22 ఏళ్ల గ్యాప్‌ తర్వాత | Supriya Role in Gudachari Movie | Sakshi
Sakshi News home page

22 ఏళ్ల గ్యాప్‌ తర్వాత

Published Sat, Jan 13 2018 12:08 AM | Last Updated on Sun, Jul 14 2019 4:31 PM

Supriya Role in Gudachari Movie  - Sakshi

దాదాపు 22 సంవత్సరాల తర్వాత కమ్‌బ్యాక్‌ ఇవ్వబోతున్నారు సుప్రియ. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సుప్రియ ఆ తర్వాత కథానాయికగా చేయలేదు. నటనకు బ్రేక్‌ ఇచ్చేశారు. కానీ సినిమాలకు దూరం కాలేదు. కొన్ని సంవత్సరాలుగా ‘అన్నపూర్ణ స్టూడియోస్‌’ బ్యానర్‌లో వస్తున్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు సుప్రియ.

తెరవెనక ఈ బాధ్యతను సుప్రియ చాలా సమర్థవంతంగా చేస్తుంటుందని పలు సందర్భాల్లో ఆమె మేనమామ, హీరో నాగార్జున పేర్కొన్నారు. ఇప్పుడు సుప్రియ మళ్లీ తెరపైకి రానున్నారు. అడవి శేష్, శోభిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘గూఢచారి’ సినిమాలో సుప్రియ నటిస్తున్నారు. ఏజెంట్‌ పాత్రలో కనిపిస్తారామె. శశికాంత్‌ టిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అడవి శేషే కథ అందించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకం పై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 14న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement