
‘‘సినిమా కథలకు, ఓటీటీ కథలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కొన్ని కథలు ఓటీటీలోనే చెప్పాలి’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేశ్, షాయాజీ షిండే, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘లూజర్ 2’. అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకులు. అభిలాష్ రెడ్డి క్రియేటర్, అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్‌వర్క్స్‌పై సుప్రియ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో నేటి నుంచి ప్రసారం కానుంది.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సుప్రియ మాట్లాడుతూ– ‘‘అన్నపూర్ణ స్టూడియోస్ స్కూల్ విద్యార్థులే ‘లూజర్ 2’కి పని చేశారు.. అందుకే వారి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడి కథ బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘లూజర్ 2’కి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అభిలాష్ రెడ్డి. పావని, కల్పిక, గాయత్రి, ప్రియదర్శి, శశాంక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment