Ayyasamy Thangam
-
ఇండియన్ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ మీట్లో సుప్రియకు కాంస్యం
న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రి–2 అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మద్దాలి సుప్రియ కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల 200 మీటర్ల పరుగును 24.48 సెకన్లలో పూర్తి చేసి సుప్రియ మూడో స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్లో ద్యుతీ చంద్ (ఒడిశా–23.30 సె.) స్వర్ణం సాధించింది. తాజా విజయంతో ద్యుతీ చంద్ ఏప్రిల్ 21 నుంచి 24 వరకు దోహాలో జరిగే ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలకు అర్హత సాధించింది. సాయ్–పుల్లెల గోపీచంద్ –మైత్రా ఫౌండేషన్ సహకారంతో శిక్షణ పొందుతున్న ద్యుతీ, సుప్రియలిద్దరికీ నాగపురి రమేశ్ కోచ్‌గా ఉన్నారు. -
ఇంతకీ ఏం జరిగిందంటే..?
టెక్సాస్: అది అమెరికాలోని మిడ్ ల్యాండ్ ఒడెసా(టెక్సాస్)లో ఉన్న హెల్దీ హార్ట్ సెంటర్ ఆస్పత్రి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో భారత సంతతికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ సురేశ్ గడసల్లి...రోగులను పరీక్షించేందుకు రౌండ్స్ కు వచ్చారు. ఆయన గదిలోకి వెళ్లిన కొద్ది క్షణాలకే 'అయ్యో దేవుడా' అంటూ ఒక రోగి భయంతో బయటకు పరుగులు తీశాడు. ఆ వెంటనే పలుమార్లు తుపాకీ పేల్చిన శబ్దం వినబడడంతో ఏం జరుగుతుందో తెలియక అక్కడున్నవారంతా నిలువెల్లా వణికిపోయారు. ఇంతలో తలుపు గడియపెట్టిన చప్పుడు, మరోసారి తుపాకీ మోతతో అక్కడున్న వారు నిశ్చేష్టులయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? డాక్టర్ సురేశ్ గడసల్లిని ఆయన స్నేహితుడు అయ్యసామి తగ్నం(60) కాల్చిచంపాడు. తర్వాత అదే తుపాకీతో కాల్చుకుని అయ్యసామి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. సురేశ్ కు అత్యంత సన్నిహితుడైన అయ్యసామి ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనేది వెల్లడికాలేదు. వీరిద్దరూ కలిసి ప్రతివారం కార్డ్స్ ఆడేవారని సన్నిహితులు తెలిపారు. బెంగళూరుకు చెందిన సురేశ్ 1993లో టెక్సాస్ కు వలస వచ్చారు. తన హస్తవాసితో ప్రముఖ వైద్యునిగా పేరొందారు. సురేశ్ ను అయ్యసామి ఎందుకు హత్య చేశాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.