
పెళ్లి చూపుల కోసం ఓ గ్రామానికి వెళ్లిన ఓ యువకుడు, ఆ ఊరిలో జరిగిన హత్యల కేసులో ఇరుక్కుంటాడు? ఆ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? అతను తెలుసుకున్న తత్వం ఏమిటి? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘తత్వం’(Tatvam). దినేష్ తేజ్, దష్విక .కె హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఇది. అర్జున్ కోల దర్శకత్వంలో త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె. ప్రోడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ మర్డర్ మిస్టరీ మూవీలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా ఉంటుంది’’ అని వంశీ సీమకుర్తి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమేరా: భరత్ పట్టి.