
న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రి–2 అథ్లెటిక్స్ మీట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మద్దాలి సుప్రియ కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల 200 మీటర్ల పరుగును 24.48 సెకన్లలో పూర్తి చేసి సుప్రియ మూడో స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్‌లో ద్యుతీ చంద్ (ఒడిశా–23.30 సె.) స్వర్ణం సాధించింది.
తాజా విజయంతో ద్యుతీ చంద్ ఏప్రిల్ 21 నుంచి 24 వరకు దోహాలో జరిగే ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలకు అర్హత సాధించింది. సాయ్–పుల్లెల గోపీచంద్ –మైత్రా ఫౌండేషన్ సహకారంతో శిక్షణ పొందుతున్న ద్యుతీ, సుప్రియలిద్దరికీ నాగపురి రమేశ్ కోచ్‌గా ఉన్నారు.