Zee5 Original Loser Season 2 Pre Release Event In Hyderabad: కరోనా, లాక్‌డౌన్ కారణంగా థియేటర్లన్ని మూత పడ్డాయి. దీంతో సినీ ప్రేక్షకులంతా ఓటీటీ బాట పట్టారు. అలాంటి ఓటీటీలో 'జీ5' ఒకటి. జీ5 ఓటీటీ అంటే వినోదం మాత్రమే కాదు, అంతకుమించి అన్నట్లుగా దూసుకుపోతోంది. అనేక జోనర్‌లలో సినిమాలు అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా తెరకెక్కిన జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ 'లూజర్'. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఆ హిట్ సిరీస్‌కు సీక్వెల్‌గా లూజర్ 2ను రూపొందించారు మేకర్స్. అయితే ఈ రెండో సీజన్‌కు అభిలాష్ రెడ్డితోపాటు శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా 'లూజర్ 2' ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్, జీ5 హెడ్‌తోపాటు మార్కెటింగ్ డైరెక్టర్ లాయిడ్ జేవియర్ తదితరులు హాజరయ్యారు. ఈ 'లూజర్ 2' సిరీస్ జనవరి 21 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. ఓటీటీ అనేది న్యూ రెవల్యూషన్ అని నాగార్జున పేర్కొన్నారు. 'ఓటీటీలో సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. సినిమా లాగా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వగలగాలి. అలాంటిది లూజర్ వెబ్ సిరీస్‌ను ఆడియన్స్‌కు థ్రిల్ కలిగించేలా అద్భుతంగా తీశారు. 'లూజర్ 2' ట్రైలర్ చూశాను. ఇందులో ఉన్న కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అక్కడే మీరు సక్సెస్ అయినట్టు. అలాగే చేతన్ ఆనంద్ గొప్ప ప్లేయర్. తనను చూసి భారతదేశం గర్వపడుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో మంచి టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాం. అలాగే జీ 5 స్టూడియోతో మా ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుంది.' అని నాగార్జున తెలిపారు.
ఈ కథకు భరత్, శ్రవణ్ లిద్దరూ రైటింగ్‌లో చాలా సపోర్ట్ చేశారు. నాతోపాటు కొన్ని ఎపిసోడ్స్ శ్రవణ్ డైరెక్ట్ చేశాడు. అలాగే మాకు సపోర్ట్‌గా నిలుస్తూ 90% ఇన్‌పుట్స్ ఇచ్చిన సుప్రియ గారికి, మాకు ఏం కావాలన్నా సహాయ సహకారాలు అందించిన స్పెక్ట్రా మీడియా నెట్‌వర్క్ వారికి మా ధన్యవాదాలు. అని డైరెక్టర్ అభిలాష్ పేర్కొన్నారు. 'అన్నపూర్ణ బ్యానర్‌లో ఎంతో మందికి అవకాశం ఇచ్చినా కూడా వారు గొప్పలు చెప్పుకోరు. మేము 'లూజర్' కోసం చాలా టెక్నిషీయన్స్ అందరూ చాలా సపోర్ట్ చేయడంతోనే ఈ సీరీస్ ఇంతపెద్ద హిట్ అయ్యింది. మాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సిరీస్‌లో నటించే అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోకు, నిర్మాత సుప్రియ గారిగి జీ 5 వారికి మా ధన్యవాదాలు' అని నటుడు ప్రియదర్శి చెప్పాడు. ఈ వెబ్ సిరీస్‌లో ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, షాయాజీ షిండే, శశాంక్, హర్షిత్ రెడ్డి తదితరులు నటించి మెప్పించారు.
ఇదీ చదవండి: ముంబైలో 'పుష్ప' ఫీవర్.. లోకల్ ట్రైన్‌లో శ్రీవల్లి హుక్ స్టెప్పు
Comments
Please login to add a commentAdd a comment