
సుప్రియ
శివ, సుప్రియ, ఆరోహి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘దెయ్యం చెప్పిన కథ’. ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో పెనాక దయాకర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా పోస్టర్‌ను దర్శకుడు కోడి రామకృష్ణ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ– ‘‘టైటిల్ బాగుంది. దెయ్యం కథ చెప్పడం అనేది చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది.
ఈ చిత్రం తీసుకొచ్చే సక్సెస్‌తో ప్రదీప్, దయాకర్ రెడ్డి మరిన్ని సినిమాలు చేయాలి’’ అన్నారు. దయాకర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి హారర్ మూవీ. వెరైటీ డైలాగులు, పంచ్‌లతో పాటు కామెడీ ఉంటుంది. ఈ నెలలోనే సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. ‘‘కోడి రామకృష్ణగారు మా సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ప్రదీప్. ఈ చిత్రానికి సంగీతం: నవీన్, కెమెరా అండ్ ఎడిటింగ్: క్షేత్ర క్రియేటివ్ ఆర్ట్స్.
Comments
Please login to add a commentAdd a comment