Supriya
-
వీణా రావుకి ఈ అవకాశం రావడం అదృష్టం: నిర్మాత సుప్రియ
‘‘నా తొలి సినిమాని అశ్వినీదత్‌గారి బేనర్లోనే చేయాలి. కానీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జునగారు డైరెక్టర్‌గా తొలి అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరూ నాకు చిరస్మరణీయులు. వారి కుటుంబం నుంచి వచ్చి, మహిళా శక్తులుగా ఎదిగారు సుప్రియ, స్వప్నా దత్. నేను కథానాయికగా పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వీణా రావు ఫస్ట్ లుక్ దర్శన్‌ని సుప్రియ, స్వప్న విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను వీణా రావు మంచి కూచిపూడి డ్యాన్సర్. తనకి ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉండాలి’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. తారక రామారావు హీరోగా, తెలుగు అమ్మాయి వీణా రావుని హీరోయిన్గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ చిత్రం నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో వీణా రావు ఫస్ట్ దర్శన్‌ని నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వ΄్నా దత్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా స్వప్నా దత్ మాట్లాడుతూ– ‘‘వీణారావు చాలా అందంగా ఉంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రావాల్సిన సమయం ఇది. చౌదరి అన్న ఈ విషయంలో ఓ అడుగు ముందుకేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ– ‘‘వైవీఎస్ చౌదరిగారు డైరెక్టర్‌గా తీసిన తొలి చిత్రం ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చూసిన తర్వాత తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) చాలా సంతోషపడ్డారు. కొత్తవారిని పరిచయం చేయడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. వీణా రావుకి ఈ అవకాశం రావడం అదృష్టం’’ అని చెప్పారు. ‘‘వీణా రావు ఫస్ట్ దర్శన్‌ని లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నగార్లకు థ్యాంక్స్’’ అన్నారు యలమంచిలి గీత. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి. -
కంగనాపై అసభ్య పోస్ట్.. సుప్రియాకు షాకిచ్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: సినీ నటీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌పై సోషల్ మీడియా వేదికగా చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే భారీ మూల్యం చెల్లించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బుధవారం విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో సుప్రీయా శ్రీనతేకు టికెట్ నిరాకరించింది. 2019లో సుప్రీయా శ్రీనతే ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన విషయం తెలసిందే. అయితే ఈసారి కూడా మహారాజ్‌గంజ్ నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తుందని సుప్రియా శ్రీనతే ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో సుప్రియా శ్రీనతేపై బీజేపీ అభ్యర్థి పంకజ్ చౌదరీ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి మహారాజ్‌గంజ్‌లో వీరేంద్ర చౌదరీని బరిలోకి దింపింది. సుప్రియా శ్రీనతే సోషల్ మీడియా ఖాతా నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై వెలువడిన అసభ్యకరమైన విమర్శలు కాస్త వివాదం రేపాయి. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి తాను లోక్ ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ పార్టీని కోరినట్లు తెలిపారు. అయితే తన స్థానంలో మరో అభ్యర్థి పేరును సూచించినట్లు సుప్రియా పేర్కొన్నారు. కంగనాపై చేసిన అసభ్యకరమైన పోస్ట్‌పై.. సుప్రియా శ్రీనతే వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు. తన సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డులు పలువురికి తెలుసని తనకు తెలియకుండానే కంగనాపై అసభ్యకరమైన సోస్ట్ వేశారని తెలిపారు. ఈ పోస్ట్ తన దృష్టికి రావటంతో డిలీట్ చేశానని తెలిపారు.‘సుప్రియాపేరడీ’ అనే ‘ఎక్స్’ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారని.. దాని నిర్వాకులు ఎవరో తెలియదన్నారు. తన ‘ఎక్స్’ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. అప్పటికే ఆమె పోస్ట్ వివాదస్పదం కాగా.. బీజేపీ నేతలు ఆమెపై మండిపడ్డారు. ఇలా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతేకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 29 సాయంత్రం 5 గంటలోపు స్పందించాలని కోరింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల కోడ్)ని ఉల్లంఘించినట్లు పోల్ ప్యానెల్ తెలిపింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని ఈసీ ఆదేశించింది. -
Lok sabha elections 2024: శ్రుతి మించుతోంది
ఒకప్పుడు ఎన్నికలొస్తే ప్రత్యర్థుల భావజాలం, అవినీతి, ప్రభుత్వ విధానాల వంటివాటిపై పారీ్టల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగేవి. కానీ ఇప్పుడు నేతల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. మాటలు హద్దులు దాటుతున్నాయి. ఎన్నికల బరిలో దిగుతున్న మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే పెడ ధోరణి పెరిగిపోతోంది. వారిని కించపరచడం, లింగవివక్షతో కూడిన వెకిలి కామెంట్లు చేయడం పరిపాటిగా మారుతోంది. చివరికి మహిళా నేతలు ప్రత్యర్థి పార్టీల్లోని సాటి మహిళలపై నోరు పారేసుకోవడానికి వెనకాడటం లేదు! బీజేపీ లోక్‌సభ అభ్యరి్థ, సినీ నటి కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యలు అందుకు నిదర ్శనమే. నారీ శక్తి అంటూ పార్టీలు ఇస్తున్న నినాదాలు మాటలకే పరిమితమవుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది... ‘మండీలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోందో!’ – ఇది కంగనాపై కాంగ్రెస్ ఐటీ విభాగం చీఫ్ సుప్రియ మూడు రోజుల కింద ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన పోస్టు. కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలమైన మండి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. మండి అంటే బజారు అన్న అర్థాన్ని సాకుగా తీసుకుని, కంగనా ఫొటో పెట్టి మరీ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై దుమారం రేగింది. బీజేపీ వెంటనే దీన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్ అంటేనే సంస్కారరాహిత్యానికి మారుపేరంటూ మండిపడింది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ మొదలుకుని పలువురు నేతలు చేసిన ఇలాంటి కామెంట్లన్నింటినీ ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోసింది. దాంతో ఆ పోస్టుతో తనకు సంబంధం లేదని, ఎవరో తన ఇన్‌స్టా అకౌంట్‌ను హాక్ చేసి ఈ పని చేశారని సుప్రియ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ‘‘ఓ యువకునికి టికెట్ దక్కితే అతని భావజాలంపై దాడి! అదే ఒక యువతి ఎన్నికల బరిలో దిగితే లింగవివక్షతో కూడిన ఇలాంటి వ్యాఖ్యలు! ఈ నీచమైన పోకడకు ఇకనైనా తెర పడాలి. సెక్స్ వర్కర్ల జీవితాలు ఎంతో దుర్భరం. వాటినిలా మహిళలపై బురదజల్లేందుకు సరుకుగా వాడుకోవడం సరికాదు’’ అంటూ కంగనా హుందాగా ఇచ్చిన రిప్లై అందరి మనసులూ గెలుచుకుంది. భారత్‌లో ఎన్నికల వేళ మహిళా నేతలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల వేడి మొదలవుతూనే ఈ తరహా దూషణ పర్వం ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాహుల్ కూడా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మోదీ సర్కారు కేవలం వీఐపీలనే పిలిచిందంటూ తప్పుబట్టే క్రమంలో నటి ఐశ్వర్యారాయ్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ కార్యక్రమాన్ని మీరంతా చూశారు కూదా! ఐశ్వర్య, అమితాబ్, మోదీ... ఇలాంటివాళ్లే ఉన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య డ్యాన్సులు చేసింది. కానీ అక్కడ ఓబీసీలు, ఇతర సామాన్యులు ఒక్కరన్నా కన్పించారా?’’ అన్న రాహుల్ కామెంట్లపై తీవ్ర విమర్శలే వచ్చాయి. వాటిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఇలాంటి వ్యాఖ్యల బాధితురాలే. అమేథీ నియోజకవర్గానికి ఆమె కేవలం అప్పుడప్పుడూ వచ్చి తన హావభావాలతో జనాన్ని ఆకర్షించి వెళ్లిపోతారంటూ కాంగ్రెస్ నేత అజయ్‌రాయ్ ఇటీవల నోరుపారేసుకున్నారు. బీజేపీ నేతలు కూడా... మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యల విషయంలో అధికార బీజేపీ నాయకులూ ఏమీ తక్కువ తినలేదు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా మంటలు రేపాయి. ‘‘మమత గోవాకు వెళ్తే తాను గోవా కూతురినంటారు. త్రిపురకు వెళ్తే త్రిపుర బిడ్డనని చెప్పుకుంటారు. ముందుగా మమత తన తండ్రెవరో గుర్తించాలి’’ అంటూ తీవ్ర అభ్యంతకరకర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రియా, ఘోష్ ఇద్దరికీ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తలంటింది. వారి వ్యాఖ్యలకు వివరణ కోరుతూ తాఖీదులిచ్చింది. ఘోష్‌కు బీజేపీ అధినాయకత్వం కూడా షోకాజ్ నోటీసిచ్చింది. అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. 2021 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ మమత కాలికి గాయమైంది. దాంతో కొంతకాలం వీల్‌చైర్‌లోనే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తృణమూల్‌తో హోరాహోరీ తలపడ్డ బీజేపీ ఇదంతా సానుభూతి స్టంటేనంటూ ఎద్దేవా చేసింది. ఆ క్రమంలో, ‘బెర్ముడాలు (నిక్కర్లు) వేసుకుంటే సౌలభ్యంగా ఉంటుంది’ అంటూ అప్పట్లో మమతపై ఘోష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక కేరళలో బీజేపీ నేత, సినీ నటుడు సురేశ్ గోపీ ప్రెస్‌మీట్ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టును పదేపదే అభ్యంతరకరంగా తాకడమూ వివాదం రేపింది. ఆమె ఒకటికి రెండుసార్లు ఆయన చేయిని అడ్డుకుంటూ నెట్టేసినా అలాగే వ్యవహరించారు. దీనిపై గొడవ పెద్దదవడంతో తప్పనిసరైన క్షమాపణలు చెప్పినా, పితృవాత్సల్యంతో అలా చేశానంటూ సమర్థించుకున్నారు. చిర్రెత్తుకొచ్చిన సదరు జర్నలిస్టు ఆయనపై కేసు పెట్టేదాకా వెళ్లింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్ర నేత కైలాశ్ విజయవర్గీయ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు. అభ్యంతరకర దుస్తులు ధరించే మహిళలు శూర్పణఖల్లా కనిపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, ‘‘దేవుడు మీకు అందమైన శరీరమిచ్చాడు. మంచి బట్టలేసుకోవచ్చుగా’’ అన్నారు. వీటిని సుప్రియా శ్రీనేత్ అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టడం, మహిళలంటే బీజేపీకి గౌరవం లేదంటూ దుయ్యబట్టడం విశేషం! రాజకీయాలు అర్థం కాకుంటే ఇంటికెళ్లు వంట చేసుకొమ్మంటూ ఎన్సీపీ నేత సుప్రియా సులేను ఉద్దేశించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలు కూడా అప్పట్లో మంటలు రేపాయి. ఆందోళనకరమే.. మన దేశంలో ఎన్నికల వేళ మహిళా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పరిశోధన తేలి్చంది. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లోనైతే వారిపై వ్యక్తిగత విమర్శలు అనూహ్య స్థాయిలో పెరిగిపోయాయి. 95 మంది మహిళా నేతలకు వచ్చిన 1.14 లక్షల ట్వీట్లను పరిశీలిస్తే 14 శాతం దాకా లింగవివక్షతో కూడిన అభ్యంతరకర విమర్శలే. అంటే ఒక్కొక్కరికీ రోజుకు సగటున ఇలాంటి 113 ట్వీట్లొచ్చాయి!’’ అని పేర్కొంది. బీజేపీ తరఫున యూపీలో రాంపూర్ నుంచి పోటీ చేసిన జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ ‘ఖాకీ లో దుస్తులు’ వ్యాఖ్యలు, ప్రియాంకా గాంధీ ‘పప్పూ కీ పప్పీ’ అంటూ బీజేపీ నేతల ఎద్దేవా, సినీ నటి హేమమాలిని ఓట్ల కోసం డ్యాన్సులు చేస్తారంటూ ప్రత్యర్థుల విమర్శలు... ఇలా 2019 ఎన్నికల్లో వివాదాలకు దారితీసిన ఉదంతాలెన్నో! ఇలా మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పూనుకునే ధోరణి మన దేశ రాజకీయాల్లో నేటికీ పెద్ద సవాలుగానే ఉందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా మన సమాజపు పురుషాహంకార వైఖరికి ఇది అద్దం పడుతోందని వారంటున్నారు. నిజానికి పోలింగ్ బూత్‌లకు వచ్చేందుకు పురుషుల నిరాసక్తత నేపథ్యంలో భారత్‌లో కొన్నేళ్లుగా ఏ ఎన్నికల్లోనైనా మహిళల ఓట్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో నాయకురాళ్లను కించపరిస్తే మహిళల ఓట్లకు గండి పడవచ్చని తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటం ఆందోళనకర పరిణామమేనంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కంగనా, మమతపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే, బీజేపీ నేత దిలీప్ ఘోష్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు చేపట్టింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల కోడ్)ని ఉల్లంఘించినట్లు ఈసీ తెలిపింది. మార్చి 29 సాయంత్రం 5 గంటల వరకు సుప్రియా శ్రీనాథే, దిలీప్‌ఘోష్ తమ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. కాగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి కంగనా రనౌత్‌ను బీజేపీ ఎన్నికల బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ సుప్రియా శ్రీనాథే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి. అనంతరం ఆమె ట్వీట్‌కు కంగనా ధీటుగా బదులిచ్చారు. అయితే ఆ పోస్టు తాను చేయలేదని, తన సోషల్ మీడియా అకౌంట్ యాక్సెస్ కలిగిన ఎవరో చేసి ఉంటారని సుప్రియా తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా మహిళా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. బర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ స్థానం నుంచి లోక్‌సభ బరిలో నిలిచచిన దిలీప్ ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని ఎగతాళి చేశారు. రాష్ట్ర కుమార్తెగా చెప్పుకుంటున్న మమతా..ముందుగా తన తండ్రి ఎవరో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మహిళల గౌరవాన్ని తగ్గిస్తూ.. అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఇరు నేతలకు ఈసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. చదవండి: సీఎం పినరయ్ విజయన్ కుమార్తెపై మనీ లాండరింగ్ కేసు -
శరీర భాగాలు కాదు చూడాల్సింది.. వేశ్యతో సహా..!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మాటలతో బాలీవుడ్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమెకు బీజేపీ ఎంపీ సీటును కేటాయించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో కంగనాపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా యూపీకి చెందిన కాంగ్రెస్ మహిళానేత సుప్రియ శ్రీనాథే విమర్శలు చేసింది. గతంలో కంగనా సినిమాల్లో బోల్డ్‌గా నటించిన ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా ఇలాంటి ఫోటోలతో హిమాచల్ ప్రదేశ్ మండి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన కంగనా తనదైన శైలిలో కాస్తా ఘూటుగానే రిప్లై ఇచ్చిపడేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. కంగనా తన ట్వీట్లో రాస్తూ.. 'ప్రియమైన సుప్రియా జీ.. ఒక ఆర్టిస్ట్‌గా నా కెరీర్లో గత 20 ఏళ్లలో అన్ని రకాల మహిళా పాత్రలు పోషించా. నేను క్వీన్ చిత్రంలోని అమాయక అమ్మాయి నుంచి ధకడ్ సినిమాలో గూఢచారిగా, మణికర్ణికలో దేవతగా, అలాగే చంద్రముఖిలో దెయ్యంలా, రజ్జో చిత్రంలో వేశ్యగా.. అలాగే తలైవిలో విప్లవ నాయకురాలిగా నటించా. మన ఆడబిడ్డలను పక్షపాతమనే సంకెళ్ల నుంచి మనం విడిపించాలి. వారి శరీర భాగాల పట్ల ఉత్సుకత కంటే.. వాళ్లు ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అన్నింటికీ మించి వారి జీవితాలను, పరిస్థితుల కారణంగా సెక్స్ వర్కర్లుగా మారిన వారిని ఏదో ఒక రకంగా దూషించడం మానుకోవాలి. ప్రతి స్త్రీ తన గౌరవానికి అర్హురాలని మనం గ్రహించాలి.' అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కంగనాకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. చాలా బాగా బుద్ధి చెప్పావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో సుప్రియ శ్రీనాథే ఆ పోస్ట్‌ను తన ఇన్‌స్టా నుంచి తొలగించింది. కానీ కొద్ది సేపటికే ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం కంగనా ఎమర్జన్సీ అనే చిత్రంలో నటిస్తోంది. ఎన్నికల తర్వాత జూన్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. Dear Supriya ji In the last 20 years of my career as an artist I have played all kinds of women. From a naive girl in Queen to a seductive spy in Dhaakad, from a goddess in Manikarnika to a demon in Chandramukhi, from a prostitute in Rajjo to a revolutionary leader in Thalaivii.… pic.twitter.com/GJbhJTQAzW — Kangana Ranaut (@KanganaTeam) March 25, 2024 -
రాజ్యసభ అభ్యర్థిగా సుప్రియా శ్రీనేత్?
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏఐసీసీ సోషల్ మీడియా చైర్మన్ సుప్రియా శ్రీనేత్‌కు అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కే చాన్స్ ఉన్న నేపథ్యంలో ఒకటి ఏఐసీసీ నుంచి మరోటి తెలంగాణ నుంచి భర్తీ చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ జర్నలిస్టు సుప్రియా శ్రీనేత్ పేరును పరిశీలిస్తున్నారని గాందీభవన్ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ లేదంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాందీలను తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయించాలని, లేదంటే రాజ్యసభకు పంపాలని కోరుతూ టీపీసీసీ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి అభ్యర్థిత్వాలు కాని పక్షంలో శ్రీనేత్తో పాటు కేంద్ర మాజీ మంత్రులుగా పనిచేసిన ఇద్దరి నేతల పేర్లు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక రాష్ట్రానికి చెందిన ఒకరిని ఈమారు రాజ్యసభకు పంపనున్నారు. చాలాకాలం తర్వాత రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభిస్తుండటంతో పలువురు నేతలు రేసులో ఉన్నారు. అయితే, ఈసారి తెలంగాణ నుంచి బీసీ నేతను రాజ్యసభకు పంపుతారనే చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వస్తే జానారెడ్డి, రేణుకా చౌదరిల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈనెల 15వ తేదీతో రాజ్యసభ అభ్యర్థిత్వాల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో బుధవారం రాజ్యసభ అభ్యర్థులెవరన్న దానిపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. -
కన్నడ హిట్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్
ప్రజ్వల్ బీపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 21న రిలీజై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ తెలుగులో ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్‌ను ‘బేబీ’ చిత్ర యూనిట్ విడుదల చేసింది. దర్శకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ– ‘‘కన్నడంలో విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులోనూ ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. ‘‘ట్రైలర్ ఫన్ అండ్ ఎనర్జిటిక్‌గా అనిపించి, తెలుగులో విడుదల చేయాలని భావించాం’’ అన్నారు సుప్రియ. ‘‘బాయ్స్ హాస్టల్’ క్రేజీ ఫిల్మ్’’ అన్నారు నిర్మాతలు శరత్, అనురాగ్. -
మోదీ హయాంలో 3 రెట్లు పెరిగిన దేశ అప్పు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తిరోగమన పాలనా విధానాల వల్లే దేశ అప్పు గత 9 ఏళ్ల బీజేపీ పాలనలో మూడు రెట్లు పెరిగిందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదలచేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘మోదీ పాలనలో దేశ అప్పు ఈ 9 ఏళ్లలో మూడు రెట్లు ఎగసి రూ.155 లక్షల కోట్లకు చేరింది. 2014లో ఈ ప్రభుత్వం వచ్చిననాటి నుంచి లెక్కిస్తే అదనంగా రూ.100 లక్షల కోట్ల అప్పు పెరిగింది. గుజరాత్‌కు సీఎంగా ఉన్న కాలంలో మోదీ.. అసమర్థులు, అవినీతిపరులు, సత్తాలేని వాళ్లు అంటూ ఇతర పార్టీల ప్రభుత్వాలను విమర్శించేవారు. వాస్తవానికి ఈ గుణాలు మోదీకే సరిగ్గా సరిపోతాయి. దేశార్థికాన్ని దారుణంగా దెబ్బతీసి నిరుద్యోగం, ధరల్ని పెంచేశారు. గత 67 ఏళ్లలో 14 మంది ప్రధానులు మొత్తంగా రూ.55 లక్షల కోట్లు అప్పు చేస్తే మోదీ ఒక్కరే రూ.100 లక్షల కోట్లు పెంచేశారు. ఆర్థికవ్యవస్థను సరిదిద్దడమంటే జాతీయమీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడం, టెలీప్రాంప్టర్ సాయంతో సుదీర్ఘ ప్రసంగాలు దంచేయడం, వాట్సాప్‌లో సందేశాలు ఫార్వార్డ్ చేయడం లాంటి పనికానే కాదు’ అని అన్నారు. ఆదాయ అంతరాలను ఈ ప్రభుత్వం పెంచేసింది. జనాభాలో కేవలం 10 శాతమున్న సంపన్నుల వద్ద ఏకంగా 80 శాతం సంపద పోగుబడింది. జీఎస్టీ వసూళ్లలో వీరి వాటా మూడు శాతమేనన్నారు. -
బీజేపీ 40 సీట్లుకె పరిమితం
-
భార్యతో టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న.. ఫోటోలు వైరల్
-
అక్కినేని ఫ్యామిలీలో అడివి శేష్.. వైరల్‌గా మారిన ఫోటో
క్రిస్మస్ పండగను సెలబ్రిటీలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఒకచోట చేరి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ఆ ఫోటోలని అఖిల్ అక్కినేని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అక్కినేని ఫ్యామిలీలో కూడా క్రిస్మస్ వేడకలను ఘనంగా నిర్వహించారు. అఖిల్, సుమంత్‌లతో పాటు మరికొంత మంది కజిన్స్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. కానీ నాగచైతన్య మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. ఇక తమ సెలబ్రేషన్స్ ఫోటోలను అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కాసేపట్లోనే ఆ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. హీరో అడివి శేష్ అక్కడ కనిపించడం హాట్‌టిపిక్‌గా నిలిచింది. అక్కినేని ఫ్యామిలీలో శేష్ ఎందుకు ఉన్నాడంటూ పలు రూమర్స్ తెరమీదకి వస్తున్నాయి. ఇక పార్టీలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు 'థ్యాంక్స్ అఖిల్ బ్రో' అంటూ శేష్ కామెంట్ చేయడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
‘హరితహారం’ తరహాలో తమిళనాడులో ‘గ్రీన్‌మిషన్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు హరితహారం తరహాలోనే తమిళనాడు గ్రీన్ మిషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 33% పచ్చదనం సాధించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర అదనపు ప్రభుత్వ కార్యదర్శి సుప్రియా సాహు తెలిపారు. ‘హరితహారం’కార్యక్రమం అధ్యయనానికి సుప్రియా సాహు నేతృత్వంలో తమిళనాడు అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఇందులోభాగంగా శనివారం అరణ్యభవన్‌లో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ ఎ.శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. హరితహారం అమలు, ఫలితాలపై పీసీసీఎఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హరితహారం కార్యక్రమాన్ని ఎనిమిదేళ్లుగా అమలు చేస్తూ తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించిందని సాహు కొనియాడారు. నర్సరీల నిర్వహణతో పాటు, పచ్చదనం పెంచిన తీరు బాగుందని, అవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఔటర్ వెంట పచ్చదనం తీర్చిదిద్దిన విధానం బాగుందని అభినందించారు. పర్యటనలో సాహు తీసిన ఫోటోలు, వీడియోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సాçహు వెంట తమిళనాడు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి ఆనంద్ ఉన్నారు. క్షేత్ర పర్యటనలో చీఫ్ కన్జర్వేటర్ (సోషల్ ఫారెస్ట్రీ) రామలింగం, రంగారెడ్డి, మేడ్చల్ డీఎఫ్ఓలు జాదవ్ రాహుల్ కిషన్, జానకి రాములు పాల్గొన్నారు. -
UP Election: బరేలీలో కాంగ్రెస్ టిక్కెట్ తీసుకొని ఎస్పీలోకి..
లక్నో: బరేలీ కంటోన్మెంట్ సీటుకు సుప్రియా అరోన్ కాంగ్రెస్ నాలుగైదు రోజుల కిందటే ప్రకటించింది. నామినేషన్‌కు సిద్ధమవుతుందని భావిస్తుండగా.. ఆమె అనూహ్యంగా ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్‌కు షాకిచ్చారు. శనివారం సమాజ్‌వాదీ పార్టీలో చేరిపోయారు. అదే స్థానం నుంచి ఎస్పీ టిక్కెట్‌పై పోటీచేయనున్నారు. జర్నలిస్టు నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన సుప్రియా ఆరోన్ బరేలీ మేయర్‌గా పనిచేశారు. ఆమె ఎస్పీలో చేరడంతో బరేలీ నుంచి రాజేశ్ అగర్వాల్ అభ్యర్థిత్వాన్ని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉపసంహరించారు. -
కొన్ని కథలు ఓటీటీలోనే చెప్పాలి: నిర్మాత సుప్రియ
‘‘సినిమా కథలకు, ఓటీటీ కథలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కొన్ని కథలు ఓటీటీలోనే చెప్పాలి’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. ప్రియదర్శి, ధన్యా బాలకృష్ణన్, కల్పికా గణేశ్, షాయాజీ షిండే, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘లూజర్ 2’. అభిలాష్ రెడ్డి, శ్రవణ్ మాదాల దర్శకులు. అభిలాష్ రెడ్డి క్రియేటర్, అన్నపూర్ణ స్టూడియోస్, స్పెక్ట్రమ్ మీడియా నెట్‌వర్క్స్‌పై సుప్రియ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో నేటి నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సుప్రియ మాట్లాడుతూ– ‘‘అన్నపూర్ణ స్టూడియోస్ స్కూల్ విద్యార్థులే ‘లూజర్ 2’కి పని చేశారు.. అందుకే వారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి కథ బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘లూజర్ 2’కి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అభిలాష్ రెడ్డి. పావని, కల్పిక, గాయత్రి, ప్రియదర్శి, శశాంక్ పాల్గొన్నారు. -
సుప్రియా లైఫ్‌సైన్స్ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: ఫార్మా రంగ ఆర్అండ్డీ కార్యకలాపాలతోపాటు.. ఏపీఐలను రూపొందిస్తున్న కంపెనీ సుప్రియా లైఫ్‌సైన్స్ ఐపీవో విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు సోమవారానికల్లా 71 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.45 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. దాదాపు 104 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం సంపన్న వర్గాల విభాగంలో 161 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 56 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. ఇక అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలోనూ 32 రెట్లు స్పందన కనిపించింది. షేరుకి రూ. 265–274 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 700 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని వాటాదారులు, ప్రమోటర్లు ఆఫర్ చేయడంతోపాటు, మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ తాజాగా జారీ చేయనుంది. గత బుధవారం(15న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా కంపెనీ రూ. 315 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. తాజా ఈక్విటీ నిధులను పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. -
బీఫార్మసీ విద్యార్థిని సుప్రియ ఆత్మహత్య
సాక్షి, చేవెళ్ల: సెల్ఫోన్లో ఎక్కువగా మాట్లాడవద్దంటూ తల్లి మందలించినందుకు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన టి.శివశంకర్, పుష్పలత దంపతుల కూతురు సుప్రియ (18) మొయినాబాద్ మండలంలోని గ్లోబల్ కళాశాలలో బీఫార్మసీ చదువుతోంది. ఇటీవల సుప్రియ ఎక్కువగా సెల్ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించిన తల్లి పుష్ప లత బుధవారం ఉదయం కూతురును మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సుప్రి య.. బెడ్రూమ్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూతురు బెడ్రూమ్లో నుంచి ఎంతకూ రాకపోవటంతో అనుమానం వచ్చి లోపలికివెళ్లి చూడగా ఉరివేసుకొని కనిపించింది. తల్లి కేకలు వేయడంతో పక్కనున్నవారు వచ్చి చూడగా అప్పటికే సుప్రియ మృతిచెందింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి పుష్పలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (సూరీడుపై హత్యాయత్నం) -
ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం: సుప్రియ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన ఇమేజ్ను పెంచుకునే మరో ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేశారంటూ కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాతే విమర్శించారు. భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండటానికి కారణం యువత సంఖ్య అధికంగా ఉండటమే కారణమని, కానీ ఆ క్రెడిట్‌ను ప్రధాని తన ఖాతాలో వేసుకున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ప్రధాని మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, పండుగల సీజన్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి కరోనా నిరోధక వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. అదే విధంగా కరోనా ప్రభావిత దేశాలైన అమెరికా, బ్రెజిల్ మరణాల రేటు అధికంగా ఉందని, భారత్‌లో మాత్రం తక్కువగా ఉందని పేర్కొన్నారు. అయితే సామాజిక దూరం, మాస్కు ధరించడం వంటి కోవిడ్ నిబంధనలు పాటించకుండా, నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకుంటామని హెచ్చరించారు. (చదవండి: పండగ సీజన్లో అప్రమత్తత అనివార్యం : మోదీ) ఇక ప్రధాని ప్రసంగంపై స్పందించిన సుప్రియ.. ‘‘మరో ఈవెంట్ ముగిసింది. ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం. బిహార్ ఎన్నికలకు ముందుగానే ఇదంతా. సరైన చర్యలు లేవు. వైఫల్యాలను అంగీకరించనూ లేదు. యువత ఎక్కువగా ఉన్న దేశంలో మరణాల రేటు తక్కువగా ఉందన్న క్రెడిట్ తీసుకున్నారు. మీడియా ప్రశ్నలు అడగకుండా మిషన్ పూర్తి చేసింది’’అంటూ ట్వీటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాగా ఈనెల 28న బిహార్‌లో తొలి విడత పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచార హోరు పెంచిన పార్టీలు పరస్పర విమర్శలతో దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ , ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ మాటల యుద్ధానికి దిగుతోంది. ఇక కోవిడ్ కట్టడిలో పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ వంటి దేశాలు భారత్ కంటే ఉత్తమంగా పని చేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.(చదవండి: కోవిడ్ కట్టడిలో పాక్ బెటర్: రాహుల్) -One more event over -Image building key -Had to do TV before Bihar polls -No concrete measures -No admission of failure -Taking credit for low mortality, which is due to young population. -Media going gaga instead of asking questions Mission accomplished @narendramodi ji — Supriya Shrinate (@SupriyaShrinate) October 20, 2020 -
ఆ ఇద్దరు... దయ చూపిన స్త్రీలు
ఒక స్త్రీ యజమాని. మరో స్త్రీ ఆమె వద్ద పని చేసే చిన్న ఉద్యోగి. ఉద్యోగి ఒక సాయంత్రం ఒక అంధునికి సాయం చేసింది. అది యజమాని దృష్టికి వచ్చింది. దయ గల స్త్రీ తన వద్ద ఉద్యోగం చేస్తున్నందుకు సంతోషపడి తనూ ఆమెపై దయ చూపింది. ఆ ఉద్యోగికి కొత్త ఇల్లు బహూకరించింది. కేరళలో జాలీ అలుకాస్, ఆమె ఉద్యోగి సుప్రియల కథ ఇప్పుడు దేశం మెచ్చుతున్న కథ. జూలై 7, 2020 సుప్రియ జీవితాన్ని మార్చేసిన రోజు. ఆ రోజు తన జీవితాన్ని మారుస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. చిన్న ఉద్యోగి ఆమె. అలెప్పి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరువెల్లా పట్టణంలోని ‘జాలీ సిల్క్స్’లో ఆమె సేల్స్ ఉమన్. సాయంత్రం ఆరున్నరకు డ్యూటీ దిగి బస్స్టాప్వైపు నడుస్తోంది ఇల్లు చేరడానికి. అక్కడే ఒక అంధుడు రోడ్డు మీద నడవడానికి అవస్థ పడుతున్నాడు. ఆమె అతణ్ణి చూసింది. ‘ఎక్కడకు వెళ్లాలి’ అని అడిగింది. తాను టౌన్ బస్ ఎక్కాలని, మంజాది అనే ప్రాంతానికి వెళ్లాలని ఆ అంధుడు చెప్పాడు. అప్పుడే ఒక ఆర్టిసి టౌన్ బస్సు వారిని దాటుకుంటూ వెళుతోంది. అది అంధుడు వెళ్లాల్సిన ప్రాంతానికి చెందిన బస్సే. సుప్రియ అది గమనించింది. వెంటనే బస్సు వెనుక పరుగు తీసింది. ఆమెను గమనించిన బస్సు డ్రైవరు, కండెక్టరు బస్సును ఆపారు. ‘ఒక అంధుడు బస్సెక్కాలి. ఉండండి’ అని చెప్పి వెనక్కు పరిగెత్తి అంధుడి చేయి పట్టుకుని బస్సు దాకా తీసుకొని వచ్చింది. ఆ తర్వాత బస్సు ఎక్కించి వెళ్లిపోయింది. ఇది ఏ మనిషైనా చేసే కనీస పని అని అంతటితో ఆ సంగతి మర్చిపోయింది.మారిన కథ అయితే ఈ దయామయ ఘటనను ప్రకృతి రికార్డు చేయదలిచింది. అదే రోడ్డులో ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో పని చేస్తున్న జాషువా అనే సేల్స్‌మేన్ ఐదో ఫ్లోర్ నుంచి కాలక్షేపానికి రోడ్డు వైపు చూస్తూ ఈ సన్నివేశం కనపడటంతో సెల్ఫోన్లో రికార్డు చేశాడు. సుప్రియ చేసింది చాలా మంచి పని అని అతనికి అనిపించింది. ఫ్రెండ్‌కు పంపాడు. ఆ ఫ్రెండ్ నుంచి మెల్లగా అది సోషల్ మీడియాకు ఎక్కింది. సాయంత్రం ఆరున్నరకు ఘటన జరిగితే రాత్రి 10.30కు ఇది దేశమంతా వైరల్ అయ్యింది. ఇవన్నీ తెలియని సుప్రియ ఇంట్లో ఉంటే ఫ్రెండ్స్ ఫోన్ చేసి ‘నువ్వే కదా’ అనడం మొదలెట్టారు. రాత్రికి రాత్రి సుప్రియ ఆ ప్రాంతంలో స్టార్ అయిపోయింది. యజమాని స్పందించింది సుప్రియ పని చేస్తున్నది దేశంలో బంగారు వ్యాపారాల దిగ్గజమైన జాయ్ అలుకాస్ సతీమణి జాలీ అలూకాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘జాలీ సిల్క్స్’లో. సుప్రియ చేసిన మంచి పని ఆ నోటా ఈ నోటా ఈ భార్యాభర్తలకు చేరింది. తమ ఉద్యోగిలోని దయాగుణం వారికి నచ్చింది. జాలీ అలూకాస్ పూనికతో జాయ్ అలూకాస్ సుకన్యను అభినందించడానికి ఏకంగా ఆమె ఇంటికి వెళ్లాడు. సుకన్య భర్త అనూప్ చిన్న ఉద్యోగి. ఇద్దరూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారిని అభినందించిన జాయ్ అలూకాస్ ‘త్రిసూర్‌లో ఉన్న హెడ్ ఆఫీస్‌కు వచ్చి కలవండి’ అని చెప్పి వెళ్లిపోయారు. ఊహించని బహుమతి జాయ్ అలూకాస్ చెప్పిన రోజున సుకన్య తన భర్తతో త్రిసూర్ వెళ్లింది. ఆమె హెడ్డాఫీసులో అడుగుపెట్టిన వెంటనే వందలాది మంది ఉద్యోగులు హర్షధ్వానాలతో ఆమెను అభినందించారు. జాలీ అలూకాస్ తన భర్త జాయ్ అలూకాస్తో వచ్చి సుప్రియను అభినందించారు. సుప్రియ తబ్బిబ్బయ్యింది. దంపతులిద్దరూ ఆమెకు కొత్త ఇంటి తాళాలు బహూకరించారు. సుప్రియ నివ్వెరపోయింది. ‘నేను చేసింది మామూలు పనే’ అందామె. అప్పుడు జాలీ అలూకాస్ ‘కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి చాలా మంచి పనులు చేసి ఉంటావు. వాటన్నింటి ఫలితమే ఇది. ప్రపంచంలో మంచితనానికి కొదవ ఉండకూడదు. మంచితనం వ్యాపిస్తూనే ఉండాలి’ అని çసుప్రియను అభినందించింది. ఈ అందమైన ఘటన ఎందరికో నచ్చుతోంది. స్ఫూర్తినిస్తోంది. రొటీన్లో పడి తమను తాము మర్చిపోయినవారు తమలోని మంచితనాన్ని వెతుక్కునేలా చేస్తోంది. – సాక్షి ఫ్యామిలీ -
హలో.. కంట్రోల్ రూమ్
నాలుగ్గోడలు లేని ‘లాక్డౌన్’.. వలస కూలీలది! సొంత ఊళ్లకు మైళ్ల దూరంలో.. భాష రాక ఉక్కిరిబిక్కిరౌతున్న బతుకు శ్వాస వాళ్లది. ఆకలౌతోందని.. అనారోగ్యంగా ఉందని.. ఉండటానికి ఇంత చోటు కావాలని.. ఎవర్ని అడగాలి? ఏ భాషలో అడగాలి?! ‘కంట్రోల్ రూమ్’కి సుప్రియ రాక ముందు వరకు.. ఎర్నాకుళంలోని వలసలకూ భాష సమస్య ఉండేది. ఆమెకు ఏడు భాషలు రావడంతో.. వాళ్ల చెవుల్లో తేనె పోసినట్లుగా ఉంటోంది. కేరళలో పద్నాలుగు జిల్లాలు ఉన్నాయి. దేశంలో లాక్డౌన్ మొదలయ్యాక ఆ పద్నాలుగు జిల్లాల కలెక్టర్ కార్యాలయాలలో పద్నాలుగు ‘కోవిడ్ కంట్రోల్ రూమ్’లను ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కూడా గత రెండు వారాలుగా కేరళలో ఉన్న వలస కార్మికుల కోసం నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఫోన్ చేసి ఎవరైనా ‘ఆకలౌతోంది’ అంటే ఫలానా చోట భోజనం దొరుకుతుంది వెళ్లండి’ అని చెబుతున్నాయి. ‘ఉండటానికి చోటెక్కడైనా ఉందా?’ అని అడిగితే.. ఫలానా ప్రాంతంలో షెల్టర్లు ఉన్నాయి వెళ్లండి’ అని అడ్రెస్ ఇస్తున్నాయి. ‘‘మా ఊరికి ఎప్పట్నుంచి బస్సులు తిరుగుతాయి?’ అని కొందరు అడుగుతుంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొందరు ఫోన్ చేసి, ‘కేరళలో మా వాళ్లు ఎలా ఉన్నారో కనుక్కుని చెబుతారా?’ అని పలకని ఫోన్ నెంబర్లను ఇస్తుంటారు. కష్టంలో ఉన్న వాళ్లు ఎలాంటి ప్రశ్నలైనా వేస్తారు. కష్టం తీర్చడానికి ఉన్నవాళ్లు ఓర్పుగా సమాధానాలు ఇవ్వాలి. సుప్రియకు ఓర్పుతో పాటు, ఏడు భాషలలో ప్రశ్నలను అర్థం చేసుకుని ఏడు భాషలలో అవసరమైన సమాచారాన్ని ఇవ్వగల నేర్పు ఉంది. అలాగని ఆమేమీ బహుభాషా ప్రవీణురాలు, కోవిదురాలు కాదు. జీవనోపాధి కోసం స్వరాష్ట్రమైన ఒడిశా నుంచి కేరళకు వచ్చాక పరభాషలను నేర్చుకోవాలన్న ఉత్సాహంతో.. కేవలం ఉత్సాహంతో.. మలయాళం, హిందీ, బెంగాలీ, అస్సామీ, బంగ్లా భాషలను నెట్లో నేర్చుకున్నారు. ఒడియా ఎలాగూ మాతృభాష. ఇంటర్ వరకు చదువుకుంది కాబట్టి ఇంగ్లీష్ కూడా వచ్చు. అన్ని భాషల్లోనూ రాయలేరు కానీ.. చక్కగా మాట్లాడగలరు. అర్థం చేసుకోగలరు. అన్నీ భాషల్లోనూ ఆమెకు ఫ్రెండ్స్ ఉన్నారు. అదొకటి కూడా సుప్రియకు ఉపయోగపడింది. ఎర్నాకుళం కలెక్టరేట్లోని కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో ‘మైగ్రెంట్ లింక్ వర్కర్’గా సుప్రియకు రోజుకు 200 వరకు కాల్స్ వస్తుంటాయి. వాళ్ల భాషలో విని, వాళ్ల భాషలో సమాధానం చెప్పగానే వాళ్లు వ్యక్తం చేసే సంతోషానికి అవధులే ఉండటం లేదు. ‘‘కొందరైతే.. నాతో మాట్లాడుతుంటే వాళ్ల ఊళ్లో ఉన్నట్లుగా అనిపిస్తోంది’’ అని పూడుకు పోయిన గొంతుతో కృతజ్ఞతగా అంటుంటారు. వాళ్లు అలా అన్నప్పుడు.. తాత్కాలికంగానే అయినా తగిన ఉద్యోగంలోకే వచ్చానని అనిపిస్తుంటుంది నాకు’’ అంటారు సుప్రియ. వలస కూలీలను కేరళ ప్రభుత్వం ‘వలస అతిథులు’ అంటుం ది. సుప్రియ కూడా అతిథులను ఆహ్వానించినట్లే వాళ్ల ఫోన్ కాల్స్‌ని రిసీవ్ చేసుకుంటున్నారు. సుప్రియతోపాటు ఆ సెంటర్లో మరో 11 మంది ‘మైగ్రెంట్ లింక్ వర్కర్’లు పని చేస్తున్నారు. సుప్రియ ‘రోష్ని’లో వాలంటీర్ కూడా. వలస కార్మికుల పిల్లలకు విద్యను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ పథకమది. ఇంకా.. మలయిదోంతురుత్లోని ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్‌గా కూడా పని చేస్తున్నారు సుప్రియ. ‘సర్వశిక్ష అభయాన్ ప్రాజెక్ట్’ కింద ఆమెకు ఆ ఉద్యోగం వచ్చింది. ఆమె ఉండటం ఎర్నాకుళంలోనే.. పుక్కట్టుపాడి లో. సుప్రియ పూర్తి పేరు సుప్రియా దేవ్నాథ్. ఐదేళ్ల క్రితం భర్తతోపాటు కేరళ వచ్చేశారు. ఆయన పేరు ప్రశాంతకుమార్ సామల్. పెరంబవూర్లోని ప్లయ్ ఉడ్ కంపెనీలో ఉద్యోగం. కూతురు శుభస్మిత.. తల్లి టీచర్‌గా ఉన్న బడిలోనే ప్రి–నర్సరీలో ఉంది. సుప్రియ తన చదువును ఇంటర్‌తోనే ఆపేయాలని అనుకోవడం లేదు. పెరంబువూర్ కాలేజ్‌లో బి.ఎ. హిందీలో చేరబోతున్నారు. అందుకు అవసరమైన సర్టిఫికెట్లు కొన్ని ఒడిశాలోనే ఉండిపోయాయి. ఈ వేసవి సెలవుల్లో వాటిని తెచ్చుకోవాలని అనుకుంటుండగానే.. ఇదిగో, ఈ లాక్డౌన్! ‘‘ఇంట్లోనే ఉండిపోవడం కష్టమే. అసలు ఇల్లే లేకపోవడం ఇంకా పెద్ద కష్టం అంటారు’’ సుప్రియా.. ‘వలస అతిథుల్ని’ గుర్తుకు తెచ్చుకుని. l -
టార్చిలైట్లు వేసినంత మాత్రాన..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకు మోదీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కోవిడ్ కట్టడికి తగినన్ని పరీక్షలు నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు. చప్పట్లు కొట్టమని, టార్చిలైట్లు వెలిగించమని ప్రధాని పిలుపునివ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘కోవిడ్-19 వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారత్‌లో తగినన్ని పరీక్షలు చేయడం లేదు. ప్రజలను చప్పట్లు కొట్టమని, టార్చిలైట్లు వేయమని పిలుపునిస్తున్నారు. టార్చిలైట్లు వేసి ఆకాశంలోకి చూపించినంత మాత్రాన పరిష్కారం లభించద’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. (ఆ లైట్లు ఆర్పకండి: కేంద్రం క్లారిటీ) కరోనాపై పోరాటంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అండదండలు అందించాలని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటె డిమాండ్ చేశారు. మరింత ఆర్థిక సాయం, వనరులు అందించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనాపై పోరుకు వ్యూహాలు రచించేటప్పుడు రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పోరాడితే విజయం సులభమవుతుందన్నారు. రూ.42 వేల కోట్ల జీఎస్టీ బకాయిలను వెంటను విడుదల చేసి, కరోనాపై పోరుకు రాష్ట్రాలకు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలని అన్నారు. (కొవ్వొత్తుల తర్వాత రంగోలి పోటీలా!?) -
తెలుగు సినిమాకి దక్కిన గౌరవం : విష్ణు
తెలుగు సినీ పరిశ్రమ మరో మైలురాయిని అధిగమించింది. అమెరికాలోని న్యూజెర్సీలో షూటింగ్‌లు జరుపుకొనేందుకు తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కి ఆ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఫలితంగా ఇకపై న్యూజెర్సీలో చిత్రీకరణ జరుపుకొనే సినిమాలకు ఆ ప్రభుత్వం సినీ సాంకేతికత సాయం, ఫిల్మ్ కోర్సుల అధ్యయనానికి తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేక రాయితీలను కల్పిస్తుంది. షూటింగ్‌లపై రాయితీలు కల్పించడం వల్ల అక్కడ షూటింగ్ జరుపుకునే సినిమాల సంఖ్య పెరుగుతుంది. ‘‘దీనివల్ల రెండు ప్రాంతాల మధ్య పర్యాటక, సాంస్కృతిక సంబంధాలు బలపడతాయి. నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు, సినిమాలంటే చాలా ఇష్టం. స్కూల్ రోజుల్లో అనేక నాటకాల్లో పాల్గొన్నాను’’ అని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అన్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ – ‘‘న్యూజెర్సీ ప్రభుత్వం తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్‌తో ఒప్పందం చేసుకోవడం తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ప్రపంచంలో చాలా దేశాలున్నాయి. మన దేశంలో పదుల సంఖ్యలో సినీ పరిశ్రమలు ఉన్నా.. న్యూజెర్సీ వాళ్లు మనతోనే ఒప్పందానికి రావడం తెలుగు సినిమాకు దక్కిన గుర్తింపు. ఇది తెలుగువారంతా గర్వపడాల్సిన విషయం. ఉమ్మడి ఏపీకి చెన్నారెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చేందుకు ఆయన ఎన్ని రాయితీలు కల్పించారో మనందరికీ తెలుసు. స్టూడియోలకు భూములివ్వడం, రాయితీలు కల్పించడం తదితర ప్యాకేజీల వల్ల తెలుగు పరిశ్రమ ఈ స్థాయికి చేరింది. ఇప్పుడు తిరిగి అలాంటి అవకాశం న్యూజెర్సీ ప్రభుత్వం కల్పించడం మరో చారిత్రక అడుగు. సదుపాయాలు అందరూ ఇస్తారు.. కానీ ప్రోత్సాహకాలు కొందరే ఇస్తారు. అలాంటి చొరవ ఉంటే పరిశ్రమ వృద్ధి చెందుతుంది’’ అన్నారు. అనంతరం తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున నటి సుప్రియ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు సతీమణి విరోనికా పాల్గొన్నారు. -
ఇండియన్ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ మీట్లో సుప్రియకు కాంస్యం
న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రి–2 అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మద్దాలి సుప్రియ కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల 200 మీటర్ల పరుగును 24.48 సెకన్లలో పూర్తి చేసి సుప్రియ మూడో స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్లో ద్యుతీ చంద్ (ఒడిశా–23.30 సె.) స్వర్ణం సాధించింది. తాజా విజయంతో ద్యుతీ చంద్ ఏప్రిల్ 21 నుంచి 24 వరకు దోహాలో జరిగే ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలకు అర్హత సాధించింది. సాయ్–పుల్లెల గోపీచంద్ –మైత్రా ఫౌండేషన్ సహకారంతో శిక్షణ పొందుతున్న ద్యుతీ, సుప్రియలిద్దరికీ నాగపురి రమేశ్ కోచ్‌గా ఉన్నారు. -
సీక్వెల్ షురూ
సెట్స్‌లో ఉన్నప్పుడు ‘గూఢచారి’ చిన్న సినిమా. రిలీజయ్యాక పెద్ద సినిమా. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి, పెద్ద సినిమా అయింది. అడవి శేష్, శోభిత, సుప్రియ తదితరులతో శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ సీక్వెల్ పనులు మొదలయ్యాయి. ‘గూఢచారి’ సినిమా స్క్రిప్ట్ వర్క్‌కి అసిస్టెంట్‌గా చేసిన రాహుల్ పాకాల సీక్వెల్‌కి దర్శకత్వం వహించనున్నారు. సోమవారం అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా సీక్వెల్‌ని అనౌన్స్ చేశారు. ‘‘రెండో భాగాన్ని భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశాం. ఫస్ట్ పార్ట్ సంచలనం సృష్టించిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ ఇంకా పెద్ద స్కేల్లో ఉండాలన్నది మా ఆలోచన. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభిస్తాం. 2020లో సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
కొత్త కుర్రోడు వస్తున్నాడు
శ్రీరామ్, శ్రీప్రియ జంటగా రాజా నాయుడు. ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కుర్రోడు’. లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ పతాకంపై పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్) నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. లచ్చన్న దొర మాట్లాడుతూ– ‘‘రాజా నాయుడుగారు సినిమాను అనుకున్న ప్రణాళిక ప్రకారం చక్కగా తీశారు. సినిమా బాగా వచ్చింది. సాయి ఎలెందర్ సంగీతం అందించిన మా సినిమా పాటలు ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం వల్లే సినిమాను అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం. ఎన్నో అడ్డంకులు వచ్చినా లక్ష్మణ్‌గారు మాకు అండగా నిలబడి సినిమా పూర్తి చేయించారు. మా అమ్మాయి శ్రీప్రియను ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం చేస్తున్నా’’ అన్నారు రాజా నాయుడు. శ్రీరామ్, శ్రీప్రియ మాట్లాడారు. ఈ చిత్రానికి నిర్వహణ: అబ్బూరి నాగేంద్ర చౌదరి, కెమెరా: సతీశ్ ముదిరాజ్. -
అందుకే నటన వద్దనుకున్నా
‘‘ఓ రోజు శేష్, శశి నా వద్దకొచ్చి ‘గూఢచారి’ కథ చెప్పి, నాదియా పాత్ర నన్ను చేయమన్నారు. జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. నేను నటించి దాదాపు 22 ఏళ్లవుతోంది. ఇప్పుడు నటించగలనా? లేదా? అనే నమ్మకం లేదు. ‘నేను ఆడిషన్ ఇస్తా. తర్వాత మీరే నో అంటారు’ అన్నా. ఆడిషన్ ఇచ్చాక మీకు నచ్చితే ఓకే’ అని చెప్పా. ‘ఓ నటి అయ్యుండి ఆడిషన్ ఇస్తానన్న ఫస్ట్ వ్యక్తి మీరే’ అంటూ జోక్ చేశారు. కథ, నా పాత్ర బాగా నచ్చడంతో ‘గూఢచారి’ సినిమా చేశా’’ అని సుప్రియ అన్నారు. అడివి శేష్, శోభిత ధూళిపాళ జంటగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’. అభిషేక్ నామా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేసిన సుప్రియ శనివారం విలేకరులతో మాట్లాడారు. ► ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తర్వాత నేను కెమెరా ముందుకు రాకపోయినా ప్రొడక్షన్ చూసుకుంటూ సెట్స్‌పైనే ఉంటాను కాబట్టి కెమెరా కొత్తేం కాదు. అయితే.. ఇప్పుడు కెమెరా ముందుకు అంటే కొంచెం కష్టంగా అనిపించింది. కెమెరా మన ముందున్నా లేనట్టు పలు హావభావాలతో నటించాలి. మనల్ని ఎవరో జడ్జ్ చేస్తున్నారనే భావన ఉండకూడదు. అది నిజంగా గ్రేట్ క్వాలిటీ. నిజం చెప్పాలంటే అది నాకు కొంచెం భయంగా అనిపించింది. అందుకే యాక్టింగ్ వద్దనుకున్నానేమో. నటనకు దూరమయ్యా నని ఫీల్ అవ్వలేదు. ‘గూఢచారి’ టీమ్ వల్ల కంఫర్ట్‌గా కెమెరాను ఎదుర్కొన్నా. కాకపోతే ఫస్ట్ డే అడ్జస్ట్ అవడానికి టైమ్ పట్టింది. ► నేను సినిమా చేస్తానన్నప్పుడు ‘ఎందుకమ్మా.. నీకు నచ్చదు’ అని అప్పుడు తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) అన్నారు. చేయకపోతే నచ్చదనే విషయం తెలియదు కదా తాతగారు అన్నా. కట్ చేస్తే.. ఈవీవీ సత్యనారాయణగారి డైరెక్షన్లో సినిమా చేశా. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాకి నేను డైలాగ్స్ రిహార్సల్స్ చేసుకుని వెళితే ‘ఏంటి డల్‌గా ఉన్నావు’ అనేవారు. ఆ సినిమా నాకు సరిగ్గా వర్కవుట్ కాలేదు. ‘తర్వాత ఏంటి?’ అనుకుని ప్రొడక్షన్లోకి వచ్చేశాను. అయితే ప్రొడక్షన్లో చాలా కష్టం ఉంటుంది. ► ‘గూఢచారి’లో క్లైమాక్స్ బాగా నచ్చింది. తండ్రి, కొడుకుల మధ్య ఎమోషన్ సూపర్బ్. ఓ సినిమాని మహిళలు, పురుషులు చూసే ఫీలింగ్ వేర్వేరుగా ఉంటుంది. ‘గూఢచారి’ సినిమా చూసి, ఏఎన్ఆర్ మనవరాలు బాగా చేసిందని రాజమండ్రి నుంచి ఫోన్ చేశారని నిర్మాత చెప్పినప్పుడు వెరీ హ్యాపీ. ఇప్పటికీ తాతగారి ఫ్యాన్స్ ఫోన్ చేసి బాగా చేశానని అంటుంటే హ్యాపీగా ఉంది. వారికి హ్యాట్సాఫ్. మహేశ్‌బాబు సినిమా చూసి బాగా చేశావన్నారు. ► రెగ్యులర్ కథలను మనం బ్రేక్ చేయాలి. ‘బాహుబలి, అర్జున్‌రెడ్డి, రంగస్థలం, మహానటి, ఆర్ఎక్స్ 100’ వంటి సినిమాలు చక్కటి కథాంశంతో వచ్చాయి. శుక్రవారం వచ్చిందంటే సినిమాల మధ్య పోటీ ఉండాలి. ఏ సినిమా చూద్దాం అనే ఛాయిస్ ప్రేక్షకులకు ఉండాలి. ► పవన్ కల్యాణ్ హీరోయిన్ మళ్లీ వచ్చింది అని సోషల్ మీడియాలో అంటుంటే ఫీల్ అవడం లేదు. మేం నటించి 22ఏళ్లవుతోంది. ఇప్పుడు తను స్టార్. అయితే నాకంటూ ఇప్పుడు ఓ ఐడెంటిటీ ఉంది కదా?. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో నేను ఫుల్ టైమ్ ఉద్యోగిని (నవ్వుతూ). ► డైరెక్షన్ గొప్ప కళ. నాకు ప్రొడక్షన్వైపు అన్ని విభాగాల్లో పట్టు ఉన్నా డైరెక్షన్ చేసేంత కళ లేదు. అందుకే అటువైపు వెళ్లను. కథలు రాయాలనే ఇండస్ట్రీకి వచ్చా. కానీ, ప్రొడక్షన్లోకి దిగాల్సి వచ్చింది. కథలు రాస్తా. అయితే అవి సినిమాకన్నా పెద్దగా ఉంటాయి. ► ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తర్వాత టైమ్ వేస్ట్ చేయకూడదని చిన మావయ్య (నాగార్జున)కి ఫోన్ చేసి బోర్ కొడుతోంది ఏం చేయాలన్నాను. అన్నపూర్ణ బ్యానర్లో ‘ఆహా’ సినిమా చేస్తున్నాం. ఆ వ్యవహారాలు చూసుకో అనడంతో వెరీ హ్యాపీ. ఆ సినిమాకి జయసుధగారితో రెమ్యునరేషన్ గురించి ఫోనులో మాట్లాడటం ఇప్పటికీ గుర్తుంది (నవ్వుతూ). అప్పుడు నాన్నగారు ఫోన్ తీసుకుని, జయసుధగారితో మాట్లాడారు. అప్పుడే తెలిసింది.. నాకు ఎలా మాట్లాడాలో. ► ‘గూఢచారి’కి ముందు ఓ తమిళ సినిమా ఆఫర్ వచ్చింది. భాష రాదని చేయలేదు. ‘గూఢచారి’ తర్వాత నటించాలా? వద్దా? అని ఆలోచించలేదు. ఇందులో నా పాత్ర కొంచెం నెగటివ్ షేడ్స్‌లో ఉంటుంది. ప్రతినాయక పాత్రలంటే ఇష్టం. వాటికి నేను బాగా సరిపోతానన్నది నా ఫీలింగ్. పాత్ర నన్ను ఎగై్జట్ చేస్తే చేస్తా.