Loser
-
ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు..
Top 10 Best Telugu Web Series As Per IMDB Rating: కరోనా కాలంలో ఎంటర్టైన్మెంట్కు సరైన వేదికలుగా మారాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో విభిన్నమైన కథలతో మూవీ లవర్స్‌కు ఎంతో చేరువయ్యాయి. ఓటీటీల్లో స్ట్రీమ్ అయిన చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లంటే పెట్టింది పేరుగా బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్ సిరీస్‌లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ సీన్ మారింది. వెబ్ సిరీస్‌లు తెరకెక్కించడంలో టాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. తెరకెక్కించడమే కాకుండా తెలుగు నేటివిటికి తగినట్లుగా మలిచి మంచి హిట్ కూడా అందుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి ఓటింగ్ తీసుకుని వాటికి రేటింగ్ నిర్ణయిస్తుంది ఐఎమ్‌డీబీ వెబ్సైట్. ఈ రకంగా ఐఎమ్‌డీబీ రేటింగ్‌ను బట్టి ప్రేక్షకులను మెచ్చిన టాప్ 10 తెలుగు వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా ! చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే.. 1. లూజర్-8.8 రేటింగ్ (జీ5) 2. కుడి ఎడమైతే-8.4 రేటింగ్ (ఆహా) 3. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ-8.4 రేటింగ్ (జీ5) 4. కొత్త పోరడు-8.3 రేటింగ్ (ఆహా) 5. తరగతి గది దాటి-8 రేటింగ్ (ఆహా) 6. గాడ్ ఆఫ్ ధర్మపురి-7.8 రేటింగ్ (జీ5) 7. పరంపర-7.6 రేటింగ్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 8. మస్తీస్-7.2 రేటింగ్ (ఆహా) 9. చదరంగం-7.1 రేటింగ్ (జీ5) 10. బ్యూటీ అండ్ ది బేకర్-7 రేటింగ్ (ఆహా) చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. -
కొన్ని కథలు ఓటీటీలోనే చెప్పాలి: నిర్మాత సుప్రియ
‘‘సినిమా కథలకు, ఓటీటీ కథలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కొన్ని కథలు ఓటీటీలోనే చెప్పాలి’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేశ్, షాయాజీ షిండే, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘లూజర్ 2’. అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకులు. అభిలాష్ రెడ్డి క్రియేటర్, అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్‌వర్క్స్‌పై సుప్రియ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో నేటి నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సుప్రియ మాట్లాడుతూ– ‘‘అన్నపూర్ణ స్టూడియోస్ స్కూల్ విద్యార్థులే ‘లూజర్ 2’కి పని చేశారు.. అందుకే వారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి కథ బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘లూజర్ 2’కి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అభిలాష్ రెడ్డి. పావని, కల్పిక, గాయత్రి, ప్రియదర్శి, శశాంక్ పాల్గొన్నారు. -
'లూజర్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Zee5 Original Loser Season 2 Pre Release Event In Hyderabad: కరోనా, లాక్డౌన్ కారణంగా థియేటర్లన్ని మూత పడ్డాయి. దీంతో సినీ ప్రేక్షకులంతా ఓటీటీ బాట పట్టారు. అలాంటి ఓటీటీలో 'జీ5' ఒకటి. జీ5 ఓటీటీ అంటే వినోదం మాత్రమే కాదు, అంతకుమించి అన్నట్లుగా దూసుకుపోతోంది. అనేక జోనర్లలో సినిమాలు అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా తెరకెక్కిన జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ 'లూజర్'. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఆ హిట్ సిరీస్‌కు సీక్వెల్‌గా లూజర్ 2ను రూపొందించారు మేకర్స్. అయితే ఈ రెండో సీజన్‌కు అభిలాష్ రెడ్డితోపాటు శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా 'లూజర్ 2' ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్, జీ5 హెడ్‌తోపాటు మార్కెటింగ్ డైరెక్టర్ లాయిడ్ జేవియర్ తదితరులు హాజరయ్యారు. ఈ 'లూజర్ 2' సిరీస్ జనవరి 21 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. ఓటీటీ అనేది న్యూ రెవల్యూషన్ అని నాగార్జున పేర్కొన్నారు. 'ఓటీటీలో సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. సినిమా లాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలగాలి. అలాంటిది లూజర్ వెబ్ సిరీస్‌ను ఆడియన్స్‌కు థ్రిల్ కలిగించేలా అద్భుతంగా తీశారు. 'లూజర్ 2' ట్రైలర్ చూశాను. ఇందులో ఉన్న కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అక్కడే మీరు సక్సెస్ అయినట్టు. అలాగే చేతన్ ఆనంద్ గొప్ప ప్లేయర్. తనను చూసి భారతదేశం గర్వపడుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో మంచి టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాం. అలాగే జీ 5 స్టూడియోతో మా ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుంది.' అని నాగార్జున తెలిపారు. ఈ కథకు భరత్, శ్రవణ్ లిద్దరూ రైటింగ్‌లో చాలా సపోర్ట్ చేశారు. నాతోపాటు కొన్ని ఎపిసోడ్స్ శ్రవణ్ డైరెక్ట్ చేశాడు. అలాగే మాకు సపోర్ట్‌గా నిలుస్తూ 90% ఇన్పుట్స్ ఇచ్చిన సుప్రియ గారికి, మాకు ఏం కావాలన్నా సహాయ సహకారాలు అందించిన స్పెక్ట్రా మీడియా నెట్వర్క్ వారికి మా ధన్యవాదాలు. అని డైరెక్టర్ అభిలాష్ పేర్కొన్నారు. 'అన్నపూర్ణ బ్యానర్లో ఎంతో మందికి అవకాశం ఇచ్చినా కూడా వారు గొప్పలు చెప్పుకోరు. మేము 'లూజర్' కోసం చాలా టెక్నిషీయన్స్ అందరూ చాలా సపోర్ట్ చేయడంతోనే ఈ సీరీస్ ఇంతపెద్ద హిట్ అయ్యింది. మాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సిరీస్‌లో నటించే అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోకు, నిర్మాత సుప్రియ గారిగి జీ 5 వారికి మా ధన్యవాదాలు' అని నటుడు ప్రియదర్శి చెప్పాడు. ఈ వెబ్ సిరీస్‌లో ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేష్, షాయాజీ షిండే, శశాంక్, హర్షిత్ రెడ్డి తదితరులు నటించి మెప్పించారు. ఇదీ చదవండి: ముంబైలో 'పుష్ప' ఫీవర్.. లోకల్ ట్రైన్లో శ్రీవల్లి హుక్ స్టెప్పు -
భారత్ పరాజయం
హువా హిన్ (థాయ్‌లాండ్): ఫెడ్ కప్ గ్రూప్-1 ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. థాయ్‌లాండ్‌తో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో సానియా మీర్జా, అంకిత రైనా, ప్రేరణ బాంబ్రీ, ప్రార్థన తొంబారేలతో కూడిన భారత్ 0-3తో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో ప్రేరణ బాంబ్రీ 2-6, 5-7తో బున్యావి థామ్చైవాట్ చేతిలో... రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 6-7 (5/7), 3-6తో లుక్సికా కుమ్కుమ్ చేతిలో ఓడిపోయా రు. డబుల్స్‌లో ప్రేరణ-ప్రార్థన ద్వయం 7-6 (8/6), 2-6, 4-6తో కమోన్‌వన్ బుయామ్-పీంగ్తార్న్ జంట చేతిలో పరాజయం పాలైంది. -
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు
కాంగ్రెస్ ఓటమిపై ఆంటోనీ కమిటీకి తెలంగాణ, ఏపీ నేతల నివేదికలు న్యూఢిల్లీ: సార్వత్రిక, శాసనసభ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఓటమిపై లోతుగా విశ్లేషించుకునే పనిలో పడింది. దేశవ్యాప్తంగా ఓటమికి దారితీసిన పరిస్థితులు, పార్టీ భవిష్య నిర్మాణంపై సమీక్ష జరిపేందుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన ఎ.కె.ఆంటోనీ కమిటీ గత నెల 26వ తేదీ నుంచి రాష్ట్రాల వారీగా సమీక్షా సమావేశాలు జరుపుతోంది. దీనిలో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాల నేతలతో ఇక్కడి వార్ రూమ్‌లో ఈ కమిటీ సమావేశమైంది. ఆంటోనీతోపాటు కమిటీలో ఉన్న ముకుల్‌వాస్నిక్, అవినాశ్‌పాండే, రామచంద్ర కుంతియా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఓటమిపై తన నివేదికను అందజేశారు. అనంతరం తెలంగాణ నేతలు ఒక్కొక్కరితో విడివిడిగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణ నుంచి మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్రెడ్డిలు ఈ సమావేశానికి హాజరై విడివిడిగా నివేదికలు ఇచ్చారు. కమిటీతో ఎస్.జైపాల్‌రెడ్డి 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించడంలో టీఆర్ఎస్ విజయవంతమైందని భావించిన ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారని నివేదికలో పొన్నాల పేర్కొన్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన చేసిన తీరు, దానికి ఇతర పార్టీలు మద్దతిచ్చినా కాంగ్రెస్‌ను దోషిగా చిత్రీకరించడం, ప్రభుత్వ వ్యతిరేకత వంటి కారణాలవల్ల పార్టీ ఓడిపోయిందని ఆంధ్రప్రదేశ్ నేతలు నివేదికలు ఇచ్చారు.