో నెగ్గింది. ఈ విజయంతో 18 పాయింట్లతో కోల్‌కతాను వెనక్కినెట్టి రెండో స్థానానికి చేరింది. ప్రస్తుతం నార్త్ఈస్ట్ 13 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 33వ నిమిషంలో రోమియో ఫెర్నాండెజ్ గోల్‌తో బోణీ చేసిన గోవా 45+1 నిమిషంలో మిరోస్లావ్ స్లెపికా రెండో గోల్‌తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ద్వితీయార్ధంలో నార్త్ఈస్ట్ గోల్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే 74వ నిమిషంలో గోవాకు ఆండ్రీ సాంటోస్ గోల్ అందించగా తిరుగులేని విజయం ఖాయమైంది.