‘‘నా తొలి సినిమాని అశ్వినీదత్‌గారి బేనర్‌లోనే చేయాలి. కానీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జునగారు డైరెక్టర్‌గా తొలి అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరూ నాకు చిరస్మరణీయులు. వారి కుటుంబం నుంచి వచ్చి, మహిళా శక్తులుగా ఎదిగారు సుప్రియ, స్వప్నా దత్. నేను కథానాయికగా పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వీణా రావు ఫస్ట్ లుక్ దర్శన్‌ని సుప్రియ, స్వప్న విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను వీణా రావు మంచి కూచిపూడి డ్యాన్సర్. తనకి ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉండాలి’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. తారక రామారావు హీరోగా, తెలుగు అమ్మాయి వీణా రావుని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.
న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ చిత్రం నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో వీణా రావు ఫస్ట్ దర్శన్‌ని నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వ΄్నా దత్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా స్వప్నా దత్ మాట్లాడుతూ– ‘‘వీణారావు చాలా అందంగా ఉంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రావాల్సిన సమయం ఇది. చౌదరి అన్న ఈ విషయంలో ఓ అడుగు ముందుకేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ– ‘‘వైవీఎస్ చౌదరిగారు డైరెక్టర్‌గా తీసిన తొలి చిత్రం ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చూసిన తర్వాత తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) చాలా సంతోషపడ్డారు. కొత్తవారిని పరిచయం చేయడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. వీణా రావుకి ఈ అవకాశం రావడం అదృష్టం’’ అని చెప్పారు. ‘‘వీణా రావు ఫస్ట్ దర్శన్‌ని లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నగార్లకు థ్యాంక్స్’’ అన్నారు యలమంచిలి గీత. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి.
Comments
Please login to add a commentAdd a comment